భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

అనంతపురంలోని పెనుగొండలో ఏర్పడిన కియా మోటార్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ ను విడుదల చేసింది. సంవత్సరానికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చెయ్యాలని టార్గెట్ పెట్టుకుంది. భవిష్యత్తులో ఏడాదికి 7 లక్షల కార్లను తయారుచేసే సామర్ధ్యానికి చేరుకోవాలనే లక్ష్యం కూడా ఉంది. అయితే ఈ కొత్త సెల్టోస్ గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

భారత మార్కెట్లో అడుగు పెట్టిన కియా సెల్టోస్ రెండు ప్రధాన ట్రైమ్స్ లో అందుబాటులో ఉంది, వాటిలో టెక్-లైన్ మరియు జిటి-లైన్, ఇది ఇంజిన్ మరియు గేర్ బాక్స్ స్పెసిఫికేషన్ లను బట్టి సబ్ వేరియంట్ల కూడా ఆఫర్ చేస్తోంది. వీటి ధరల విషయానికి వస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

రూ. 9.69 లక్షల ప్రారంభ ధరతో కియా సెల్టోస్ అందుబాటులో ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 15.99 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా) గా ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కియా సెల్టోస్ ఇప్పుడు ఓ రేంజిలో వార్తల్లో నిలిచింది.

Variant 1.5 Petrol 1.5 Diesel 1.4 T-GDI Petrol
HTE Rs 9.69 Lakh Rs 9.99 Lakh -
HTK Rs 9.99 Lakh Rs 11.19 Lakh -
HTK+ Rs 11.99 Lakh Rs 12.19 Lakh -
HTK+ (6 AT) - Rs 13.19 Lakh -
HTX Rs 12.79 Lakh Rs 13.79 Lakh -
HTX (IVT) Rs 13.79 Lakh - -
HTX+ - Rs 14.99 Lakh -
HTX+ (6 AT) - Rs 15.99 Lakh -
GTK - - Rs 13.49 Lakh
GTX - - Rs 14.99 Lakh
GTX (7 DCT) - - Rs 15.99 Lakh
GTX+ - - Rs 15.99 Lakh
భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

సెల్టోస్ ఎస్యువి బుకింగ్స్ నెల రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. దీని విడుదలకు ముందు ఈ ఎస్యువి 25,000 యూనిట్ల బుకింగ్స్ లో గరిష్టంగా నిలిచింది. ఇప్పటికే ఎస్యువి ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే కియా సెల్టోస్ యొక్క డెలివరీలు ప్రారంభం అవుతాయి.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

భారత మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యువి సెగ్మెంట్లో కియా సెలోస్ స్థానం కల్పించనుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్యూవి500, టాటా హర్రియర్, జీప్ కంపాస్ మరియు నిస్సాన్ కిక్స్ లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

కియా సెల్టోస్ మూడు ఇంజన్ ఆప్షన్ ల శ్రేణిలో అందుబాటులో ఉంటుంది, వాటిలో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ లు మరియు ఒక 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ లు కలిగి ఉన్నాయి. మొత్తం మూడు ఇంజిన్లు ఏప్రిల్ 2020 రాబోయే బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ లు వరుసగా 115 బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును. 1.4-లీటర్ టర్బో-పెట్రోల్, 138 బిహెచ్పి మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read:కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

అన్ని ఇంజిన్లు ఒక స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, మూడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి వస్తాయి, వాటిలో 1.5 పెట్రోల్ కొరకు సివిటి, డీజల్ కొరకు ఐవిటి మరియు టర్బో-పెట్రోల్ ఇంజిన్ కొరకు 7-స్పీడ్ డిసిటి ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి.

Most Read:టాటా హారియర్ కొత్త డార్క్ ఎడిషన్ ఇదే

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

కియా సెల్టోస్ డిజైన్ చేసిన స్మార్ట్, బోల్డ్ అండ్ స్పోర్టివ్ లుక్ ను కలిగి ఉంటుంది. ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్ లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్స్ తో వస్తుంది. దీనిలో అనేక మొదటిగా వచ్చిన ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ కూడా ఉన్నాయి.

Most Read:హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ Vs మారుతీ సుజుకి స్విఫ్ట్

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

కియా సెల్టోస్ పై మరి కొన్ని ఫీచర్లు ఏవి అంటే, 10.25-అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో పాటు ఈ బ్రాండ్ కు చెందిన యూవిఓ కనెక్ట్ టెక్నాలజీ, పరిసర మూడ్ లైటింగ్, పుష్-బటన్ స్టార్ట్, ప్రపంచపు మొట్టమొదటి ' స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ ' సిస్టమ్, వైర్ లెస్ చార్జింగ్, వెంటిలైటెడ్ సీట్లు ముందు వరుసలో ఉంటాయి.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

ఇంకా 8-వే పవర్-ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సిట్టింగ్, BOSE సరౌండ్ సౌండ్ స్పీకర్లు, 8.0-అంగుళాల హెడ్స్-అప్ డిస్ ప్లే, 360-డిగ్రీ కెమెరా మరియు ఆటో క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

భద్రత ఫీచర్ల పరంగా కియా సెల్టోస్ 1 ఏప్రిల్ 2019 నుంచి తప్పనిసరి చేసిన అన్ని స్టాండర్డ్ ఆప్షన్లను కలిగి ఉంది. వాటిలో సైడ్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్లైండ్ వ్యూ మానిటర్, వేహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్ మరియు వివిధ రకాల డ్రైవింగ్ మోడ్ లు వంటి అదనపు భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలోని కంపెనీ ప్లాంటులో కియా సెలోస్ ను స్థానికంగా తయారు చేస్తోంది. ఈ సంస్థ ఈ ఎస్యువిని ఆగష్టు 8 న అసెంబ్లీ లైన్ నుండి మొదటి సెల్టోస్ ను ప్రారంభించింది - దీని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

కియా సెల్టోస్ ను ప్రపంచవ్యాప్తంగా జూన్ 2019 న ఆవిష్కరించారు. అయితే దీని కాన్సెప్ట్ ఫామ్ ' SP2i ' ను 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. సెల్టోస్ అదే డిజైన్ లైన్స్ ను కాన్సెప్ట్ వర్షన్ గా ముందుకు వచ్చింది.

భారత మార్కెట్లోకి సెల్టోస్ ను లాంచ్ చేసిన కియా మోటార్స్

దీన్ని ఇండియన్ మార్కెట్లో చాలా ఆకర్షణీయమైన ఎస్యువి గా రూపొందించడం విశేషం. అలాగే కియా సెల్టోస్ ను చాలా కలర్ ఆప్షన్స్ లో అందజేస్తారు. ఇందులో రెడ్, ఆరంజ్, గ్లాసియర్ వైట్, క్లియర్ వైట్, గ్రే, సిల్వర్, బ్లూ, బ్లాక్ కలర్ లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Kia Seltos Launched In India With Prices Starting At Rs 9.69 Lakh - Read in Telugu
Story first published: Thursday, August 22, 2019, 14:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X