మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

భారతదేశపు అతి పెద్ద ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ బిఎస్-6 వెర్షన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 కంపెనీ యొక్క మొట్టమొదటి బిఎస్-6 ఎస్‌యూవీ. దీని ప్రారంభ ధర రూ. 8.3 లక్షల మరియు టాప్ ఎండ్ ధర రూ. 11.84 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు మహీంద్రా ప్రతినిధులు వెల్లడించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలోని పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. డీజల్ వెర్షన్ ఎక్స్‌యూవీ300 యధావిధిగా బిఎస్-4 ప్రమాణాలతోనే లభిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

మహీంద్రా దశల వారీగా తమ అన్ని మోడళ్లలో బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేయనుంది. ఏప్రిల్ 2020 గడువులోగా పెట్రోల్ మరియు డీజల్ అన్ని ఇంజన్‌లు బిఎస్-6 వెర్షన‌లో ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఆర్టీఏ అధికారులు అనుమతిస్తారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

బిఎస్-6 మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలో అదే 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 110బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎస్-4 ఇంజన్‌తో పోల్చుకుంటే బిఎస్-6 వెర్షన్ ఇచ్చే పవర్‌ అవుట్‌పుట్‌లో ఎలాంటి మార్పులేదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 డీజల్ వెర్షన్‌లో 115బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ప్రస్తుతం బిఎస్-4 వెర్షన్‌లోనే లభిస్తోంది, త్వరలో దీనిని కూడా బిఎస్-6 ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలుత ఫిబ్రవరి 2019లో లాంచ్ చేశారు, విడుదలైన తొలి రెండు మూడు నెలల్లో భారీ సక్సెస్ సాధించింది. ఆ వెంటనే వచ్చిన హ్యుందాయ్ వెన్యూ గట్టి పోటీనిచ్చింది. అయితే, కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన బిఎస్-6 వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 సేల్స్ పుంజుకునేందుకు సహాయపడనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

మహీంద్రా ప్రవేశపెట్టిన మొట్టమొదటి బిఎస్-6 మోడల్ ఎక్స్‌యూవీ300. ఏప్రిల్ 2020 లోపు అన్ని మోడళ్లలో దశల వారీగా బిఎస్-6 ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌‌యూవీ మారుతి సుజుకి వితారా బ్రిజా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Mahindra XUV300 BS6 Petrol Launched In India: Prices Start At Rs 8.3 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X