కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

By N Kumar

ఫేస్‌బుక్ నుండి యూట్యూబ్ వరకు.. ఏ ఛానల్ చూసినా.. ఏ పేపర్ చదివినా సైరా నరసింహా రెడ్డి మూవీ రికార్డులు గురించే ఉంది. ఇదంతా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితి కానీ కార్ల విషయానికి వస్తే మన ఏపీలో స్థాపించిన అతి పెద్ద కార్ల కంపెనీ కియా మోటార్స్ తీసుకొచ్చిన కియా సెల్టోస్ కారు సైరా తరహాలో భారీ విజయాన్ని అందుకుంది.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

కియా మోటార్స్ భారీ అంచనాల మధ్య తమ తొలి ఎస్‌యూవీ కారు - "సెల్టోస్" ను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టారు. విడుదలైన అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ లభించింది. నిజానికి కియా సెల్టోస్ వేరియంట్లు మరియు ధరలు వెల్లడించడానికి ముందే ఏకంగా 30 వేలకు పైగా కియా సెల్టోస్ కార్లను బుక్ చేసుకున్నారు.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

కియా సెల్టోస్ విడుదలయ్యాక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో యావత్ దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంది. తాజాగా ఉన్న పరిణామాల ప్రకారం, మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న హ్యుందాయ్ క్రెటా కారును కియా సెల్టోస్ సేల్స్ పరంగా వెనక్కి నెట్టేసింది.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

కియా సెల్టోస్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రతి నెలా బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ ఎస్‌యూవీగా రాణిస్తోంది. సెప్టెంబర్ గణాంకాలను పరిశీలిస్తే 7,754 యూనిట్ల కియా సెల్టోస్ కార్లు అమ్ముడయ్యాయి. ఇదే నెలలో కేవలం 6,641 యూనిట్లకే పరిమితమైంది. 1100 యూనిట్ల అత్యధిక సేల్స్‌తో కియా సెల్టోస్ అధిక్యంలో ఉంది.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

హ్యుందాయ్ క్రెటా విడులైన తొలినాళ్లలో మార్కెట్లో బెస్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. ధర, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా పోటీ అధికమవ్వడంతో క్రెటా సేల్స్ ఎప్పటికప్పుడు తగ్గుతూ వచ్చాయి. అంతే కాకుండా ఇతర సెగ్మెంట్ల నుండి కూడా విపరీతమైన పోటీ నెలకొంది.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

ఇటీవల విడుదలైన ఎంజీ హెక్టర్ 2,608 యూనిట్లను విక్రయించింది. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ జనవరిలో లాంచ్ చేసిన టాటా హ్యారీయర్ 941 యూనిట్లతో ఓ మోస్తారు ఫలితాలనే సాధించింది. అదే విధంగా డి-సెగ్మెంట్ ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 1,120 యూనిట్ల మరియు జీప్ కంపాస్ 603 యూనిట్ల సేల్స్‌తో సరిపెట్టుకున్నాయి.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

ఆటోమొబైల్ పరిశ్రమ నెమ్మెదిగా ఉన్నప్పటికీ ఆర్థిక మాంద్యంలో అడుగుపెట్టిన కియా సెల్టోస్ కంపెనీకి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చి అద్భుతం చేసిందనే చెప్పాలి. దీనికి తోడు ఎంతో కాలంగా బెస్ట్ సెల్లింగ్ మిడ్ సెజ్‌ ఎస్‌యూవీగా రాణిస్తున్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని అధిగమించి కంపెనీ ఖాతాలో మరో రికార్డు నమోదు చేసింది.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

రానున్న నెలల్లో కియా సెల్టోస్ ఎస్‌యూవీకి ఇదే తరహా డిమాండ్ ఉండనుంది. కియా సెల్టోస్ మిగతా మోడళ్లతో పోల్చితే ఒక కొత్త మోడల్ మరియు కొత్త కంపెనీ నుండి వచ్చింది. అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో కియా సెల్టోస్‌కు మున్ముందుకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు పండుగ సీజన్ కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.

కియా సెల్టోస్ అరాచకం.. ఇండియన్ హిస్టరీలో రికార్డులు బద్దలు

కియా సెల్టోస్ ఎస్‌యూవీని మూడు విభిన్న ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటు వివిధ రకాల ఫీచర్లు మరియు ఎంపిక పరంగా కియా సెల్టోస్ ఎస్‌యూవీ 18 రకాల వేరియంట్లలో లభ్యమవుతోంది. దీంతో అన్ని రకాల కస్టమర్లు తమ అభిరుచి, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కియా సెల్టోస్ కారును కొనుగోలు చేస్తున్నారు.

Most Read Articles

English summary
Kia Seltos outsells Hyundai Creta. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X