కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ ను భారత మార్కెట్లో ప్రారంభించింది. హ్యుందాయ్ క్రెటా కంటే ఈ మిడ్ సైజ్ ఎస్యువి ఎక్కువ ధర కలిగి ఉంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే రెండు వాహనాలు ఒకదానికొకటి ఎలా పాటి పడుతున్నాయి? ఇక్కడ కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా మధ్య ఒక వివరణాత్మక పోలిక చూద్దాం రండి..

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

కియా సెల్టోస్ Vs హ్యుందాయ్ క్రెటా డైమెన్షన్స్

కియా సెల్టోస్ ఒక కొత్త ప్లాట్ ఫాం మీద ఆధారపడి ఉంటుంది, ఇది భారత మార్కెట్లో నెక్స్ట్ జనరేషన్ క్రెటా కూడా వెనక్కు నెట్టేస్తుంది. డైమెన్షన్ల విషయానికి వస్తే కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. సెల్టోస్ లో పొడవు, వెడల్పు హ్యుందాయ్ క్రెటా కంటే ఎక్కువగా ఉంటుంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

కియా సెల్టోస్ 4,315మి.మీ పొడవు ఉండగా క్రెటా 4,270మి.మీ ఉంటుంది. కియా సెల్టోస్ వెడల్పు 1,800మి.మీ మరియు క్రెటా 1,780మి.మీ. ఎత్తు విషయానికి వస్తే సెల్టోస్ 1,665మి.మీ, క్రెటా 1,665మి.మీ. హ్యుందాయ్ క్రెటా 2,590మి.మీ వీల్ బేస్ అందిస్తుంది, సెల్టోస్ 2,610మి.మీగా ఉంటుంది. ఇంకా వివరంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

Dimensions Kia Seltos Hyundai Creta
Length (mm) 4315 4270
Width (mm) 1800 1780
Height (mm) 1645 1655
Wheelbase (mm) 2610 1590
Boot Space (litres) 433 400
కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

కియా సెల్టోస్ Vs హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు

కియా సెల్టోస్ చాలా ఫీచర్లను అందిస్తుంది మరియు వీటిలో కొన్ని ఫీచర్లు మొదటిసారిగా ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. వాటిలో హెడ్స్-అప్ డిస్ ప్లే, 17 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎయిర్ ప్యూరిఫయర్, వెంటిలేటెడ్ సీట్లు, యూవో ఇంటర్నెట్ కనెక్ట్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, మొత్తం నాలుగు డిస్క్ బ్రేక్స్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ ఈడీ లైట్ బార్ ఆన్ ది గ్రిల్, ఆల్-ఎల్ఈడీ టెయిల్ వంటి ఫీచర్లను సెలోస్ అందిస్తోంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

ఎల్ఈడీ క్యాబిన్ ల్యాంప్స్, నావిగేషన్ తో లైవ్ ట్రాఫిక్ సిస్టమ్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రీఆర్వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఎసి వెంట్ లు, 8-స్పీకర్ సిస్టమ్ BOSE , డ్యాన్సింగ్ పరిసర లైట్లు, వైర్ లెస్ ఫోన్ చార్జర్ లు ఉన్నాయి.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

మరోవైపు హ్యుందాయ్ క్రెటా, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఎలక్ట్రికంగా ఎడ్జెస్టబుల్ సీట్, వెంటిరేటెడ్ సీట్లు, టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్ లు, లెదర్ సీట్లు మరియు స్టీరింగ్ వీల్, సిక్స్-ఎయిర్ బ్యాగులు మరియు మరిన్ని అందిస్తుంది. అయితే, సెల్టోస్ అందించే ఫీచర్ల క్రెటా తో పోల్చలేము. కేబిన్ విషయానికి వస్తే కియా సెల్టోస్ కూడా చాలా ప్రీమియమ్ గా అనిపిస్తుంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

కియా సెల్టోస్ Vs హ్యుందాయ్ క్రెటా ఇంజన్ మరియు ట్రాన్స్ మిషన్

కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా రెండూ భారత మార్కెట్లో మూడు ఇంజన్ ఆప్షన్లను అందిస్తున్నాయి. కియా సెల్టోస్ 2 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను మరియు సింగిల్ డీజల్ ఇంజన్ ఆప్షన్ ను అందిస్తుంది. క్రెటా రెండు డీజల్ ఇంజన్ ఆప్షన్లను మరియు మార్కెట్లో సింగిల్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తుంది.

