రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

కియా మోటార్స్ ఆగస్టు 22 న ఇండియన్ మార్కెట్లో సెల్టోస్ ఎస్యువి లాంచ్ చేయనున్నారు. దీని లాంచ్ కు ముందు కియా మోటార్స్ సెల్టోస్ సిరీస్ మొదటి ఉత్పత్తిని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కంపెనీ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో అసెంబ్లీ లైన్ లో తొలి ఎస్యువి కారును విడుదల చేసింది.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

దేశంలో 20 లక్షల కిలోమీటర్ల విస్తృతమైన పరీక్ష చేసిన తరువాత, వివిధ వాతావరణ పరిస్థితులు మరియు సవాలుతో కూడిన రోడ్లపై పరీక్షించిన తరువాత భారతదేశంలో సెల్టోస్ యొక్క సామూహిక ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కియా ప్రకటించింది.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

మొదటి ఉత్పత్తి అయిన సెల్టోస్ యొక్క తొలి కారు ఆవిష్కరణ గురువారం, షిన్ బాంగ్-కిల్, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియా యొక్క గౌరవనీయ రాయబారి భారతదేశం మరియు కూఖ్యుం షిమ్ (ఎండి మరియు సిఈఓ కియా మోటార్స్ ఇండియా) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ప్రముఖులతో కలిసి దీనిని ఆవిష్కరించారు.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

ఈ సందర్భంగా, కూఖ్యుం షిమ్(ఎండి మరియు సిఈఓ కియా మోటార్స్) ఇండియా ఇలా పేర్కొన్నారు "మొదటి సెల్టోస్ యొక్క ప్రారంభం అనేది మనందరికీ ఒక భావోద్వేగ క్షణం, ముఖ్యంగా మేము కలిసి పని చేస్తున్నప్పుడు ఈ ప్లాంట్ వద్ద ఉన్న ప్రజలకు, మేము భారతదేశంలో కియా మోటార్స్ యొక్క భవిష్యత్తును నిర్మించటానికి అలుపెరగకుండా పోరాటం చేసారు.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అమూల్యమైన సహకారం వలన, తక్కువ సమయంలో సెల్టోస్ తయారీ చేయడానికి అనుకొన్న లక్ష్యాన్ని సాధించడానికి మాకు ఎంతో సహాయపడింది. మొదటి సెల్టోస్ భారత మార్కెట్ కు కియా యొక్క మా వాగ్దానం మరియు నిబద్ధతకు చిహ్నం.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

కియా మోటార్స్ ఫస్ట్ షోను ఢిల్లీలోని 2018 ఆటో ఎక్స్ పోలో ఎస్పి2ఐ రూపంలో సెల్టోస్ అనే కాన్సెప్ట్ వెర్షన్ ను ప్రదర్శించారు. కియా సెల్టోస్ ఈ సంస్థ నుండి మొదటి ఉత్పత్తి అవుతుంది మరియు దేశంలో అత్యంత పోటీ మధ్య ఎస్యువి సెగ్మెంట్లో స్థానం కలిగి ఉంటుంది.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

కియా సెల్టోస్ రెండు మెయిన్ ట్రైన్స్ లో అందుబాటులో ఉంటుంది వాటిలో టెక్-లైన్ మరియు జిటి-లైన్ లు ఉన్నాయి, వీటిలో ఒక్కొక్కటి మూడు సబ్ వేరియంట్లలో ఉంటాయి. అవి కూడా టెక్-లైన్ హెచ్టిఎక్స్, హెచ్టికె మరియు హెచ్టిఈ గా ఉన్నాయి. అదే విధంగా జిటిఎక్స్, జిటికె మరియు జిటిఈ తో జిటి-లైన్ అందించబడుతుంది.

Most Read: నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

వీటికి మూడు ఇంజన్ ల శ్రేణితో కియా సెల్టోస్ ను ఆఫర్ చేయనుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజిన్ లు ఉన్నాయి. పెట్రోల్ విభాగానికి వస్తే 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్తో 115 బిహెచ్పి మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read: హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

అలాగే టర్బో పెట్రోల్ ఇంజంపై 115బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ మరియు మరింత శక్తివంతమైన 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ జిడిఐ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. తరువాత 140 బిహెచ్పి మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 15-లీటర్ డీజల్ ఇంజన్ కలిగి ఉంది.

Most Read: రికార్డు స్థాయిలో కియా సెల్టోస్ బుకింగ్లు.. కేవలం 20 రోజులోనే...!

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

మొత్తం మూడు ఇంజిన్లు ఒక స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి వస్తాయి. అలాగే ఈ ఎస్యువి మూడు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లు కలిగి ఉంటుంది వాటిలో సివిటి, ఐవిటి మరియు డిసిటి లు ఉన్నాయి.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

అయితే 1.5-లీటర్ పెట్రోల్ కు సివిటి గేర్ బాక్స్ ను, డీజల్ ఇంజన్ ను ఐవిటి గేర్ బాక్స్ ను జతచేయగా, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్లో సెవెన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జత చేసారు. ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే..

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

కియా సొంత యూవో కనెక్టువిటీ టెక్నాలజీతో పాటు హోస్ట్ ఫీచర్లతో పాటు సెల్టోస్ అందుబాటులో ఉంటుంది. వేహికల్ ట్రాకింగ్ జియోఫెన్సింగ్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ ఇగ్నీషన్ మరియు లైవ్ వేహికల్ డయగ్నాస్టిక్స్ వంటి స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేయబడ్డ ఫంక్షనిటీస్ హోస్ట్ చేయడానికి ఈ టెక్నాలజీ కలిగి ఉంది.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

కియా సెల్టోస్ పై ఇతర ఫీచర్లు లలో వెంటిలేటెడ్ సీట్లు, 8.0-అంగుళాల హెడ్స్-అప్ డిస్ ప్లే, 7 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, డిస్క్ బ్రేక్స్ అన్ని ఫోర్, ఎబిఎస్ తో ఈబిడి మరియు ఇతర స్టాండర్డ్ ఫీచర్స్ తో కూడిన హోస్ట్.

రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

ఎట్టకేలకు కియా మోటార్స్ తన మొదటి ఉత్పత్తి సెల్టోస్ మొదలు పెట్టింది. భారతీయ మార్కెట్లో ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఉత్పత్తుల్లో ఈ ఎస్యువి ఒకటి కాగా, అత్యంత పోటీతో పాటు, తగిన ధర కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఆగష్టు 22 న భారతదేశంలో విడుదలైన తరువాత, ఈ సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎంజి హెక్టర్, మహీంద్రా ఎక్స్యూవి500 మరియు టాటా హారియర్ గట్టి పోటీని ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Kia Motors Begins Production Of Seltos In India: Rolls-Out First SUV From Factory Floor - Read in Telugu.
Story first published: Friday, August 9, 2019, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X