మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

By N Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా తమ బొలెరో ఎస్‌యూవీని దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని 2019 బొలెరో పవర్ ప్లస్ అనే స్పెషల్ దీవాళి ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త 2019 మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ దీపావళి స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.68 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఖరారు చేశారు..

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

సరికొత్త మహీంద్రా బొలెరో దీపావళి ఎడిషన్‌లో ఎన్నో కాస్మొటిక్ మెరుగులు, అత్యాధునిక టెక్నాలజీ మరియు ఎన్నో కొత్త ఫీచర్లు వచ్చాయి. పలుమార్పులు చేర్పులు మినహాయిస్తే డిజైన్ మరియు ఇంజన్ పరంగా రెగ్యులర్ బొలెరోతో పోల్చుకుంటే ఎలాంటి మార్పులు జరగలేదు.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

దీపావళి పండుగ సందర్భంగా వచ్చిన మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలో ప్రత్యేకమైన బాడీ డీకాల్స్, సీట్ కవర్లు, కార్పెట్ మ్యాట్లు, స్కఫ్ ప్లేట్లు, బంపర్‌కు ఇరువైపులా అదనంగా వచ్చిన ఫాగ్ ల్యాంప్స్, స్టాప్ ల్యాంప్ గల రియర్ స్పాయిలర్ మరియు స్టీరింగ్ వీల్ కవర్ వంటివి అదనంగా వచ్చాయి.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

బొలెరో పవర్ ప్లస్ వేరియంట్లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లను కూడా జోడించింది. అక్టోబర్ 01, 2019 నుండి అమల్లోకి వచ్చిన నూతన సేఫ్టీ మరియు క్రాష్ టెస్ట్ ప్రమాణాలను ఈ యుటిలిటీ వెహికల్ పాటించడంతో బొలెరో యుటిలిటి సురక్షితమైన ఎస్‌యూవీగా నిలిచింది.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

2019 మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్‌లో కొత్తగా అదనపు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చాయి. ఈ ఎస్‌యూవీ తాజాగా అమల్లోకి వచ్చిన క్రాష్ టెస్ట్ నిబంధనలు పూర్తిగా పాసయ్యింది. ముందు వైపు, ఫ్రంట్-సైడ్ కలిసే ప్రదేశాల్లో అదే విధంగా ప్రక్క వైపుల నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభించే అత్యుత్తమ ఎస్‌యూవీ వాహనాలలో మహీంద్రా బొలెరో ఒకటి. ఇది అవసరాన్ని బట్టి విభిన్న శ్రేణుల్లో లభిస్తోంది. పికప్, క్యాంపర్, మ్యాక్సీ ట్రక్ మరియు ఇంపీరియో అనే వెర్షన్‌లలో బొలెరో వాహనాన్ని ఎంచుకోవచ్చు. రక్షణ అవసరాల నిమిత్తం కూడా ప్రభుత్వం దీన్ని వినియోగిస్తోంది.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యమున్న mHawk D70 డీజల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 195ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఇండియన్ మార్కెట్ కోసం బొలెరో కొత్త వెర్షన్‌ను అభివృద్ది చేస్తున్నట్లు సమాచారం. సరికొత్త మహీంద్రా బొలెరో 2020లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నో అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త అప్‌డేట్స్ మరియు నూతన డిజైన్ శైలిలో బిఎస్-6 ఇంజన్‌తో రానుంది.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్: ధర ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మోడల్ బొలెరో ఎస్‌యూవీ. పవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ ఈ దీపావళికి కస్టమర్లు మరింతగా ఆకట్టుకోనుంది. వివిధ రకాల అవసరాల కోసం బొలెరో పలు రకాల ఆప్షన్లలో లభ్యమవుతోంది.

Most Read Articles

English summary
Mahindra Bolero Power Plus Special Edition Launched In India: Priced At Rs 7.68 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X