మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

By N Kumar

ఎస్‌యూవీల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా తమ బెస్ట్ సెల్లింగ్ బొలెరో ఎస్‌‌యూవీలో పలు నూతన ఫీచర్లను అందించి అప్‌గ్రేడ్ చేసింది. ఇండియాలో ఇక మీదట అమ్ముడయ్యే ప్రతి కారులో కూడా భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన అత్యంత కీలకమైన సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా బొలెరో ఎస్‌యూవీలో ఎన్నో మార్పులు జరిగాయి.

సరికొత్త బొలెరోలో వచ్చిన ఫీచర్లు, వేరియంట్లు మరియు ధర గురించి స్పష్టంగా తెలుసుకుందాం రండి...

మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఓవర్-స్పీడ్ అలారమ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు డ్రైవర్, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కొత్తగా వచ్చాయి. అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను అందించినందుకు బొలెరో ప్రేమికులు మహీంద్రా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

మహీంద్రా బొలెరో ఏబిఎస్ వేరియంట్ ఈ ఏడాది ప్రారంభంలో పలు డీలర్ల వద్ద కంటబడింది. అయితే, ఇప్పటి వరకు దీని సేల్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా మహీంద్రా వెబ్‌సైట్లో బొలెరో ఏబిఎస్ వేరియంట్ వివరాలను ఫస్ట్ టైమ్ చేర్చింది.

మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే వాహనాల కోసం భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భద్రత పరీక్షలను పాస్ అవ్వాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా సరికొత్త బొలెరో వాహనాన్ని మహీంద్రా అభివృద్ది చేస్తోంది. అంతే కాకుండా ఏప్రిల్ 01, 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 నూతన ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్ కూడా ఇందులో రానుంది.

మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

మహీంద్రా బొలెరో కోసం భవిష్యత్తులో మరే ఇతర ఇంజన్ ఆప్షన్స్ కోసం ప్రయత్నించడం లేదు. కానీ గతంలో సాధారణ బొలెరో కంటే చిన్న పరిమాణంలో బొలెరో ఎస్‌యూవీని విడుదల చేసింది. 4-మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే సెగ్మెంట్లో ఉండే వాహనాలకు వర్తించే ట్యాక్స్ ప్రయోజనాలను పొందేందుకు ఈ చిన్న బొలెరోను లాంచ్ చేసింది. బహుశా ఇదే మోడల్‌ను కొనసాగించి, బొలెరో పెద్ద మోడల్‌ను పూర్తిగా మార్కెట్ నుండి తొలగించే అవకాశం కూడా ఉంది.

మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తున్న అన్ని ప్యాసింజర్ వాహనాలలోకెల్లా మహీంద్రా బొలెరోనే అత్యధిక అమ్మకాలు సాధిస్తోంది. కానీ ఇదే సెగ్మెంట్లో ఉన్నటువంటి మారుతి సుజుకి వితారా బ్రిజాతో పోల్చుకుంటే తక్కువ సేల్స్ అయినప్పటికీ మహీంద్రా ప్రాబల్యాన్ని పెంచడంలో బొలెరో ఫలితాలు ఎంతగానో సహాయపడ్డాయి.

మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

సరికొత్త మహీంద్రా బొలెరో ఏబిఎస్ వేరియంట్ యధావిధిగా అదే మునుపటి 2.5-లీటర్ డిఐ ఇంజన్‌తో లభిస్తోంది. ఇది 63బిహెచ్‌పి పవర్ మరియు 195ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బొలెరో పవర్ ప్లస్ వేరియంట్లోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 195ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా బొలెరో ఏబీఎస్ వెర్షన్ విడుదల: ధర మరియు బుకింగ్స్

మహీంద్రా బొలెరో ధరల శ్రేణి ప్రస్తుతం రూ. 7.56 లక్షల నుండి రూ. 9.42 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. కానీ, మహీంద్రా బొలెరో ఏబిఎస్ వేరియంట్ల ధరలు మహీంద్రా ఖరారు చేయలేదు. ధరలు మరియు ఏబిఎస్ వెర్షన్ లభించే వేరియంట్ల గురించి పూర్తి సమాచారం కోసం సమీపంలోని మహీంద్రా షోరూమ్‌ను సంప్రదించగలరు.

Most Read Articles

English summary
Mahindra Bolero ABS Launched — Bookings Officially Open Online And Via Dealers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X