అలర్ట్: కియా సెల్టోస్ ఎస్‌యూవీ విడుదల ఖరారు.. ఎప్పుడంటే?

కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఆగష్టు 22 నుండి పూర్తి స్థాయిలో విపణిలోకి ప్రవేశపెట్టి, విక్రయాలకు సిద్దం చేయనున్నట్లు తెలిసింది. కియా మోటార్స్ అంతర్జాతీయ ఆవిష్కరణ చేసిన సెల్టోస్ ఎస్‌యూవీ దేశీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత పోటీని సృష్టించనుంది.

అలర్ట్: కియా సెల్టోస్ ఎస్‌యూవీ విడుదల ఖరారు.. ఎప్పుడంటే?

దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తొలి ఉత్పత్తిగా సెల్టోస్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. విడుదలకు ఎంతగానో వేచి ఉన్న మోడల్ కియా సెల్టోస్ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఆరంభించేందు సిద్దంగా కియా షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది.

అలర్ట్: కియా సెల్టోస్ ఎస్‌యూవీ విడుదల ఖరారు.. ఎప్పుడంటే?

కియా సెల్టోస్ ఎస్‌యూవీ బోల్డ్ డిజైన్, స్పోర్టివ్ డిజైన్ శైలితో వచ్చింది. సెల్టోస్ ఫ్రంట్ డిజైన్‌లో ఆకర్షణీయమైన సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఎయిర్ ఇంటేకర్‌కు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ గల స్పోర్టివ్ బంపర్ కూడా ఉంది.

అలర్ట్: కియా సెల్టోస్ ఎస్‌యూవీ విడుదల ఖరారు.. ఎప్పుడంటే?

కియా సెల్టోస్ సైడ్ డిజైన్ చూడటానికి స్పోర్టివ్‌గా ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ మరియు డోర్లు అంచుల మీదుగా వెళ్లే ఆకర్షణీయమైన ఫ్లోటింగ్ లైన్స్ ఉన్నాయి. వెనుక వైపున కియా బ్యాడ్జింగ్ గల ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ సెటప్, ఇరువైపులా ఉన్న ఎల్ఈడీ లైట్ల చుట్టూ క్రోమ్ స్ట్రిప్స్ ఉన్నాయి.

అలర్ట్: కియా సెల్టోస్ ఎస్‌యూవీ విడుదల ఖరారు.. ఎప్పుడంటే?

కియా సెల్టోస్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇదొక టెక్నాలజీ అద్భుతమనే చెప్పాలి. తొలి చూపులోనే అందరినీ ఆకట్టుకునే డ్యూయల్-టోన్ క్యాబిన్ మరియు 10.25-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ డ్యూయల్ డిస్ల్పే కలదు. 360-డిగ్రీ కెమెరా, హెడ్స్ అప్ డిస్ల్పే, వెంటిలేటెడ్ సీట్లు ఇంకా ఎన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ నుండి సేకరించి కృత్రిమ మేధస్సు గల ఇన్ఫోటైన్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

అలర్ట్: కియా సెల్టోస్ ఎస్‌యూవీ విడుదల ఖరారు.. ఎప్పుడంటే?

కియా సెల్టోస్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. అవి, 1.5-లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ ఇంజన్ 115బిహెచ్‌పి-144ఎన్ఎమ్, 1.5-లీటర్ సీఆర్‌డీఐ డీజల్ ఇంజన్ 115బిహెచ్‌పి-250ఎన్ఎమ్ మరియు 1.4-లీటర్ టి-జిడిఐ టుర్బో-పెట్రోల్ ఇంజన్ 140బిహెచ్‌పి పవర్ మరియు 242ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు మూడు రకాల ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది (అవి, 6-స్పీడ్ AT, CVT మరియు 7-స్పీడ్ DCT).

అలర్ట్: కియా సెల్టోస్ ఎస్‌యూవీ విడుదల ఖరారు.. ఎప్పుడంటే?

కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోడల్. ఇది సుమారుగా రూ. 12 నుండి 16 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌ ధరతో వచ్చే అవకాశం ఉంది. కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, ప్రస్తుతం ఉన్న ఎంజీ హెక్టార్, హ్యుందాయ్ క్రెటా, టాటా హ్యారీయర్ మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Kia Seltos India-Launch Date Confirmed For 22nd Of August — Rivals The Tata Harrier. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X