ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఒక్క రోజే ఏకంగా 12,500 కార్లను కస్టమర్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. దీపావళికి ముందు రోజున ఉత్తర భారతీయులు ప్రముఖంగా జరుపుకునే "దంతేరాస్" పండుగ రోజున దేశవ్యాప్తంగా 12,500 కార్లను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

హ్యుందాయ్ మోటార్స్ భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా రాణిస్తోంది. మారుతి సుజుకి తర్వాత ఎక్కువ మంది కొంటున్న కార్లు హ్యుందాయ్ కంపెనీవే.. ప్రతి విడుదలయ్యే టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి మరియు హ్యుందాయ్ కార్లదే స్థానం.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

హ్యుందాయ్ ఇటీవల కొత్తగా విడుదల చేసిన వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లకు ఇండియన్ మార్కెట్లో భారీ స్పందన లభించింది. గత రెండు మూడు నెలలుగా హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ సేల్స్ విపరీతంగా పెరిగాయి.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

హ్యుందాయ్ వెన్యూ మరియు గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లతో పాటు క్రెటా ఎస్‌యూవీ, ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మంచి ఫలితాలు సాధించాయి. ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 నిలిచింది.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

ఈ నాలుగు మోడళ్లు హ్యుందాయ్ సంస్థకు అత్యుత్తమ సేల్స్ తీసుకొచ్చాయి. గత ఏడాది శాంట్రో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును దేశీయ మార్కెట్లోకి రీలాంచ్ చేశారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

హ్యుందాయ్ ప్రస్తుతం తమ అన్ని ఇంజన్‌లను అప్‌డేట్ చేసే పనిలో నిమగ్నమైంది. గ్రాండ్ ఐ10 నియోస్ కారులో ఇప్పటికే బిఎస్6 ఇంజన్ అందివ్వగా.. 2020 ప్రారంభం నాటికల్లా అన్ని మోడళ్లలో బిఎస్-6 ఇంజన్‌లను అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉంది.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

ఇంజన్ అప్‌డేట్స్‌తో పాటు న్యూ జనరేషన్ క్రెటా ఎస్‌యూవీని అతి త్వరలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కొత్త తరం క్రెటా ఎస్‌యూవీని 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్ల పరంగా ఇందులో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

ఇంజన్ విషయానికి వస్తే.. తమ తోబుట్టువయిన కియా మోటార్స్ మార్కెట్లో విక్రయిస్తున్న సెల్టోస్ ఎస్‌యూవీలో ఉన్నటువంటి బిఎస్-6 పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.

ఇదీ రికార్డ్ అంటే.. ఒక్క రోజే 12,500 కార్లు డెలివరీ!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కేవలం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 12,500 కార్లను డెలివరీ ఇచ్చినట్లు హ్యుందాయ్ మోటార్స్ ప్రకటించింది. పండుగ పర్వదినాల్లో కొత్త కార్లను కొనడానికి ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారు. దీపావళి (దంతేరాస్) పండుగ రోజుల్లోనే కొత్త వస్తువు కొనాలనే కస్టమర్లు మరీ ఎక్కువ. ఎంజీ మోటార్స్ కూడా ఒకే రోజు 700 హెక్టర్ ఎస్‌యూవీలను డెలివరీ ఇచ్చినట్లు ప్రకటించింది.

Most Read Articles

English summary
Hyundai Registers 12,500 Car Deliveries In A Single Day On Dhanteras. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X