7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

అమెరికన్ ఎస్‌యూవీ తయారీ దిగ్గజం జీప్ కొత్త ప్రకటన చేసింది, ఇప్పటి వరకు ఉన్న ఎస్‌యూవీ కంటే పెద్ద దానిని భారత మార్కెట్లోకి తీసురానున్నట్టు ప్రకటించింది. దీనిని టయోటా ఫార్చునర్కు పోటీగా తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా విఐపి లు ఎక్కువగా ఈ ఫార్చునర్ ను ఉపయోగిస్తుంటారు.

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

అమెరికన్-ఇటాలియన్ కార్ తయారీ సంస్థ ఎఫ్సిఎ(ఫియట్-చుర్స్లర్ ఆటోమొబైల్స్) జీప్ బ్రాండ్ నుండి భారతీయ మార్కెట్లో ఒక సెవెన్ సీట్ల ఫ్లాగ్ షిప్ ఎస్‌యూవీ ను తీసుకురానున్నట్లు ధృవీకరించింది. కొత్త సెవెన్ సీటర్ జీప్ ఎస్‌యూవీని వచ్చే 2020 వ సంవత్సరం చివరన లేదా 2021 ప్రారంభంలో మార్కెట్ లో ప్రవేశపెట్టాలి అని అనుకొంటోంది.

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

కొత్త సెవెన్ సీటర్ జీప్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో ఉన్న ప్రముఖ కంపాస్ నమూనా ఆధారంగా తయారు చేయనుంది. కొత్త సెవెన్ సీట్ల కంపాస్ ఆధారిత ఎస్‌యూవీను స్థానికంగా ఉన్న పూణే శివారులోని రంజంగైలోని జీప్ ప్లాంట్ లో తయారు చేయనున్నారు.

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

కొన్ని రిపోర్ట్స్ ల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆమోదించబడింది అని మరియు 2020 కొరకు ప్లాన్ చేయబడ్డ అన్ని కొత్త కంపాస్ యొక్క నమూనా అవుతుంది. ట్రైల్‌హాక్‌, కంపాస్ మరియు ఇప్పుడు గ్రాండ్ కంపాస్ లేదా కంపాస్ వంటి వాహనాల లాంచనాలతో,

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

కంపెనీ మార్కెట్ లో జీప్ యొక్క ప్రీమియం పొజిషనింగ్ ను పటిష్టం చేయాలనుకుంటుంది, తదుపరి సంవత్సరాలలో మార్కెట్ మరింత అందుబాటులో కాంపాక్ట్ జీప్ ఎస్‌యూవీ లను తీసుకురానుంది. జీప్ కంపాస్ ఎస్‌యూవీ, 2017 లో భారత మార్కెట్లో భారీ విజయాన్ని సాధించింది.

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

గడిచిన కొన్ని సంవత్సరాల్లో, జీప్ కంపాస్ యొక్క కొత్త వేరియెంట్ లను ప్రవేశపెట్టింది, తాజాగా దాని యొక్క అత్యంత-రోడ్డు సామర్థ్యం కలిగిన ' ట్రైల్‌హాక్‌ ' వేరియెంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల ప్రారంభించబడిన దీని ధర రూ. 26.8 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది.

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

మేము ఇటీవల దాని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను పరీక్షించడానికి అవకాశం వచ్చింది. జీప్ ఇండియన్ మార్కెట్లో ఒక చిన్న మోడల్ ను, పరిచయం చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. అయితే, దేశంలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన వలన దీని ప్రణాళికలు మరుగున పడ్డాయి.

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

జీప్ ఇప్పుడు అధిక వాల్యూమ్లను కాకుండా అధిక మార్జిన్లపై దృష్టి కేంద్రీకరించడం తో ప్రీమియంతో కూడిన వాహనాలను నిర్మించడానికి పని చేస్తోందని తెలిసింది. కొత్త సెవెన్ సీటర్ జీప్ కంపాస్ ఆధారిత ఎస్‌యూవీ దేశంలో ప్రీమియం పేరుతో తయారు చేసే ప్రణాళికలో భాగంగా ఉంటుంది. కొత్త సెవెన్ సీటర్ ఎస్‌యూవీ కంపాస్ భారతదేశంలో కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ గా ఉంటుంది.

7 సీటర్ కంపాస్ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్

జీప్ కంపాస్ సెవెన్ సీటర్ ఎస్‌యూవీ పై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

జీప్ నుంచి రానున్న కొత్త సెవెన్ సీటర్ కంపాస్ ఆధారిత ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇంకా చాలా కాలంగా ఉంది. ఈ ఎస్‌యూవీ ఒక ప్రీమియమ్ ధర కలిగి ఉంటుంది మరియు ఇది టయోటా ఫార్చునర్, ఫోర్డ్, మహీంద్రా ఆల్యురాస్ జి4 మరియు ఇండియన్ మార్కెట్లో ఉన్న హోండా సిఆర్-వి వంటి వాటితో పోటీ పడనుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
The American-Italian carmaker, FCA (Fiat-Chrysler Automobiles) has confirmed a brand new seven-seater flagship SUV for the Indian market from the Jeep brand.Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X