ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ రూ.4.1 కోట్లు

సూపర్ కార్ల తయారీ దిగ్గజం ఇండియన్ మార్కెట్లోకి మరో ఖరీదైన సూపర్‌ను తీసుకొచ్చింది. ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లగ్జరీ కారును రూ. 4.1 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో విపణిలోకి విడుదల చేసింది. ల్యాంబోర్ఘిని కొత్త కారు విడుదలతో పాటు ముంబాయ్ నగరంలో కొత్త షోరూమ్‌ కూడా తెరిచింది.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

ల్యాంబోర్ఘిని కూపే కారులో ఉన్నటువంటి అదే ఇంజన్‌ను హురాకాన్ ఇవో స్పైడర్ కారులో యధివిధిగా అందించారు. హురాకాన్ ఇవో స్పైడర్ కారులో కన్వర్టిబుల్ సాఫ్ట్-టాప్ కలదు. స్టాండర్డ్ హురాకాన్‌తో పోల్చుకుంటే ఈ మోడల్ సుమారు 120 కిలోలు అధిక బరువు ఉంటుంది.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

రూఫ్-ఫోల్డింగ్ మెకానిజమ్ ద్వారా బరువు విపరీతంగా పెరిగింది. గంటకు 50కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నపుడు కేవలం 17 సెకన్లలోనే రూఫ్-టాప్ మూసేయవచ్చు. అదనంగా తీసుకొచ్చిన ఫోల్డింగ్ రూఫ్-టాప్ ద్వారా కారు ఇంజన్ పనితీరు మరియు పర్ఫామెన్స్‌లో ఎలాంటి మార్పు జరగలేదు.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లగ్జరీ సూపర్ కారు కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది; కూపే వేగంతో పోల్చుకుంటే 2 సెకన్లు తక్కువే. అదే విధంగా 0-200కిమీల వేగాన్ని 9.3 సెకండ్లలో చేరుకుంటుంది మరియు ఇవో స్పైడర్ గరిష్టం వేగాన్ని ఎలక్ట్రానిక్ లిమిట్ ద్వారా 325కిలోమీటర్లకు పరిమితం చేశారు.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ సూపర్ కారులో సాంకేతికంగా 5.2-లీటర్ సామర్థ్యం ఉన్న వి10 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 631బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

డిజైన్ విషయానికి వస్తే, ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ చూడటానికి మిగతా ల్యాంబోర్ఘిని కూపే స్టైల్ కార్లనే పోలి ఉంటుంది, కానీ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకునే వీలున్న ఫోల్డింగ్ రూఫ్-టాప్ అదనంగా వచ్చింది. అయినప్పటికీ అక్కడక్కడా పలు కాస్మొటిక్ మెరుగులద్దారు.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

ఫీచర్ల పరంగా చూస్తే ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ ఇంటీరియర్‌లో 8.4-అంగుళాల పరిమాణంలో ఉన్న కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలదు, దీని ద్వారా ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను కంట్రోల్ చేయవచ్చు. క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ మరియు ఎన్నో కనెక్టివిటీ ఫీచర్లను దీనితో నియంత్రించవచ్చు.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

డ్యూయల్ కెమెరా టెలీమెట్రీ, డైనమిక్ స్టీరింగ్, ఆల్-వీల్ స్టీరింగ్, ఇంటిగ్రేటెడ్ వెహికల్ డైనమిక్స్ మరియు టార్క్ వెక్టారింగ్ సిస్టమ్‌తో ఎన్నో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అదనపు ఫీచర్లుగా ఇందులో అందించారు.

ల్యాంబోర్ఘిని హురాకాన్ ఇవో స్పైడర్ లాంచ్ @రూ.4.1 కోట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ల్యాంబోర్ఘిని విక్రయిస్తున్న రెగ్యులర్ హురాకాన్ (కూపే స్టైల్) తరహాలోనే కన్వర్టిబుల్ (ఫోల్డింగ్ రూఫ్-టాప్) శైలిలో ఇవో స్పైడర్ పేరుతో తీసుకొచ్చింది. కన్వర్టిబుల్ (ఓపెన్ రూఫ్ టాప్) ఫీల్ కోరుకునే సూపర్ కార్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్‌ను అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

Most Read Articles

English summary
Lamborghini Huracan Evo Spyder Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X