ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

పేరెన్నిక గన్న కియా సంస్థ ఇప్పుడు ఇండియాలో మరొక కారుని ప్రవేశపెట్టబోతోంది. దాని పేరే కియా "కార్నివాల్ ఎంపివి". దీనిని ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టడాన్ని తగిన సమయం కోసం ఎదురు చేస్తూ వుంది. ఇది ఇండియాలో విడుదలవ్వబోతున్న ఒక లగ్జరీ కారు. ఇది విడుదలైన తరువాత టయోటా ఇన్నోవా క్రిష్టా కి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

ఇండియాలో 2018 సంవత్సరంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దర్శనమిచ్చిన కార్నివాల్ ఎమ్‌పివి ఇప్పుడు మార్కెట్లోకి విడుదలవడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనాన్ని ప్రారంభించడానికి ముందు కియా ఇండియా కొన్ని కార్య కలాపాలను నిర్వహించనుంది. అయితే ఇప్పుడు మాత్రం కియా ఇండియా వారు కార్నివాల్ యొక్క వీడియో ట్రీసర్ ని అధికారికంగా పంచుకున్నారు.

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

కియా తన ఉత్పత్తులను మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొదలుపెట్టింది. ఇప్పుడు ఇండియాలో ప్రవేశబెట్టబోతున్న కార్నివాల్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా మరియు వియత్నాం వంటి దేశాలలో అమ్ముడవుతోంది. ఇన్ని దేశాలలో అమ్మకాలను మొదలుపెట్టిన కియా ఇప్పుడు భారతదేశంలో కూడా అమ్మాకాలను ప్రారంభించబోతోంది. కీయ కార్నివాల్ ని గ్రాండ్ కార్నివాల్, గ్రాండ్ సెడోనా అనే పేర్లతో పిలుస్తారు. అయితే ఇది ప్రస్తుతం ఇండియాలో ప్రవేశపెట్టడానికి తగిన సన్నాహాలు కోసం ఎదురుచూస్తుంది.

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

రోడ్ టెస్ట్ ల అనంతరం కియా కార్నివాల్ కి అనేక బాహ్య నవీనీకరణలు చేపట్టారు. ఇందులో రీస్టైల్ హెడ్‌ల్యాంప్‌లు, క్రోమ్ ఇన్‌ఫ్యూజ్డ్ ఫ్రంట్ గ్రిల్, అంగ్యులర్ డిఆర్‌ఎల్‌లు మరియు స్పోర్టి 19-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఇందులో కొంత ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం కేవలం వినియోగదారులను ఆకర్షించడానికి మాత్రమే కాకుండా, వినియోగదారులకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండటానికి తయారుచేయబడింది.

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

ఇండియాలో ప్రారంభించబోయే కార్నివాల్ లో కొన్ని స్టైలింగ్ లతో పాటు ఫీచర్స్ కూడా బాగా అప్‌డేట్‌ చేయబడి ఉంటుంది. ఇప్పటికే ఈ వాహనానికి ఉన్న రూపురేఖలు, తలుపుల ఆకారం మరియు కారు యొక్క పైకప్పు వంటివి అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఇందులో కొన్ని మాత్రమే రోడ్లకు అనుగుణంగా అప్డేట్ చేయబడుతుంది. కానీ కారు యొక్క బయటి భాగం మాత్రం కొత్తగా నవీనీకరించారు.

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న కియా కార్నివాల్ లో 7-సీట్లు, 8-సీట్లు మరియు 11-సీట్ల వేరియంట్లలో అందించబడుతుంది. అయితే భారతదేశంలో లాంచ్ చేసినప్పుడుమాత్రం ఇది 6, 7 మరియు 8 సీట్ల వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. కార్నివాల్ సాంకేతికంగా అప్డేట్ చేయబడింది. కాబట్టి భారతదేశంలో ప్రయోగ సమయంలో దీనికి ప్రత్యర్థులు ఉండరు. టొయోటా ఇన్నోవా క్రిస్టా అమ్మకాలలో మాత్రం కార్నివాల్ కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అదే ధర పరిధిలో లభించే పెద్ద మరియు ఎక్కువ ప్రీమియం ఉన్నవాహనం ఇదే కాబట్టి.

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

కియా కార్నివాల్ యొక్క లోపలి భాగంలో సౌకర్యాలు చాల ఉత్తమంగా ఉంటాయి. ఇందులో లెదర్ సీట్లు, వెనుక సీటు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ, వెనుక ప్రయాణీకులకు ఎక్స్‌టెన్డబుల్ లెగ్ రెస్ట్, వెనుక ఉన్న ప్రయాణీకులకు కోసం 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్లు, రెండు సన్‌రూఫ్‌లు, పవర్ సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటుఇంకా వెనుక తలుపులు స్లైడింగ్ విధానంలో ఉంటాయి.

Read More:ఇండియాలో త్వరలో ప్రారంభించనున్న యమహా ఎలక్రిక్ స్కూటర్లు

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

భారతదేశంలో ప్రారంభించినప్పుడు మూడవ తరం కార్నివాల్ బిఎస్-6 లో 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఇది గరిష్టంగా 200 హెచ్‌పి 3,800 ఆర్‌పిఎమ్ శక్తిని మరియు 441 ఎన్ఎమ్ 1,750-2,750 ఆర్‌పిఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది. దీని ధర సుమారు రూ .30 లక్షలు వరకు ఉంటుందని ఒక అంచనా.

Read More:భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

60 కి పైగా బుకింగ్‌లు అందుకున్నసెల్టోస్‌ తో కియాకు భారతీయ మార్కెట్లో మంచి ఆరంభం లభించింది. 2019 నవంబర్ లో సెల్టోస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన కార్లలో కియా సెల్టొస్ ఒకటి.

Read More:హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

కొత్త ఉత్పత్తులను నిరంతరం పరిచయం చేయడం ద్వారా కియా ఇప్పుడు ఇండియాలో తమ అమ్మకాలను పెంచే అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. కియా కంపెనీ కార్నివాల్‌తో పాటు భారతీయ మార్కెట్ కోసం కియా స్పోర్టేజ్, కియా రియో, కియా స్టోనిక్, కియా సోల్ మరియు కియా స్ట్రింగర్ వంటి అనేక ఇతర కార్లను ఏర్పాటు చేసింది. కియా ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ కార్లు అమ్మకందారులలో ఒకటిగా పేరుగాంచింది.

Most Read Articles

English summary
Kia Carnival MPV officially teased ahead of India launch – Video-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X