Most Read:దారుణంగా మోసపోయాం... జావా కంపెనీపై మండిపడుతున్న కస్టమర్లు

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

1.5-లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తున్న ఈ సెల్టోస్ లో 113 బిహెచ్పి మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను పొందుతుంది. కియా సెల్టోస్ కు చెందిన 1.5-లీటర్ టర్బో ఛార్జ్ డ్ డీజల్ ఇంజన్ 113 బిహెచ్పిల మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను అందిస్తుంది.

Most Read:కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను అందిస్తుంది. సెల్టోస్ తో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ 1.4-లీటర్ టర్బో ఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్పి మరియు 242 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read:బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను పొందుతుంది. మూడు విభిన్న ఇంజిన్ ఆప్షన్లు సెల్టోస్ లో పూర్తిగా మూడు భిన్నమైన ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రకాలను అందిస్తున్నాయి.

Specifications Kia Seltos Hyundai Creta
Engine

1.5 Petrol/1.5 Diesel/1.4 T-GDI Petrol 1.6 Petrol/1.4 Diesel/1.6 Diesel
Transmission 6MT/IVT/AT/7DCT 6MT/AT
Power (bhp) 115/115/138 123/90/128
Torque (Nm) 144/250/242 151/220/260
కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

హ్యుందాయ్ క్రెటా 1.6-లీటర్ నేచురల్-యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తుంది, ఇది గరిష్టంగా 122 బిహెచ్ పి మరియు 154 ఎన్ఎమ్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను పొందుతుంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

హ్యుందాయ్ క్రెటా యొక్క డీజల్ ఇంజన్ లైనప్ 1.4-లీటర్ టర్బో ఛార్జ్ డ్ ఇంజన్ ను కలిగి ఉంది, ఇది గరిష్టంగా 89 బిహెచ్ పి మరియు 224 ఎన్ఎమ్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో మాత్రమే అందించబడుతుంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

క్రెటా తో లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన డీజల్ ఇంజన్ 1.6-లీటర్ యూనిట్ 126 బిహెచ్ పి గరిష్ట శక్తిని మరియు 265 ఎన్ఎమ్ ల పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను పొందుతుంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

కియా సెల్టోస్ Vs హ్యుందాయ్ క్రెటా ఇంధన సమర్థత

కియా సెలోస్ పెట్రోల్ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని 16.3 కిమీ/లీ తో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మరియు 16.4 కిమీ/లీ తో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో అందిస్తుంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

1.5-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 20.8 కిమీ/లీ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో మరియు 17.8 కిమీ/లీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో తిరిగి వస్తుంది. సెల్లోస్ యొక్క 1.4-లీటర్ టర్బోఛార్జ్ డ్ ఇంజన్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో గరిష్టంగా 16.1 కిమీ/లీ మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో 16.2 కిమీ/లీ తిరిగి వస్తుంది.

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఏది బెస్ట్

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రెండింటి తో 15.29 కిమీ/లీ అందిస్తుంది. 1.4-లీటర్ డీజల్ ఇంజన్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో 21.38 కిమీ/లీ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. హ్యుందాయ్ క్రెటా యొక్క 1.6-లీటర్ డీజల్ ఇంజన్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో 19.67 కిమీ/లీ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని మరియు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో 17.01 కిమీ/లీ ను రిటర్న్ చేస్తుంది.

Most Read Articles

English summary
Kia Seltos vs Hyundai Creta: Battle of the Koreans - Read in Telugu
Story first published: Sunday, August 25, 2019, 16:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more