రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

హ్యుందాయ్ ఇండియాలో తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. దీని పేరు కోన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. రేపు ఇది మార్కెట్‌లోకి రానుంది. దేశీ మొట్టమొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే అని తెలిపింది. మరి ఇందులో ఉన్న కొత్త ఫీచర్లను, ధరలను వివరంగా తెలుసుకొందాం రండి..

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్ లో 39 కిలోవాట్ మరియు 64 కిలోవాట్ బ్యాటరీ లతో ప్రపంచవ్యాప్తంగా లభ్యం అవుతుంది, హ్యుందాయ్ భారత్ లో మొదటి లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనమైన కోన ఎలక్ట్రిక్ను తయారు చేసింది. హ్యుందాయ్ ఇప్పటికే గత నెల 25 యూనిట్ల కోన కార్ లను డీలర్ షిప్ లకు చేర్చింది.

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

డిసెంబర్ 2019 నాటికి ఇక్కడ ఎంజి ఈజెడ్ఎస్ విడుదలలోపు దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థి లేని కారణంగా రూ .25 లక్షల ధర ఉండే అవకాశం ఉంది.హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్ లో 64కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో, ఆర్ఆర్ఎఐ ప్రకారం సింగిల్ ఛార్జ్ మీద సుమారుగా 452కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు.

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

దీని యొక్క 150 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 204 బిహెచ్ పి మరియు 395ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, దీని వలన ఇది 7.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు టాప్ స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించవచ్చు.

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

ఢిల్లీ-ఎన్ సిఆర్, ముంబై, హైద్రాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటుగా మొర్తం 16 భారతీయ నగరాల్లో మాత్రమే కోన ఎలక్ట్రిక్ ని విక్రయించాలని హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది. కేవలం 54 నిమిషాల్లో కోనా ఎలక్ట్రిక్ ను 80 శాతం వరకు ఛార్జ్ చేయగల 100కిలోవాట్ డిసి ఛార్జింగ్ యూనిట్ కు అవకాశం ఉన్న వేగవంతమైన ఛార్జింగ్ పరికరాన్ని కలిగి ఉంది.

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

మీ వ్యక్తిగత వినియోగం కొరకు, హ్యుందాయ్ ఒక ఆప్షనల్ వాల్ బాక్స్/ఎసి ఛార్జింగ్ స్టేషన్ ని అందిస్తుంది, ఇది ఫుల్ బ్యాటరీ టాప్ అప్ కొరకు 10 గంటల సమయం తీసుకుంటుంది. కాకపోతే వ్యక్తిగత ఉపయోగం కోసం ఫాస్ట్ చార్జర్లు ఏవీ ఉండవు.

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

ఫీచర్స్ విభాగంలో, హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ లో, డిఆర్ఎల్ తో కలిగిన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ యూనిట్ తో ఆపిల్ కారప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, సబ్ వూఫర్ తో 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు మరియు వైర్ లెస్ చార్జింగ్.

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

సేఫ్టీ ఫీచర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, రీఆర్వ్యూ పార్కింగ్ కెమెరా, ఎబిఎస్ తో ఈబిడి మరియు మరికొన్ని ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం జీఎస్టీని తగ్గించే ప్రతిపాదన ఉన్నందువలన, సమీప భవిష్యత్తులో హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ నిజంగా మంచి విజయాన్ని పొందనుంది.

రేపు లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

దీనివలన ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ఎక్స్ షోరూమ్ ధరలను గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లపై రుణం తీసుకోవాలని చూస్తున్న వారు కూడా పన్ను మినహాయింపుల ద్వారా రూ. 2.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది. మరి దీనికి పోటీగా ఏ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ కార్ ను విడుదల చేస్తుందో చూడాలి.

Most Read Articles

English summary
Hyundai is all set to enter the long dormant Indian EV market with the Kona Electric tomorrow.Read in Telugu.
Story first published: Monday, July 8, 2019, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X