హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

ఇండియాలోని ప్రముఖ కంపెనీలలో హ్యుండాయ్ కంపెనీ ఒకటి. ఇప్పుడు హ్యుండాయ్ కంపెనీ నుంచి మరొక బ్రాండ్ రాబోతోంది. దానిపేరే హ్యుండాయ్ ఆరా.

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

హ్యుండాయ్ ఆరా అనేది భారతీయ మార్కెట్లో వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల కాబోతోంది. ఇది ఇండియన్ మార్కెట్ కోసం తయారు చేయబడిన కాంపాక్ట్-సెడాన్ మోడల్ మరియు ప్రస్తుత మోడల్ ను భర్తీ చేయనుంది. హ్యుండాయ్ ఆరా పూర్తిగా కొత్త మోడల్లో రాబోతుంది.

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

రాబోయే ఈ కొత్త మోడల్ కూడా మరింత ఆధునికంగాను మరియు స్పోర్టీయర్ గాను కనిపిస్తుంది. ఇది ఇటీవల దేశంలో ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ 10 నియోస్ యొక్క హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించబడింది.

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

హ్యుండాయ్ యొక్క కొలతలను పరిశీలించినట్లయితే 3,995 మిమీ పొడవు, 1,520 మిమీ ఎత్తు, వెడల్పు 20 మిమీ, వీస్ బేస్ 25 మిమీ కలిగి ఉంటుంది. ఈ కొలతలు వాహన వినియోగ దారులకి అంటే డ్రైవర్లకు, ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. కావున ఈ వాహనాన్ని ఈ విధమైన కొలతలతో తయారు చేయడం జరిగింది.

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

హ్యుండాయ్ ఆరా డిజైన్ పరంగా చూసినట్లయితే ఇది నియోస్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఆరా ని మరియు నియోస్ ని వేరు చేయడానికి వీటిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఫ్రంట్ క్యాస్కేడింగ్ గ్రిల్‌లో డబుల్ బూమేరాంగ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్ ఇందులో ఉంటుంది. నియోస్ లో కూడా ఇది ఒకే స్థానంలో ఉంటుంది. ఇది కాకుండా ఆరా కొత్త స్టైలిష్ రియర్ డిజైన్లతో వస్తుంది. ర్యాంప్ చుట్టూ ఎల్ఇడి లైట్లు అమర్చబడి ఉంటుంది. నియోస్ లో లాగ హ్యుండాయ్ ఆరాలో పైకప్పు కూడా పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటుంది.

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

కొత్త ఆరా యొక్క ఇంటీరియర్ ని హ్యుండాయ్ వెల్లడించలేదు. కానీ గ్రాండ్ ఐ 10 నియోస్ కి సమానంగా ఉంటుందని తెలుస్తుంది. ఇంకా ఇందులో డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పుష్ బటన్ స్టార్ట్ & స్టాప్ మరియు హోస్ట్ వంటివి ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి.

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

రాబోయే హ్యుండాయ్ ఆరాలో ఇంజిన్ల ఎంపిక ఇప్పటికే ప్రకటించబడింది. ఆరాలో మూడు ఇంజిన్లు ఉంటాయని ప్రకటించింది. అందులో ఒక ఇంజిన్ డీజిల్ మిగిలిన రెండు పెట్రోల్ తో ఉంటాయి. డీజిల్ ఇంజిన్లలో చూస్తే 1.2 లీటర్ ఇంజిన్ 83 బిహెచ్‌పి మరియు 113 ఎన్ఎమ్ టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా రెండవది పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ ని కలిగి ఉంటుంది.

Read More:మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

హ్యుండయ్ వేదికపై ప్రారంభమైన ఆరా ఇంజిన్ 120 బిహెచ్‌పి 172 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మూడు ఇంజిన్లు ప్రామాణికంగా ఐదు స్పీడ్ మనువల్తో జత చేయబడతాయి. మిగిలిన రెండు ఇంజిన్లు ఐచ్చిక ట్రాన్స్మిషన్ లను కలిగి ఉంటాయి.

Read More:ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

హ్యుండాయ్ ఆరాపై ఉన్న ఆలోచనలు:

హ్యుండాయ్ ఆరా అనేది భారత మార్కెట్లో అవుట్గోయింగ్ ఎక్సెంట్ మోడల్ యొక్క తరువాతి తరం వెర్షన్. ఈ హ్యుండై ఆరా భారతదేశంలో ఒకసారి లాంచ్ చేయబడిన తరువాత ఇది మారుతి సుజుకి డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, టాటా టైగర్ మరియు హోండా అమేజ్ వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా ఉండవలసి వస్తుంది. ఏది ఏమైనా మార్కెట్లో హ్యుండాయ్ ఆరా గట్టిపోటీని ఎదుర్కోబోతుంది అని తెలుస్తుంది.

Most Read Articles

English summary
Hyundai Aura Unveiled: Expected Launch Date, Prices, Engine Options & All Other Details Revealed-Read in Telugu
Story first published: Friday, December 20, 2019, 17:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X