YouTube

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇటీవల మార్కెట్లోకి ఎస్-ప్రెస్సో మినీ-ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త మారుతి ఎస్-ప్రెస్సో స్మాల్ ఎస్‌యూవీ కారు కేవలం సింగల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతోంది. కానీ ఇటీవల రహస్యంగా లీకైన ఎస్-ప్రెస్సో ఫోటోల ప్రకారం మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్జీ వేరియంట్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

తాజాగా బయటికొచ్చిన మారుతి ఎస్-ప్రెస్సో సీక్రెట్ ఫోటోలను పరిశీలిస్తే మారుతి ఎస్-ప్రెస్సో కారులోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో సీఎన్జీ లోగోను చూడవచ్చు. దీనర్థం.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వెర్షన్‌కు కొనసాగింపుగా సీఎన్జీ వెర్షన్‌ను మారుతి డెవలప్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. బహుశా ఇందులో ఆల్టో కె10లో ఉన్నటువంటి అదే సీఎన్జీ ఇంజన్ యూనిట్ వినియోగించుకునే అవకాశం ఉంది.

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారులో ఇప్పటికే ఆల్టో కె10 నుండి సేకరించిన 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అందించారు. 5-స్పీడ్ మ్యాన్యుల్ మరియు ఏజీఎస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

ఏదేమైనప్పటికీ, ఎస్-ప్రెస్సో కారులో ఉన్నటువంటి ఇంజన్ ఆల్టో కె10 తరహాలో కాకుండా బిఎస్-6 ఉద్గార ప్రమణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఏప్రిల్ 2020 నుండి రిజస్టర్ అయ్యే ప్రతి కారులో కూడా బిఎస్-6 ఇంజన్ తప్పనిసరిగా ఉండాలి.

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో స్మాల్ ఎస్‌యూవీ కారును కంపెనీ యొక్క హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. మారుతి ఎస్-ప్రెస్సో ఇండియన్ క్రాష్ టెస్ట్ నియమాలను కూడా పాటిస్తోంది.

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

మారుతి ఎస్-ప్రెస్సో మినీ ఎస్‌యూవీ నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, Std, LXI, VXi and VXi+. అన్ని వేరియంట్లలో దాదాపు అన్ని ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి. వీటిలో ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సుజుకి వారి స్మార్ట్‌ప్లే స్టుడియో సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్, ఏబిఎస్, ఇబిడి, డ్యూయల్ ఎయిర్ బ్యాగులు మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో పాటు ఎన్నో ఫీచర్లున్నాయి.

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో ఇటీవల సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత ఆరు నెలల కాలంలో మారుతి ఏకంగా 2 లక్షలకు పైగా బిఎస్6 కార్లను విక్రయించింది. ప్రస్తుతం దేశీయ విపణిలో ఎక్కువ బిఎస్-6 మోడళ్లు గల కంపెనీ మారుతి సుజుకి, ఎస్-ప్రెస్సో విడుదలతో ఇప్పుడు ఏకంగా 8 కార్లు బిఎస్6 ప్రమాణాలతో లభ్యమవుతున్నాయి.

మరో సంచలానికి సిద్దమవుతున్న మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ వేరియంట్ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఎస్-ప్రెస్సో మోడల్ లభించే మిడ్-వేరియంట్ VXi ఆధారంగా సీఎన్జీ వెర్షన్ రానుంది. స్టాండర్డ్ బేసిక్ వేరియంట్ కంటే దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. సరికొత్త మారుతి ఎస్-ప్రెస్సో రెనో ఇండియా ఇటీవల విడుదల చేసిన క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌కు గట్టి పోటీనిస్తుంది.

Source: Cartoq

Most Read Articles

English summary
Maruti Suzuki S-Presso CNG Variant In The Works? India Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X