అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

ఇండియాలో అత్యధికంగా ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) అతి త్వరలో ఎర్టిగా ఎంపీవీని మరో కొత్త వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఎర్టిగా ఎంపీవీలలో ఈ వెర్షన్ అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలవనుంది. అంతే కాకుండా, ఈ వేరియంట్‌ను కేవలం నెక్సా షోరూమ్‌ల ద్వారా మాత్రమే విక్రయించాలనే భావిస్తోంది.

మారుతి ఎర్టిగా కొత్త వెర్షన్ గురించి పూర్తి వివరాలను ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

మారుతి సుజుకి తమ సరికొత్త ఎర్టిగా ఎంపీవీ వేరియంట్‌ను ఆగష్టు 21, 2019 న విడుదల చేసి, విక్రయాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. డిజైన్ పరంగా ప్రస్తుతం ఉన్న మోడల్‌నే పోలి ఉన్నప్పటికీ, ఖరీదైన వెర్షన్ కోరుకునే కస్టమర్ల కోసం క్రాసోవర్ మోడల్ అనిపించేందుకు ఇందులో పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

మారుతి ఎర్టిగా క్రాస్ అని పిలుచుకునే ఈ మోడల్ మునుపటి ఎర్టిగా వెర్షన్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ మరియు టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సరికొత్త ఎర్టిగాలోని మరో ప్రత్యేకత ఏమిటంటే... అధునాతన 6-సీటర్ క్యాబిన్ ఫార్మాట్‌లో రావడం.

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

మారుతి సుజుకి తమ సరికొత్త ఎర్టిగా క్రాస్ మోడల్‌ను సీఎన్‌జీ ఇంజన్ వేరియంట్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే ఎర్టిగా ఎంపీవీ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. వీటకి అదనంగా సీఎన్‌జీ ఇంజన్ వేరియంట్‌ను కూడా పరిచయం చేస్తున్నారు.

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

సెకండ్ జనరేషన్ ఎర్టిగా ఎంపీవీలో సీఎన్‌జీ ఇంజన్ అందించాలనే కంపెనీ ఆలోచన ఎర్టిగా మోడల్‌తో పాటు, మార్కెట్లో కంపెనీకి మంచి బలాన్నిస్తుంది. మారుతి ఇటీవల విడుదల చేసిన సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో వచ్చిన సరికొత్త 1.5-లీటర్ కె15బి పెట్రోల్ ఇంజన్ ఆధారంగానే సీఎన్‌జీ ఇంజన్ డెవలప్ చేస్తున్నారు.

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఈ కె15బి పెట్రోల్ ఇంజన్ ఎర్టిగా మరియు సియాజ్ కార్లలో ఇప్పటికే అందుబాటులో ఉంది. అదనంగా కంపెనీ డెవలప్ చేసిన SHVS అనే మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ జోడింపుతో ఈ ఇంజన్‌లు లభిస్తున్నాయి. సాధారణ ఇంజన్‌తో పోల్చితే హైబ్రిడ్ సిస్టమ్ ఉన్న మోడళ్లు మంచి మైలేజ్ ఇస్తాయి.

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో పోల్చుకుంటే సీఎన్‌జీ ఇంజన్‌ల నుండి వెలువడే కర్బన ఉద్గారాలు మోతాదు తక్కువగా ఉంటుంది. పర్యావరణహితమైన ఇవి అత్యుత్తమ మైలేజ్ ఇస్తాయి. మార్కెట్లో పెట్రోల్ మరియు డీజల్‌తో పోల్చుకుంటే సీఎన్‌జీ ఇంధన ధర కూడా తక్కువగానే ఉంది.

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

మునుపటి జనరేషన్ మారుతి ఎర్టిగా సీఎన్‌జీ వేరియంట్ ఒక కిలో సీఎన్‌జీ ఇంధనానికి 22.8కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా, సీఎన్‌జీ మరియు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ జోడింపుతో వస్తున్న సరికొత్త మారుతి ఎర్టిగా క్రాస్ సీఎన్‌జీ వేరియంట్ గరిష్టంగా 25కిలోమీటర్ల మైలేజ్‌నిస్తుంది.

అత్యధిక మైలేజ్‌తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇప్పటికే అమ్మకాల్లో ఉన్న మారుతి ఎర్టిగా సీఎన్‌జీ మంచి మైలేజ్ ఇస్తోంది, కానీ సీఎన్‌జీకి తోడుగా మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా కలవడంతో త్వరలో రానున్న ఎర్టిగా క్రాస్ మోడల్ మరింత ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కాలుష్యాన్ని కాపాడుకుంటూనే సేల్స్ మరియు కస్టమర్ల ఆకట్టుకునేందుకు నూతన టెక్నాలజీని అభివృద్ది చేసి, ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడళ్లలో పరిచయం చేస్తోంది.

Most Read Articles

English summary
Maruti Suzuki To Launch The Ertiga CNG Soon. Read in Telugu.
Story first published: Saturday, July 13, 2019, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X