హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తమ శాంట్రో హ్యాచ్‍బ్యాక్ కారును మరో కొత్త వేరియంట్లో నిశ్శబ్దంగా మార్కెట్లోకి లాంచ్ చేసింది. హ్యుందాయ్ శాంట్రో ఇండియన్ మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా స్పెషల్ "యానివర్సరీ ఎడిషన్" వేరియంట్ కారును విపణిలోకి రిలీజ్ చేశారు.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

హ్యుందాయ్ యానివర్సరీ ఎడిషన్ శాంట్రో కారు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండు ఆప్షన్లలో లభ్యమవుతోంది. యానివర్సరీ ఎడిషన్ శాంట్రో మ్యాన్యువల్ వెర్షన్ ధర రూ. 5.12 లక్షలు మరియు ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 5.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

హ్యుందాయ్ శాంట్రో స్పోర్ట్జ్ ( Sportz) వేరియంట్ ఆధారంగా యానివర్సరీ ఎడిషన్ ప్రవేశపెట్టారు. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో పలు కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి. కార్ దునియా రిలీజ్ చేసిన వీడియో రెగ్యులర్ వేరియంట్ మరియు యానివర్సరీ ఎడిషన్ వేరియంట్‌కు మధ్య ఉన్న తేడాలను వివరించారు.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

శాంట్రో యానివర్సరీ ఎడిషన్ ఎక్ట్సీరియర్‌లో బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్లు మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి. వీల్ కవర్లను గన్ మెటల్ గ్రే కలర్ ఫినిషింగ్‌లో అందించారు. అంతేకాకుండా, వెనుక డిజైన్ మరియు బాడీకి ఇరువైపులా క్రోమ్ స్టైలింగ్స్ సొబగులు అందించారు.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

సరికొత్త శాంట్రో యానివర్సరీ ఎడిషన్ కారును రెండు విభిన్న కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. అవి, పోలార్ వైట్ మరియు సరికొత్త ఆక్వా టీల్. యానివర్సరీ ఎడిషన్‌లో ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ సీట్లు కూడా అందించారు.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

పలు కాస్మొటిక్ మరియు స్టైలింగ్ పరమైన మార్పులు మినహాయిస్తే, సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులోని 1.1-లీటర్ కెపాసిటీ గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‍పి పవర్ మరియు 99ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచకోవచ్చు.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

హ్యందాయ్ శాంట్రో సీఎన్జీ వెర్షన్‌లో కూడా లభ్యమవుతోంది. హ్యుందాయ్ ఫ్యాక్టరీలో ఫిట్ చేసిన సీఎన్జీ కిట్ జోడింపు గల పెట్రోల్ ఇంజన్‌తో శాంట్రో కారు లభిస్తోంది. సీఎన్జీ వెర్షన్‌లో ఈ ఇంజన్ 58బిహెచ్‌పి పవర్ మరియు 84ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిని కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఎంచుకోగలం.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

హ్యుందాయ్ శాంట్రో ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ కలదు, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రియర్ ఏసీ వెంట్స్ మరియు ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల సైడ్ మిర్రర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

సేఫ్టీ పరంగా హ్యుందాయ్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్‌లో ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్లు, హై-స్పీడ్ వార్నింగ్, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి.

హ్యుందాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లాంచ్: ధర చూస్తే షాకవ్వాల్సిందే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పండుగ సీజన్‌లో సేల్స్ పెంచుకునే లక్ష్యంతో హ్యుందాయ్ తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ శాంట్రో కారును ఒక కొత్త వేరియంట్లో లాంచ్ చేసింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ నష్టాలు ఎదర్కుంటున్న తరుణంలో సేల్స్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా శాంట్రో యానివర్సరీ ఎడిషన్ కారును ప్రవేశపెట్టారు. పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో వచ్చిన శాంట్రో స్పోర్టివ్ మరియు బ్లాక్ఔట్ కలర్ స్కీమ్‌లో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. యువ కొనుగోలుదారులను ఇది ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

Most Read Articles

English summary
Hyundai Santro Anniversary Edition Launched. Read in Telugu.
Story first published: Tuesday, October 22, 2019, 11:12 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X