ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

మారుతి సుజుకి తమ మోస్ట్ పాపులర్ ఎంపివి కొత్త తరం ఎర్టిగా కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. పాత తరం ఎర్టిగాతో పోల్చితే, ఈ కొత్త తరం ఎర్టిగా ఎంపివిని అధునాతన డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే మారుతీ సుజుకి దీని ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. మరి దీని గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

మారుతి సుజుకి వారి మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2020 లో ఇండియన్ మార్కెట్లో వ్యాగన్ ఆర్ ఆధారంగా ఉంటుందని నిర్ధారించారు. ఇప్పుడు ఆ సంస్థ తన రెండో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ తీసుకురావడం కోసం పనిచేస్తోందని తెలిసింది. భారతదేశంలో సుజుకి నుండి రెండవ ఎలక్ట్రిక్ వాహన తయారీ, బాగా ప్రజాదరణ పొందిన ఎర్టిగ ఎంపివి ఆధారంగా ఉంటుంది.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

కొత్త మారుతి ఎర్టిగా ఎలెక్ట్రిక్ పూర్తిగా భిన్నమైన కొలతలు, రూపకల్పనతో ఒక కొత్త బ్రాండ్ పేరు కూడా పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ రెండో ఎలక్ట్రిక్ వాహనంకు సంబంధించిన ప్రణాళికను ఇంకా ఫైనలైజ్ చేయాలని రిపోర్టులు సూచించాయి. అయితే భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎటువంటి స్థానం ఉందో మనకి తెలుసు.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

లక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్ లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇతర బ్రాండ్ ల నుంచి పోటీని ఎదురుకోవడానికి మారుతీ సుజుకీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం దేశంలో వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్ 50 లను పరీక్షిస్తోంది. ఎలక్ట్రిక్ వ్యాగన్ ఆర్ ను మార్కెట్ లో, అనేక విభిన్న సందర్భాలలో విస్తృతంగా పరీక్షిస్తున్నారు.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

అంతేగాక మారుతి వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్ ను లాంచ్ చేసి గుజరాత్ లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంటును నెలకొల్పేందుకు కూడా ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. అయితే, దీని ప్రత్యర్థులు టాటా మోటార్స్ కూడా ఇటీవల గుజరాత్ లో ఇదే తరహా లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంటును నెలకొల్పేందుకు తమ ప్రణాళికలను ప్రకటించింది.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

మారుతి సుజుకి ఈ ఏడాది మొదట్లో రెండవ తరం ఎర్టిగా ఎంపివి ను దేశీయంగా ప్రారంభించింది. అప్పటినుండి, మారుతి ఎర్టిగా మార్కెట్లో అత్యంత విజయంతో ఆదరణ పొందింది, ఈ ఎంపివి సెగ్మెంట్ కు మంచి అమ్మకాలు నమోదు జరిగింది.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

ఇండియన్ మార్కెట్లో మల్టీ పర్పస్ వెహికల్ విజయం సాధించడం వలన మారుతి ఎర్టిగా ఎంపివిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎంచుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. మారుతి సుజుకి ఎర్టిగా ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో రెండింటిలోను అందుబాటులో ఉంది.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, 1.3-లీటర్ డీజల్ మరియు ఒక 1.5-లీటర్ డీజల్ కూడా ఉన్నాయి. అలాగే మారుతి ఒక ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లను కూడా అందిస్తోంది. కొత్త మారుతి సుజుకి ఎర్టిగా రూ. 7.44 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎర్టిగా ఎంపివి మరింత ప్రీమియమ్ సిక్స్ సీటర్ వర్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. కొత్త ప్రీమియం ఎర్టిగా ఈ ఏడాది ఆగస్టు 21 వ తేదీ నుంచి అమ్మకానికి రానుంది.

ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

మారుతీ సుజుకీ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్ దిశగా దూకుడు వ్యూహాని రచిస్తోంది. 2020 లో భారతదేశంలో ప్రారంభించటానికి ఎలక్ట్రిక్ వ్యాగన్ ఆర్ సిద్ధం అవుతోంది, ఎలక్ట్రిక్ ఎర్టిగా ఎంపివి తరువాత దశలో మార్కెట్ లోకి బహుశా 2021 లో వస్తుందని ఆశించవచ్చు. అయితే మారుతి సుజుకి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Working On Electric Version OF The Ertiga MPV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X