కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

By N Kumar

కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి రికార్డ్ స్థాయి సేల్స్ సాధించింది. గడిచిన నవంబర్ 2019 నెల సేల్స్ జాబితాలో కియా సెల్టోస్ ఏకంగా 14,005 యూనిట్ల విక్రయాలు జరిపింది. కియా సెల్టోస్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన ఆగష్టు నుండి ప్రతి నెలా తననుతాను నిరూపించుకుంటూనే వస్తోంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కార్లను తయారు చేస్తోన్న కియా మోటార్స్ తమ మొట్టమొదటి కియా సెల్టోస్‌ ఎస్‌యూవీతో ఇండియన్ మార్కెట్లో భారీ విజయాన్ని అందుకుంది. కొరియన్ దిగ్గజం కియా జూన్ 2019లో ఇండియా వేదికగా అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది. అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

కియా మోటర్స్ కియా సెల్టోస్ ఎస్‌యూవీని విడుదల చేసినప్పటి నుండి ఏకంగా 40,000 యూనిట్లను తమ కస్టమర్లను డెలివరీ ఇచ్చినట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఇప్పటి వరకు 86,840 బుకింగ్స్ నమోదైనట్లు వివరించింది. ఇందులో సెల్టోస్ టాప్ ఎండ్ మోడల్ డీసీటీ మరియు డీజల్ ఇంజన్ మోడల్‌కు ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు తెలిపింది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

అంతే కాకుండా డిమాండ్ ఎక్కువగా ఉన్న మోడళ్లనే అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. తద్వారా ఫాస్ట్ సేల్స్ ఉన్న మోడళ్లపై వెయిటింగ్ పీరియడ్ తగ్గి అనుకున్న సమయానికి కస్టమర్లకు డెలివరీ ఇవ్వచ్చు.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మొత్తం 12 రకాల వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటి ధరల శ్రేణి రూ. 9.69 లక్షల నుండి రూ. 16.99 లక్షల మధ్య అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

కియా సెల్టోస్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అవి, రెండు రకాల పెట్రోల్ మరియు ఒక డీజల్ ఇంజన్. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 115బిహెచ్‌పి పవర్ మరియు 141ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 1.4-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ 140బిహెచ్‌పి పవర్ మరియు 242ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

సెల్టోస్ ఎస్‌యూవీలోని 1.5-లీటర్ సింగల్ డీజల్ ఇంజన్ 115బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మూడు ఇంజన్ ఆప్షన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. అదనంగా ప్రతి ఇంజన్ వేరియంట్‌ను ఒక్కో ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. అవి, 1.5-లీటర్ పెట్రోల్ సీవీటీ ఆటోమేటిక్, 1.5-లీటర్ డీజల్ ఐవీటీ ఆటోమేటిక్ మరియు 1.4-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

కియా సెల్టోస్ రెండు ప్రధాన వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, టెక్-లైన్ మరియు జీటీ-లైన్. ప్రతి ప్రధాన వేరియంట్ పలు రకాల ఇతర వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. అన్ని వేరియంట్లలో ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లను తప్పనిసరిగా అందివ్వడమే కియా సెల్టోస్‌ ఎస్‌యూవీలో ప్రధాన హైలెట్.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

మిడ్-సైజ్ ఎస్‌యూవీ కెటగిరీలో ఉన్న కియా సెల్టోస్ ఇదే సెగ్మెంట్లో ఉన్నటువంటి హ్యుందాయ్ క్రెటా, ఎంజీ హెక్టార్ మరియు టాటా హ్యారీయర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ నెం.1 బెస్ట్ సెల్లింగ్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా సెల్టోస్ కేవలం విడుదలైన నాలుగు నెలల కాలంలోనే మార్కెట్లో మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీగా నిలిచింది. ఎస్‌యూవీ సెగ్మెంట్లో తక్కువ ధరతో లభిస్తున్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు హ్యుందాయ్ వెన్యూ మోడళ్లను కూడా సేల్స్ పరంగా వెనక్కి నెట్టేసింది కియా సెల్టోస్.

Most Read Articles

English summary
Kia Seltos Sales In India For November 2019: Retains Best-Selling SUV Title. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X