కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

కియా మోటార్స్ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త సెల్టోస్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఎస్‌యూవీ తర్వాత కియా యొక్క రెండవ ఉత్పత్తి ఎంపీవీ సెగ్మెంట్లో ఉండవచ్చుని కియా మోటార్స్ కార్పోరేషన్ సీఈఓ స్పష్టం చేశారు. దీంతో ఇదే ఎంపీవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి ఎర్టిగా మరియు మహీంద్రా మరాజో వాహనాలకు గట్టి షాక్ తగులనుందా అంటే... అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

కియా సెల్టోస్ ఎస్‌యూవీ అంతర్జాతీయ ఆవిష్కరణ సందర్భంగా కియా మోటార్స్ కార్పోరేషన్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ హాన్ వూ పార్క్ మాట్లాడుతూ, "ఇండియాలో తమ బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాం, ఇందుకోసం కియా యొక్క తర్వాత ఉత్పత్తి ఎంపీవీ సెగ్మెంట్లో ఉంటుంది" అని స్పష్టం చేశాడు.

కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

ఎర్టిగా మరియు మరాజో ఎంపీవీలకు సరాసరి పోటినిచ్చే కియా ఎంపీవీ వాహనాన్ని కియా సెల్టోస్ ఎస్‌యూవీని నిర్మించిన ఫ్లాట్‌ఫామ్ మీదనే అభివృద్ది చేయనున్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానున్న నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో రాణించాలంటే ఎంపీవీ సెగ్మెంట్ అత్యంత కీలకమైనదిని కియా భావిస్తోంది.

కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

సమాచార వర్గాల కథనం మేరకు, కియా సెల్టోస్ ఎస్‌యూవీని 7-సీటింగ్ లేఔట్లో కూడా అందివ్వనుంది. ఇది కూడా చూడటానికి అచ్చం 5-సీటర్ సెల్టోస్ తరహాలోనే ఉంటుంది. అదనపు పెట్టుబడి, డెవలప్‌మెంట్ ఖర్చులు లేకుండా సేల్స్ పెంచుకోవడం తప్పితే ఈ ప్రయోగం వలన కంపెనీ ఖజానా పెరిగే అవకాశాలు పెద్దగా లేవు.

కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

ఈ క్రమంలో కుటుంబ సమేతంగా ప్రయాణించే వాహనాలు పేరుగాంచిన ఎంపీవీ సెగ్మెంట్లో కియా తమ తర్వాత ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. నూతన మోడళ్ల విడుదలతో కియా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడమే కాకుండా పలు కొత్త కార్ల విడుదలతో దేశీయ ఎంపీవీ సెగ్మెంట్ అద్భుతమైన వృద్దిని సాధించడంలో కియా నిర్ణయం తోడ్పనుంది. అంతే కాకుండా దేశీయంగా తయారయ్యే కియా ఎంపీవీలను ఇండోనేషియాతో పాటు పలు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది.

కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

టయోటా ఇన్నోవా క్రిస్టా ఇండియన్ ఎంపీవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. వీటి తర్వాత మారుతి సుజుకి మరియు మహీంద్రా మరాజో వరుసగా రెండు మరియు మూడవ స్థానాల్లో నిలిచాయి. కియా ఎంపీవీకి తోడు ఇదే సెగ్మెంట్లో కయ్యానికి రెనో ట్రైబర్ ఎంపీవీ కూడా కాలుదువ్వుతోంది.

కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

కియా మోటార్స్ ఇటీవల సరికొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది. కియా సెల్టోస్‌ ఎస్‌యూవీలో కండలు తిరిగిన బాడీ, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఐస్-క్యూబ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎస్‌యూవీ సెగ్మెంట్లో మొదటిసారిగా 10.25 అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బాస్ మ్యూజిక్ కంపెనీ నుండి సేకరించిన 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఇంకా ఎన్నో ఫీచర్లు దీని సొంతం.

కియా నుండి 7-సీటర్ ఎంపీవీ: మారుతి ఎర్టిగా, మహీంద్రా మరాజోకు గట్టి పోటీ

కియా సెల్టోస్ ఎస్‌యూవీ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభించనున్నాయి. అవి, 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టుర్భో ఛార్జ్‌డ్ డీజల్ మరియు 1.4-లీటర్ టుర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్లు.

మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ న్యూస్ తెలుగులో పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి!

Most Read Articles

English summary
Kia Motors Planning To Launch MPV Soon — Will Take On The Ertiga And The Marazzo. Read in Telugu.
Story first published: Saturday, June 22, 2019, 20:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X