మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా విపణిలోకి తమ మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300 AMT) కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదల చేసింది. ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీని తొలుత మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో విడుదల చేసిన మహీంద్రా తాజాగ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందా రండి...

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 మ్యాన్యువల్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 55,000 అధికంగా ఉంది. ఆటో షిఫ్ట్ అనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లాంచ్ చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఏఎమ్‌టి డీజల్ వెర్షన్ టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

W(8) మరియు W8(O) వేరియంట్లలో మాత్రమే ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ. 11.50 లక్షలు మరియు రూ. 12.70 లక్షలు. రెండింటి ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా) ఇవ్వబడ్డాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

XUV300 AMT మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా షోరూముల్లో విక్రయాలకు సిద్దంగా అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతే కాకుండ, ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ వేరియంట్లను బుక్ చేసుకునే కస్టమర్లకు డెలివరీ కూడా వెంటనే ఇవ్వనున్నట్లు తెలిపారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఏఎమ్‌టి సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మూడు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, నీలం, తెలుపు మరియు ఎరుపు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఏఎమ్‌టి అదే మునుపటి 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభిస్తోంది. స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 115బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో పెట్రోల్ ఆప్షన్‌ కూడా అందించింది. కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ 110బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఏఎమ్‌టి టాప్ ఎండ్ వేరియంట్ కావడంతో ఇందులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు పలు రకాల స్టీరింగ్ మోడ్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

"కొత్త టెక్నాలజీని ఎప్పుటికప్పుడు మా కస్టమర్లకు అందుబాటులో ఉంచడమే మా నిరంతరం విజయం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేశాము. బ్రాండ్ విలువను పెంచుకునే క్రమంలో ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లో కూడా లాంచ్ చేశామని" మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ వీజయ్ రామ్ నక్రా తెలిపాడు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్ ఎస్‌యూవీని విడుదలకు ముందే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. ఆటోమేటిక్ ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్లను ఇది ఆకర్షించనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోటీపడనుంది.

Most Read Articles

English summary
Mahindra XUV300 AMT Launched In India — Prices Start At Rs 11.50 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X