అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సరికొత్త బిఎస్-6 డీజల్ ఇంజన్‌ను తమ అన్ని కార్లలో అందించాలనే నిర్ణయం తీసుకుంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి సుజుకి వచ్చే ఏడాది నాటికల్లా సరికొత్త 1.6-లీటర్ బిఎస్-6 డీజల్ ఇంజన్‌ను పరిచయం చేస్తున్నట్లు సమాచారం.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఈ సరికొత్త ఇంజన్‌ను ఫియట్ నుండి సేకరించారు. మారుతి సజుకి ఇండియా లైనప్‌లో ఉన్న వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎస్-క్రాస్ క్రాసోవర్, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఎంపీవీ కార్లలో ఈ ఇంజన్ అందించే అవకాశాలు ఉన్నాయి.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

అతి త్వరలో పరిచయం కానున్న ఇంజన్ ఎస్-క్రాస్ మోడల్‌తో బిఎస్-4 ప్రమాణాలతో గతంలోనే వచ్చింది. కానీ ఆశించిన సేల్స్ సాధించడంలో విఫలమవడంతో మార్కెట్ నుండి వైదొలగింది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇంజన్ 118బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

మారుతి సుజుకి ఏప్రిల్ 2019 నుండి తమ కార్లలో బిఎస్-6 ప్రమాణాలను పాటించే పెట్రోల్ ఇంజన్‌లను అందివ్వడం ప్రారంభించింది. బిఎస్-6 పొందిన తొలి మారుతి మోడల్ బాలెనో హ్యాచ్‌బ్యాక్. 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కంపెనీ యొక్క తొలి బిఎస్-6 ఇంజన్.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

బిఎస్-6 ఇంజన్‌లను తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వం ప్రకటించిన గడువులోపే వ్యాగన్ఆర్, స్విఫ్ట్ మరియు డిజైర్ కార్లలో బిఎస్-6 ఇంజన్ వచ్చింది. ఇటీవల విడుదలైన ఎర్టిగా ఎంపీవీ మరియు ఎర్టిగా ఆధారిత ప్రీమియం వెర్షన్ ఎక్స్ఎల్6 ఎంపీవీ కార్లలో అదే విధంగా తాజాగ మార్కెట్లోకి వచ్చిన మారుతి ఎస్-ప్రెస్సో స్మాల్ కార్‌లో కూడా బిఎస్-6 ఇంజన్ వచ్చింది.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

మారుతి సుజుకి అన్ని ఇంజన్ వేరియంట్లను మార్కెట్ నుండి తొలగిస్తున్నట్లు ఇది వరకే ఓ ప్రకటనలో పేర్కొంది. బిఎస్-6 ప్రమాణాలను పాటించే డీజల్ ఇంజన్‌ను డెవలప్ చేయడానికి అధికం వ్యయం వెచ్చించాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకుంది. అధిక పెట్టుబడుల కారణంగా తమ ఉత్పత్తుల ధరలను పోటీతత్వంతో నిర్ణయించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ధరలు పెరుగుతాయని, డీజల్ ఇంజన్ వేరియంట్లకు స్వస్తి పలకాలని భావించింది.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

అయితే, ఇటీవల కాలంలో ఎస్‌యూవీ మోడళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వదులుకునేందుకు మారుతి సిద్దంగా లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ కెపాసిటీ గల డీజల్ ఇంజన్‌ను బిఎస్-6 ప్రమాణాలతో ప్రత్యేకించి ఎస్‌యూవీ మరియు ఎంపీవీ మోడళ్ల కోసం తీసుకురావాలని భావించింది.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

ఎస్-క్రాస్ మరియు వితారా బ్రిజా మోడళ్లు అతి త్వరలో 1.5-లీటర్ బిఎస్-6 SHVS పెట్రోల్ ఇంజన్‌తో రానున్నాయి. ఈ ఇంజన్‌ను ఇప్పటికే ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 మోడళ్లలో అందించింది. అయితే, ప్రస్తుతం ఉన్న 1.3-లీటర్ డీజల్‍ను శాస్వతంగా తొలగిస్తున్నారు మరియు దీనిని బిఎస్-6 ప్రమాణాలతో తీసుకొచ్చే ఆలోచన కూడా లేదు.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

ఏప్రిల్ 1, 2020 నుండి మార్కెట్లోకి అమ్ముడయ్యే ప్రతి కారు కూడా బిఎస్-6 ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ ప్రమాణాల ద్వారా ఇంజన్‌లు తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తాయి.

అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం

"బిఎస్-6 డీజల్ ఇంజన్‌లు ఇకపై ఉండబోవని.." మరోసారి డిమాండ్ ఎక్కువగా ఉందని "సరికొత్త ఇంజన్ ఆప్షన్లో మళ్లీ బిఎస్-6 డీజల్ ఇంజన్‌ వేరియంట్లను కొనసాగిస్తామని" ఇలా రకరకాల స్టేట్‌మెంట్లు ఇస్తూ కస్టమర్లను తికమక పట్టించింది.

కానీ, ఏదేమైనప్పటికీ బిఎస్-6 డీజల్ వేరియంట్లను తమ అన్ని మోడళ్ల లాంచ్ చేస్తామని ప్రకటించింది. మారుతి కార్లను డీజల్ వేరియంట్లలో కొనాలనుకునే కస్టమర్లకు ఇదొక గొప్ప అవకాశం.

Most Read Articles

English summary
Maruti Suzuki To Introduce New 1.6-Litre BS-VI Compliant Diesel Engine By Next Year. Read in Telugu.
Story first published: Monday, November 11, 2019, 11:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X