మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

మహీంద్రా వారి కెయూవి100 విశాలమైన క్యాబిన్ తో ఉన్న ఒక మంచి క్రాసోవర్ అని చెప్పవచ్చు అయితే ఇది మార్కెట్లో పెద్దగా ఆదరణను పొందలేదు. మహీంద్రా ఇప్పుడు కెయూవి100 ను దేశీయ మార్కెట్లో పుంజుకొనే విధంగా చేయాలనీ ప్రయత్నిస్తోంది. అయితే దీని పై కొత్త ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగు పెట్టింది.

మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

ఈ చిన్న ఎస్యువి యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ ను ఇటీవల రహస్యంగా పరీక్షిస్తుండగా దొరికింది. త్వరలో కొత్త భద్రతా నిబంధనలతో ఈ ఎలక్ట్రిక్ వాహనం లేనందువలన ఈ2ఓ మరియు ఈ2ఓ ప్లస్ ఉత్పత్తిని మహీంద్రా నిలిపివేసింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి తిరిగి రావడానికి కంపెనీ మహీంద్రా కెయూవి100 పై ఎలక్ట్రిక్ వేరియంట్ ను తీసుకొస్తోంది.

మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

ఈ-కెయూవి100 రహస్యంగా పరీక్ష చేస్తున్నప్పుడు కొన్ని చిత్రాలు బయట పడ్డాయి. దీనికి ఈ-కెయూవి అని పిలుస్తారు. మహీంద్రా ఈ-కెయూవి100 భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ చిన్న ఎస్యూవి అవుతుంది. ఈ వాహనంలో రిమోట్ డయాగ్నస్టిక్స్, కాబిన్ ప్రీ-కూలింగ్, రియల్ టైమ్ ట్రాకింగ్, మంచి బ్యాటరీ పనితీరు కలిగి ఉంటుంది.

మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

ఇందులో రెగ్యులర్ ఎసి సాకెట్ ఛార్జింగ్ మరియు డిసి ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉందని తెలిసింది. మహీంద్రా ఈ-కెయూవి యొక్క తుది స్పెసిఫికేషన్ లు కొన్ని మార్పులను చేయనుండగా, ఈ2ఓ పై పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వేహికల్ మెరుగైన పవర్ ట్రైన్ సబ్ సిస్టమ్ ని కలిగి ఉంటుందని తెలిసింది.

మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

ఈ ఎలక్ట్రిక్ వేరియంట్లో పవర్ కు సంబంధించిన కాంపోనెంట్స్ కూడా విభిన్నంగా ఉంటాయని భావిస్తున్నారు. మహీంద్రా ఈ-కెయూవి 40 కిలోవాట్ మరియు 120 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే మోటార్ ని కలిగి ఉంటుందని తెలిసింది.

మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

ఇందులో 16 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీ రేంజ్ మీటర్ పై సుమారు 120 కిలోమీటర్లను ఆఫర్ చేస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ భవిష్యత్ లో ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీని మనం ఆశించవచ్చు.

మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

బ్యాటరీ జోడించే అదనపు బరువును భర్తీ చేయడం కొరకు మహీంద్రా సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సిస్టమ్ ని సర్దుబాటు చేసింది, అయితే ఫ్లోర్, క్యాబిన్ స్పేస్ మరియు బూట్ స్పేస్ యొక్క ఆకారం ఒకేవిధంగా ఉంటుంది.

కొత్త మహీంద్రా ఈ-కెయూవి ఇంటర్నల్ కంబస్టివ్ ఇంజిన్ వేరియెంట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్స్ కు మార్పులు చేస్తుందని ఆశించవచ్చు. అలాగే మహీంద్రా ఈ వాహనాన్ని తగిన ధర కలిగి ఉంటుంది.

మహీంద్రా కెయూవి100 ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తోంది

మహీంద్రా రిటైల్స్ ఈ-కెయూవి ను సుమారు రూ .12 లక్షల మార్కును చేరుకోవచ్చు. ధర, ప్రోత్సాహకాలతో పాటు మరియు ప్రభుత్వం అనేక ప్రయోజనాలు అందించటం ద్వారా ఈ ఎస్యూవి మార్కెట్లో మంచి ఆదరణ పొందవచ్చు, అలాగే ఇది మారుతి వాగన్ఆర్ ఎలక్ట్రిక్ వాహనంపై పోటీపడనుంది.

Most Read Articles

English summary
Mahindra KUV100 Electric Spotted While Testing — Spy Pics And Details
Story first published: Thursday, August 1, 2019, 17:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X