Just In
Don't Miss
- News
citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదం
- Lifestyle
మీ రాశిని బట్టి 2020లో ఏ నెల మీకు ప్రమాదకరమైన మరియు దురదృష్టకరమైన నెల అవుతుందో మీకు తెలుసా?
- Movies
మెగా అభిమాని మరణం.. ఫ్యామిలీని ఆదుకునేందుకు రంగంలోకి రామ్ చరణ్
- Technology
పీసీ సరిగా పనిచేయడం లేదా, అయితే ఇది చూడండి
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Finance
మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
హ్యుందాయ్ వెన్యూ పై కొత్త బిఎస్-6 డీజల్ ఇంజిన్ వస్తోంది
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు వెన్యూ తో గట్టి కౌంటర్ ఇచ్చిన హ్యుందాయ్ ఇండియా ఇప్పుడు దీనిపై మరో కొత్త ఇంజిన్ ను తీసుకురానుంది. సబ్‌కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన వెన్యూ త్వరలో సరికొత్త బిఎస్-6 ఇంజిన్ ను తీసుకురానుంది, వివరాలలోకి వెళితే..

హ్యుందాయ్ వెన్యూ పై బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కొత్త 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త ఇంజన్ రెండు కాన్ఫిగరేషన్ లలో వస్తుంది. వాటిలో ఒకటి (విజిటి) వేరియబుల్ జియోమెట్రీ టర్బో డీజల్ ఇంజన్, ఇది 115 బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

రెండోది న్యాచురల్ యాస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్, ఇది సుమారు 90 బిహెచ్పి మరియు 220 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఏప్రిల్ 2020 లో రానున్న బిఎస్-6 గడువు తర్వాత తమ వద్ద ఉన్న 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ లను నిలిపివేయనున్నట్లు హ్యుందాయ్ ధ్రువీకరించింది.

దీనికి బదులుగా, హ్యుందాయ్ ఒక కొత్త 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ను ఉపయోగించనుంది, ఇది కియా సెల్టోస్ ఎస్యువి లో ఇప్పటికే అందించబడుతోంది. ఈ వివరాలను కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ ను లాంచ్ చేసేటప్పుడు హ్యుందాయ్ కంపెనీ ధ్రువీకరించింది.

ఈ వెన్యూ లో ప్రస్తుతం మూడు ఇంజన్ లు ఉన్నాయి, వాటిలో ఒక 1.2-లీటర్ పెట్రోల్, ఒక 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ లను అందిస్తున్నారు. 1.5-లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ డీజల్ ఇంజన్ 1.4-లీటర్ డీజల్ ఇంజన్ ను భర్తీ చేయనుంది.

1.5-లీటర్ విజిటి డీజల్ ఇంజన్ 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ను భర్తీ చేయనుంది. హ్యుందాయ్ వారి లైనప్ లో ఉన్న విభిన్న మోడల్స్ మధ్య కొత్త డీజిల్ ఇంజిన్‌తో వెన్యూ రానుంది. ఈ వెన్యూ లో విజిటి ఇంజిన్ ను ఉపయోగించేలా చేస్తుందని మేము ఆశిస్తున్నాము.

ఇది నెక్స్ట్ జనరేషన్ ఐ20 హ్యాచ్ బ్యాక్ లో మరియు వెర్నా మరియు క్రెటా యొక్క వేరియెంట్ లలో కూడ రానుంది. హ్యుందాయ్ ఒక సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను మాత్రమే కలిగి 90 బిహెచ్పి ఉత్పత్తి చేసే 1.4-లీటర్ డీజల్ ఇంజన్ తో వెన్యూ ను ఆఫర్ చేసింది.
Most Read:టాటా హారియర్ కొత్త డార్క్ ఎడిషన్ ఇదే

ఏప్రిల్ 1, 2020 న బిఎస్-6 డెడ్ లైన్ కు దగ్గరగా కొత్త ఇంజిన్ తో వెన్యూ ను ప్రారంభించాలని కంపెనీని భావిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ వారి ఇన్-హౌస్ బ్లూలింక్ టెక్నాలజీతో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే మొదటి కార్లలో ఒకటిగా ఉంది.
Most Read:మేడ్‌ఇన్ ఆంధ్రప్రదేశ్: కియా సెల్టోస్ విడుదల

ఇతర ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్లప్లే కంపాటబిలిటీ లు ఉన్నాయి.
Most Read:హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కొంటున్న కస్టమర్లకు గుడ్‌న్యూస్!

హ్యుందాయ్ వెన్యూ లో భద్రత పరంగా చూస్తే ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్-అసిస్ట్ కంట్రోల్, వేహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డిజిటల్ గైడ్ లైన్స్ తో రివర్స్ పార్కింగ్ కెమెరా, మరియు ఈబిడి వంటి భద్రతా ఫీచర్లను అందిస్తోంది.

ఈ వెన్యూ ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే 50,000 పైగా బుకింగ్స్ ను నమోదు చేసింది. అయినా కంపెనీ మళ్లీ కొత్త ఫీచర్లతో ఈ కాంపాక్ట్ ఎస్యువి ని భారతీయ వాహన ప్రియులను ఆకర్షించాలని చూస్తోంది. హ్యుందాయ్ వెన్యూ కు పోటీగా టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్యూవి300 మరియు మారుతి వితారా బ్రెజ్జా లు ఉన్నాయి.