భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

భారతదేశంలో మహీంద్రాకు ఉన్న బ్రాండ్ విలువ అంతా ఇంతా కాదు, ఎందుకంటే వారు తయారుచేసిన వాహనాలు ఎంతో అద్భుతమైన నాణ్యతతో ఉంటాయి. ముఖ్యంగా మహీంద్రా వారి స్కార్పియో, బొలేరో ఎంతో ఆదరణను పొందాయి. ఇప్పటికి మార్కెట్ లొ వీటికి మంచి క్రేజ్ ఉంది.

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

భారతదేశ ఆధారిత ఆటోమోటివ్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, థార్ 700 కారును మార్కెట్లోకి విడుదల చేసింది, ఇది ప్రస్తుత 4x4 ఆఫ్-రోడ్ ఎస్యూవి యొక్క చివరి బ్యాచ్ లో ఈ థార్ 700 ఒకటిగా నిలిచింది.

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచారు. మహీంద్రా యొక్క 70 సంవత్సరాల వారసత్వానికి థార్ 700 కు అంకితం చేయబడింది. మొదటి మహీంద్రా వాహనాన్ని భారతదేశంలో మొదటిగా 1949లో నిర్మించింది.

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

బలమైన సామర్ధ్యం కలిగిన థార్ ఒక నిజమైన ఆఫ్-రోడ్ మరియు కంపెనీ యొక్క ఘనమైన 4x4 వారసత్వాన్ని ఉదాహరిస్తోంది. మహింద్రా సంస్థ థార్ 700 ను లిమిటెడ్ ఎడిషన్ గా విడుదల చేసింది. అంటే ఈ కారు తక్కువ సంఖ్యలొ లభ్యంగా ఉంటుంది.

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

ఇది ప్రజాదరణ పొందిన నెపోలీ బ్లాక్ రంగుతో పాటు, ఇతర కొత్త రంగులలో అందుబాటులో ఉంటుంది. థార్ 700 బ్యాడ్జీ పై మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా యొక్క సంతకం ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉంటుంది.

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

దీనికి అదనంగా, థార్ 700లో, స్టైలిష్ గా ఉండే అల్లాయ్ వీల్స్ , సైడ్ అండ్ బోనెట్ డెబల్స్, గ్రిల్ పై బ్లాక్ ఫినిష్, ఫ్రంట్ బంపర్ మీద సిల్వర్ ఫినిష్, ముందు సీట్లపై లెదర్తో థార్ లోగో ఉంటుంది, మరియు ఇందులో ప్రయాణికుల సురక్షత కోసం ఎబిఎస్ కూడా ఉంది.

Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

వేజయ్ రామ్ నక్రా(మహీంద్రా యొక్క సేల్స్ అండ్ మార్కెటింగ్ చీఫ్, ఆటోమోటివ్ డివిజన్) ఈ ప్రత్యేక సంచిక థార్ 700 గురించి మాట్లాడుతూ, "ప్రస్తుత ఎస్యూవి థార్ యొక్క చిట్టచివరి 700 యూనిట్ లను మేం పరిచయం చేస్తున్నాం.

Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

ఔత్సాహికులు దీనిని బాగా ఆదరిస్తారని అని మేం విశ్వసిస్తున్నాము. ఈ మహీంద్రా థార్ 700 ని పొందాలనుకునే వారికి ఇది చివరి అవకాశం. థార్ 70 సంవత్సరాల వారసత్వంతో మంచి బ్రాండ్గా మహీంద్రాలో నిలుస్తుంది.

Most Read: జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

దీనిని ఆఫ్-రోడ్ విభాగంలో స్టైలిష్ వాహనముగా మహీంద్రా విజయవంతంగా తీర్చిదిద్దింది" అని వారు చెప్పారు. ఈ కంపెనీ నుంచి విభిన్నమైన వాహనం కోసం వెతుకుతున్న మహీంద్రా వినియోగదారులకు మహీంద్రా థార్ 700 ఇది చివరి అవకాశమని చెప్పుకోవచ్చు.

భారతదేశంలో పరిమిత సంఖ్యలో లాంచ్ అయిన మహీంద్రా థార్ 700.!

థార్ 700 ఒక ఇండియన్ ఆఫ్-రోడ్ వాహనం, ఇది మహీంద్రా వారి సిజె, ఎంఎం540, క్లాసిక్, మరియు లెజెండ్ వంటి వాహనాల నుండి ఉద్భవించింది. మహీంద్రా యొక్క కఠినత్వం మరియు దృఢమైన వారసత్వంలో థార్ ప్రతిబింబిస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే థార్ 700 భారతదేశంలో రూ. 9.99 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఇండియా) గా ఉంది.

Most Read Articles

English summary
India based automotive giant Mahindra & Mahindra Ltd. (M&M Ltd.), announced today the launch of the Thar 700 — the last batch of 700 units of the iconic 4x4 off-road SUV in its current avatar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X