2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

స్కోడా సరికొత్త ర్యాపిడ్ సెడాన్ కారు టీజర్ రిలీజ్ చేసింది. 2020 వెర్షన్ స్కోడా ర్యాపిడ్ అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వేదికగా 2020 ర్యాపిడ్ కారును టీజర్‌ను రిలీజ్ చేశారు. 2020 స్కోడా ర్యాపిడ్ ఎన్నో రకాల డిజైన్ మార్పులతో చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది. దీనికి సంభందించిన ఫోటోలు మరియు పూర్తి వివరాలు చూద్దాం రండి...

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

చెక్-రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఆటో దిగ్గజం 2011 నవంబరులో ఇండియన్ మార్కెట్లోకి స్కోడా ర్యాపిడ్ సెడాన్ కారును తొలిసారిగా లాంచ్ చేసింది. వోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన PQ25 ఫ్లాట్‌ఫామ్ మీద ర్యాపిడ్ ఆధారంగానే స్కోడా ఫ్యాబియా మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో కార్లను తీసుకొచ్చారు.

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

స్కోడా ర్యాపిడ్ పలుమార్లు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలవుతూ వచ్చినప్పటికీ పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ చోటు చేసుకోలేదు. స్కోడా ర్యాపిడ్ కారు సీ-సెడాన్ సెగ్మెంట్లో ఉన్న హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, టయోటా యారిస్ మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు పోటీనిస్తోంది.

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

స్కోడా ఆటో గత మూడేళ్లుగా ప్రపంచ విపణిలోకి పలు ఎస్‌యూవీలు మరియు రకరకాల క్రాసోవర్ మోడళ్లను తీసుకొస్తూ కాలం గడిపింది. యూరోపియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడళ్లుగా ఉన్న ఆక్టావియా మరియు సూపర్బ్ మోడళ్లను వదిలేయకుండానే కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది.

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

2019 ఏడాదిలోనే స్కోడా కంపెనీ అప్‌డేటెడ్ సూపర్బ్, దేశీయంగా త్వరలో విడుదల కానున్న కమిక్ (Kamiq) ఎస్‌యూవీ, నాలుగో తరానికి చెందిన ఆక్టావియా, స్కాలా హ్యాచ్‌బ్యాక్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ సిటీగో కార్లను ప్రపంచ విపణిలోకి లాంచ్ చేసింది.

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

ఆక్టావియా, సూపర్బ్ మరియు ర్యాపిడ్ మోడళ్లను ఇండియన్ మరియు రష్యన్ మార్కెట్లో ఎలాంటి అప్‌డేట్స్ నిర్వహించకుండానే విక్రయిస్తోంది. తాజాగా 2020 స్కోడా ర్యాపిడ్ కారుకు సంభందించిన ఫోటోలను రిలీజ్ చేశారు.

Most Read: యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

సెకండ్ జనరేషన్ స్కోడా ర్యాపిడ్ కారులో పెద్ద పెద్ద మార్పులేమీ జరగడం లేదు. కానీ అత్యాధునిక హెడ్‌ల్యాంప్ క్లస్టర్, క్రోమ్ ఫినిషింగ్ ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, పదునైన మరియు సమాంతరంగా ఉన్న ఫాగ్ ల్యాంప్స్ మరియు మల్టీ స్పోక్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

Most Read: జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

2020 స్కోడా ర్యాపిడ్ రియర్ డిజైన్ డైనమిక్ మరియు కన్వెన్షనల్ స్టైల్లో C-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్, కూలర్ బూమ్‌ర్యాంగ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు రీస్టైల్ రియర్ బంపర్ ఉన్నాయి. ప్రపంచ ఆవిష్కరణ నేపథ్యంలో స్కోడా దీనికి సంభందించిన మరిన్ని టీజర్ ఫోటోలను రిలీజ్ చేయనుంది.

2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కోడా ఇండియా రానున్న రెండేళ్ల ఆరు కొత్త మోడళ్లు/ఫేస్‌లిఫ్ట్ కార్లను విపణిలోకి లాంచ్ చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగానే 2020 స్కోడా ర్యాపిడ్ సెడాన్ కారును రీలాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వెర్షన్ ర్యాపిడ్ కారును ప్రపంచ ఆవిష్కరణ అనంతరం పూర్తి స్థాయిలో దేశీయ విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
India Bound 2020 Rapid Teased Ahead Of Launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X