ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

కొరియన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ విడుదల చేసిన వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ రికార్డులు బద్దలుకొడుతోంది. 2019 ఏడాదిలోపే లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటేస్తుందని కూడా హ్యుందాయ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. విడుదలైన కేవలం ఏడు నెలల్లోనే పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు ఊహించని పోటినిచ్చింది.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో దేశీయంగా రీసెర్చ్ & డెవలప్ చేసిన మోడల్ మరియు ఎన్నో దేశాలకు ఇండియా నుండే ఎగుమతి అవుతోంది.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ ఇండియన్ మార్కెట్‌తో పాటు నేపాల్, భూటాన్ మరియు మారిషస్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అంతే కాకుండా దక్షిణాఫ్రికా దేశాలకు కూడా త్వరలోనే ఎగుమతి చేస్తున్నట్లు హ్యుందాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ కంపెనీ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ. అంతే కాకుండా కనెక్టెడ్ ఫీచర్లతో వచ్చిన తొలి హ్యుందాయ్ కారు కూడా ఇదే కావడం గమనార్హం. హ్యుందాయ్‌కు చెందిన "బ్లూ-లింక్" కనెక్టివిటీ టెక్నాలజీ ద్వారా ఎన్నో కనెక్టెడ్ ఫీచర్లను వెన్యూ ఎస్‌యూవీలో పరిచయం చేశారు.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్ గల 8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్-లెస్ ఛార్జింగ్ ఇంకా ఎన్నో ఫీచర్లు దీని సొంతం.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని మూడు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. వీటిలో 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (ఐ20 కారు నుండి సేకరించిన) 82బిహెచ్‌‌పి మరియు 115ఎన్ఎమ్ పవర్‌నిస్తుంది, దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ మరో శక్తివంతమైన 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభిస్తోంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 172ఎన్ఎమ్ టార్క్‌‌నిస్తుంది.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ E, S, SX, SX (O), SX+ and SX+(O) అనే విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటి ధరల శ్రేణి రూ. 6.50 లక్షల నుండి రూ. 11.1 లక్షల మధ్య ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ ప్రస్తుతం ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు సరాసరి పోటీనిస్తోంది.

ఇందులో దమ్ముంది.. రికార్డులు దున్నేస్తున్న హ్యుందాయ్ వెన్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంటో ఎంతగానో బలపడింది. ప్రతి కార్ల తయారీ సంస్థకు ఇది ప్రధానమైన సెగ్మెంట్. పోటీ ఎక్కువ కావడంతో అత్యుత్తమ ఇంజన్, వేరియంట్లు, ఫీచర్లు మరియు సరసమైన ధరతో లభించే మోడళ్లకే కస్టమర్లు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన హ్యుందాయ్ వెన్యూ పోటీదారుల కంటే మెరుగైనదిగా నిరూపించుకుని అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది.

Most Read Articles

English summary
Hyundai Venue Bookings Cross New Milestone: To Close At One Lakh Bookings Since Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X