హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల అనంతరం హ్యుందాయ్ తమ తొలి ఎలక్ట్రిక్ కారు సరికొత్త కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లోకి ఇటీవల లాంచ్ చేసింది. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన హ్యుందాయ్ కోనా కొన్ని తరాల పాటు విపణిలో నిలిచిపోనుంది.

మెరుగైన వాహన ప్రయాణాన్ని అందించడంతో పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తుల మీద హ్యుందాయ్ దృష్టిసారించింది. ఇందులో భాగంగానే కంపెనీ రూపొందించిన అత్యద్భుతమైన ఆవిష్కరణ హైడ్రోజన్ పవర్‌తో నడిచే ఫ్యూల్ సెల్ ఎస్‌యూవీ. నెక్సో ఫ్యూయల్ సెల్ కారుగా ఆవిష్కరించిన ఈ మోడల్‌ను ఇప్పుడే దేశీయంగా విడుదల చేసేందుకు హ్యుందాయ్ సమాయత్తమవుతోంది.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

హ్యుందాయ్ నెక్సో ఎస్‌యూవీ మిగతా కార్ల మాదిరిగా పెట్రోల్ లేదా డీజిల్‌తో నడవదు. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్‌తో నడుస్తుంది. హ్యుందాయ్‌కి సొంత మార్కెట్‌గా చెప్పుకునే దక్షిణ కొరియా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నెక్సో ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV) అమ్మకాల్లో ఉంది.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా 2021 నాటికి హ్యుందాయ్ నెక్సో ఎస్‌యూవీని దేశీయ విపణిలోకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. గత ఏడాది జరిగిన భారత్-కొరియా వ్యాపార సమావేశాల్లో భాగంగా హ్యుందాయ్ తమ నెక్సో ఎస్‌యూవీని తొలిసారిగా ప్రదర్శించింది.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

నెక్సో ఫ్యూయల్ సెల్ ఎస్‌యూవీలోని ప్రత్యేకత దీని ఇంజన్ వ్యవస్థలోనే దాగుంది. సాంకేతికంగా ఇందులో రెండు ఇంజన్ వ్యవస్థలు ఉన్నాయి. అందులో ఒకటి, ఎలక్ట్రిక్ సిస్టమ్... ఎలక్ట్రిక్ మోటార్లు 161బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. కేవలం ఎలక్ట్రిక్ సిస్టమ్ మీదనే 9.5 సెకన్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

రెండవది.. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్. సిటీలో ఉన్నంత వరకు కారు ఎలక్ట్రిక్ సిస్టమ్ మీదనే నడుస్తుంది. కానీ హైవే చేరుకున్నపుడు హైడ్రోజన్ ఇంధన ద్వారా నడుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లకు కీలక ప్రత్యామ్నాయం. నిజానికి హైడ్రోజన్ పవర్ ఇంజన్‌లు పెట్రోల్, డీజల్ కార్లను మరిపిస్తాయి. కేవలం 5 నిమిషాల్లో హైడ్రోజన్ ఇంధనాన్ని నింపవచ్చు.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ నెక్సో ఫ్యూయల్ సెల్ ఎస్‌యూవీలో ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే ఏకంగా 800కిమీలు ప్రయాణించవచ్చు. కానీ, ఇండియన్ వెర్షన్ నెక్సో ఎస్‌యూవీ 1,000కిమీల మైలేజ్ ఇస్తుందని సమాచారం.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

నెక్సో ఎస్‌యూవీని కంపెనీ యొక్క బెస్పోక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. హ్యుందాయ్ సంస్థ ఇదే ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా మరెన్నో మోడళ్లను ప్రాణం పోయనుంది. దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండేలా నెక్సో ఎస్‌యూవీలో 156-లీటర్ల హైడ్రోన్ ఫ్యూయల్ ట్యాంక్ అందిస్తున్నారు.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

హ్యుందాయ్ నెక్సో ఫ్యూయల్ సెల్ కారు ఇంజన్ సిద్దం చేయడానికి (Warmup) కేవలం 30 సెకన్లు మాత్రమే తీసుకుంటుంది. ప్రపంచ మార్కెట్లో లభించే ఇతర హైడ్రోజన్ కార్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ సమయం. ప్రస్తుతం హోండా క్లారిటీ మరియు టయోటా మిరాయ్ అనే రెండు మోడళ్లు హైడ్రోజన్ పవర్‌తో లభిస్తున్నాయి.

హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎస్‌యూవీ: ఫుల్ ట్యాంకుతో 1000కిమీల మైలేజ్

కార్లలో హైడ్రోజన్ ఇంధనాన్ని నింపేందుకు పెట్రోల్ స్టేషన్ల తరహాలో ప్రత్యేకమైన ఫ్యూయల్ స్టేషన్లు అవసరమవుతాయి. పెట్రోల్, డీజల్ నింపడానికి ఉపయోగించే గన్ తరహాలోనే హైడ్రోజన్ ఫిల్ చేసేందుకు ప్రత్యేకమైన నాజిల్ గన్ ఉంటుంది. ఇది కేవలం 5-నిమిషాల్లోనే ట్యాంకు పూర్తిగా నింపేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ కార్ల కంటే హైడ్రోజన్ కార్లను ఉపయోగించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.

Most Read Articles

English summary
Hyundai Nexo Hydrogen Car India Launch Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X