హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

హ్యుందాయ్ విపణిలోకి సరికొత్త కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇటీవల విడుదల చేసింది. అయితే, ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. ప్రతి కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. 2.9 లక్షల వరకు కేంద్రమే చెల్లించాలని భావిస్తోంది. షాక్ అయ్యారా...? మీరు చదివింది అక్షరాలా నిజమే.

పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి....

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల మీద ఉన్న జీఎస్టీ వీలైనంత వరకు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ మండలి కోరినట్లు తెలిపారు.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

ఎలక్ట్రిక్ కార్ల మీద జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని జీఎస్టీ మండలికి నివేదించారు. కానీ తుది నిర్ణయం ఇది కాదు. జీఎస్టీ తగ్గింపు అన్ని ఎలక్ట్రిక్ కార్లకు వర్తింపజేస్తారా... లేదంటే ఒక నిర్ధిష్ట ధరల శ్రేణిలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే అమలు చేస్తారా అనే విషయం కూడా ఇకా స్పష్టం కాలేదు. ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలి ఆమోదిస్తే హ్యుందాయ్ కోనా కారుతో పాటు అన్ని ఎలక్ట్రిక్ కార్ల మీద ధరలు విపరీతంగా తగ్గనున్నాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

హ్యుందాయ్ ఇండియా సీనియర్ జనరల్ మేనేజర్ & మార్కెటింగ్ విభాగాధిపతి పునీత్ ఆనంద్ మాట్లాడుతూ, కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ తగ్గింపు ఆలోచన అమల్లోకి వస్తే హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీ మీద రూ. 1.40 లక్షల వరకు ధర తగ్గనుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు మరో అదనపు ప్రయోజనం కూడా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను ప్రోత్సహించేందుకు FAME-2 క్రింద ప్రతి ఎలక్ట్రిక్ కారు లోన్ మీద వచ్చే వడ్డీలో రూ. 1.50 లక్షల వరకు రాయితీ కల్పించాలనే ఆలోచనలో ఉంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, సాంకేతికంగా ఇందులో 39.2kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ వ్యవస్థ ఉంది. ఇది గరిష్టంగా 136బిహెచ్‌‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 9.7 సెకన్లలో 0-100కిమీల వేగాన్ని అందుకోగల హ్యుందాయ్ కోనా ఒక్కసారి ఛార్జింగ్‌తో 452కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బ్యాటరీ 50kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం గంట వ్యవధిలోనే 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. సాధారణం ఛార్జర్‌తో అయితే సుమారుగా 6 గంటల సమయం పడుతుంది. ఈ రెండు ఛార్జర్లు హ్యుందాయ్ అందిస్తోంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మీద రెండు రకాల వారంటీ అందిస్తోంది. ఒకటి 3 సంవత్సరాలు/అపరమిత కిలోమీటర్లు మరొకటి 8 సంవత్సరాలు/1.60 లక్షల కిలోమీటర్లు. కోనా కారును సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో డీసీ ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 2.90 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

FAME-2 స్కీమ్ క్రింద ఎలక్ట్రిక్ కారు మీద తీసుకునే లోనుపై వచ్చే వడ్డీలో రూ. 1.50 లక్షల రాయితీ కల్పించడం మరియు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 12 నుండి 5 శాతానికి తగ్గిస్తే ఏకంగా రూ. 2.90 లక్షల వరకు ప్రయోజనాలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కు అందనున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి!

Most Read Articles

English summary
The Hyundai Kona Electric May Witness A Rs 1.40 Lakh Price Drop. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X