మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ, ఫోర్డ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు హ్యుందాయ్ భారత మార్కెట్లోకి తన వెన్యూ విడుదల చేసింది. అయితే అనుకొన్న విధంగా ఈ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ కావలసిన విజయాన్ని పొందింది. ఇప్పటికే దీని సేల్స్ అదిరిపోయే విధంగా జరుగుతున్నాయి. మరి దీని అమ్మకాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం రండి..

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

హ్యుందాయ్ ఇండియా ఈ వెన్యూ ఎస్‌యూవీ ను మే నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ అని చెప్పవచు మరియు ఇది మార్కెట్ లో అత్యంత విజయాన్ని అందుకుంది. అమ్మకాల్లో దాని మొదటి నెలలో, హ్యుందాయ్ వెన్యూ 8,763 యూనిట్లు నమోదు చేసింది.

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

సుమారుగా 100 యూనిట్ల తేడాతో మారుతి విటారా బ్రెజ్జా జూన్ 2019 లో 8,871 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకున్న మొదటి స్థానంలో ఉంది, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా గత ఏడాదితో పోలిస్తే 17 శాతం మేర నష్టాన్ని చవి చూసినది.

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

మారుతి సుజుకి గత కొన్ని నెలలుగా నిలకడగా మార్కెట్ లో అమ్మకాలను నమోదు చేస్తూ వచ్చింది, అయితే హ్యుందాయ్ వెన్యూ, విటారా బ్రెజ్జా యొక్క అమ్మకాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఉంది.

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాప్ కార్లను సవాలు చేస్తూ, ఈ సెగ్మెంటుకు గట్టిపోటీని ఇస్తోంద. హ్యుందాయ్ వెన్యూ ఒక కొత్త పరికరాల జాబితాతో పాటు తాజా ఫీచర్లు మరియు టెక్నాలజీని కూడా తీసుకొస్తుంది. స్టైలిష్ డిజైన్ తో కలిపి ఇది మార్కెట్ లో అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది.

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

హ్యుందాయ్ వెన్యూ ఇప్పటికే తన క్రెటా ఎస్‌యూవీ కార్ను అధిగమించింది, మార్కెట్ లో క్రెటా కూడా జూన్ 2019 నెలలో టాప్-సెల్లింగ్ కార్ల జాబితాలో చేరింది - ఇక్కడ జూన్ 2019 లో టాప్-10 కార్ల జాబితా ఉంది. ఈ వెన్యూ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ లలో ఒకటిగా నిలిచింది.

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

ఈ ఎస్‌యూవీ, సెగ్మెంట్ ఫస్ట్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను కలిగి ఉంది, ఇది అత్యంత పోటీతత్వంతో కూడి ఉంది. హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ. 6.50 లక్షలు ఉండగా టాప్-స్పెక్ వేరియంట్ రూ. 11.10 లక్షల ప్రైస్ ట్యాగ్ తో ఉంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉన్నాయి.

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

ఈ వెన్యూ లో మూడు ఇంజన్ ఆప్షన్లతో పాటు 1.2-లీటర్ పెట్రోల్ మరియు ఒక 1.4-లీటర్ డీజల్, వరుసగా ఎలైట్ ఐ20 మరియు క్రెటా ద్వారా అప్పుగా ఇచ్చింది. ఇందులో 121బిహెచ్ పి మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే కొత్త 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బో-పెట్రోల్ కూడా ఉంది. ఇది సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏడు-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ఆప్షన్ తో వస్తుంది.

మారుతీ విటారా బ్రెజ్జా వెనక్కి నెట్టే విధంగా హ్యుందాయ్ వెన్యూ సేల్స్

హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలపై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

హ్యుందాయ్ వెన్యూ ఆరంభం నుండి మంచి అమ్మకాలు సంపాదించింది. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే మహీంద్రా ఎక్స్యూవి 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ అమ్మకాలను అధిగమించింది మరియు అమ్మకాలలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న మారుతి విటారా బ్రెజ్జా ను కూడా అధిగమించే విధంగా ఉంది.

Most Read Articles

English summary
Hyundai Venue Sales Off To A Flying Start. Gives Stiff Competition To Maruti Vitara Brezza. Read in Telugu.
Story first published: Wednesday, July 10, 2019, 15:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X