మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సెప్టెంబర్ 30, 2019న ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో మారుతి ఆవిష్కరించిన ఫ్యూచర్-ఎస్ కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా ఎస్-ప్రెస్సో కారును ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం తయారు చేశారు.

మారుతి ఎస్-ప్రెస్సో విడుదలైన మొదటి నెలలోనే భారీ విజయాన్ని అందుకుంది. మారుతి కూడా ఈ సక్సెస్ ఊహించలేకపోయింది. ఇతర మోడళ్లను సైతం వెనక్కి నెట్టేసింది...

మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

సెప్టెంబర్ చివర్లో రావడంతో అక్టోబర్ నెల మొత్తం మారుతి ఎస్-ప్రెస్సో మోడల్ షోరూముల్లో తీవ్ర అలజడి సృష్టించింది. ఈ మోడల్‌కు కస్టమర్ల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఒక్క అక్టోబర్ నెలలోనే 10,634 ఎస్-ప్రెస్సో కార్లు అమ్ముడయ్యాయి. ఈ సేల్స్ మారుతి సుజుకి పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రిజా కంటే అధికం.

మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

తొలి నెల సేల్స్‌తోనే మారుతి ఎస్-ప్రెస్సో మోడల్ వితారా బ్రిజా సేల్స్‌ను అధిగమించింది. ఇండియన్ మార్కెట్లోకి అత్యధికంగా అమ్ముడుపోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు మారుతి యొక్క మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా రాణిస్తున్న వితారా బ్రిజాను సేల్స్ పరంగా వెనక్కి నెట్టేసింది.. ఇదొక సాహసమనే చెప్పాలి.

మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

ఎత్తైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పొడవాటి సీటింగ్ పొజిషన్‌తో మారుతి ఎస్-ప్రెస్సో చూడటానికి ఓ చిన్న సైజు ఎస్‌యూవీలా ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ మరియు సైడ్ ప్రొఫైల్ చూస్తే స్మాల్ సైజ్ వితారా బ్రిజా ఎస్‌యూవీని పోలి ఉంటుంది.

మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

మారుతి వితారా బ్రిజా సేల్స్ విషయానికి వస్తే అక్టోబర్ 2019 నెలలో 10,227 యూనిట్లు అమ్ముడయ్యాయి. వితారా బ్రిజా మరియు ఎస్-ప్రెస్సో రెండు మోడళ్లు కూడా అక్టోబర్ 2019లో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఎస్-ప్రెస్సో 8వ స్థానంలో ఉండగా వితారా బ్రిజా 9వ స్థానంలో నిలిచింది.

మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

మారుతి ఎస్-ప్రెస్సో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారులో సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటీ గల బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ ఉంది. మారుతి ఆల్టో కె10 కారు నుండి ఈ ఇంజన్ సేకరించినప్పటికీ.. దీనిని బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి అందించారు. మారుతి ఆల్టో కె10 కారులో వచ్చే ఏప్రిల్ నాటికల్లా బిఎస్-6 ఇంజన్‍‌ను అందివ్వనున్నారు.

మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

మారుతి ఎస్‌-ప్రెస్సోలోని 1.0-లీటర్ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. ఎస్-ప్రెస్సో టాప్ ఎండ్ వేరియంట్లను 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‍‌బాక్స్‌ ఆప్షన్‌లో కూడా ఎంచుకోవచ్చు.

మారుతి ఎస్-ప్రెస్సో: విడుదల చేసిన నెలకే తల పట్టుకుంటున్న కంపెనీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి ఎస్-ప్రెస్సో ఇండియన్ మార్కెట్లోకి పరిచయమైన ఒక కొత్త మోడల్. మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త మోడల్ ప్రయోగాత్మకంగానే ఉంటుంది, ప్రారంభ దశలో ఆశించిన మేర ఫలితాలు లభించడం కాస్త కష్టమే.. కానీ మారుతి ఎస్-ప్రెస్సో ఇలాంటి ఎన్నో ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ భారీ సక్సెస్ అందుకుంది.

సరిగ్గా పండుగ సీజన్‌లో రావడంతో మంచి ఫలితాలు సాధించింది. మారుతి ఎస్-ప్రెస్సో రానున్న మరో నాలుగైదు నెలలు ఇదే ట్రెండ్ కొనసాగించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Maruti S-Presso Sales Overtakes Vitara Brezza In India: Registers 10,634 Units Of Sales In October. Read in Telugu.
Story first published: Monday, November 11, 2019, 9:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X