ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

మారుతి సుజుకి డిజైర్... 10 ఏళ్లుగా ఈ కార్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 10 ఏళ్ల కాలంలో సుమారుగా 19 లక్షల మంది కస్టమర్లు మారుతి డిజైక్ కారును సొంతం చేసుకున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2.5 లక్షల డిజైర్ కార్లను మారుతి విక్రయించింది. అంటే సగటున నెలకు 21,000 యూనిట్లు. అంటే సగటున ప్రతి రెండు నిమిషాలకు ఒక కారు అమ్ముడైనట్లు లెక్క. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ విక్రయాల్లో మారుతి డిజైర్ మార్కెట్‌ షేర్‌ 55 శాతం కాగా, రెండో స్థానంలో అమేజ్ నిలిచింది.

మారుతి సుజుకి డిజైర్ భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచేందుకు దోహదపడిన అంశాలేంటో చూద్దాం రండి...

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

మారుతి సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మారుతి సుజుకి ప్రయాణంలో డిజైర్ పాత్ర ఎంతో కీలకం. మా కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. డిజైర్ లాంఛ్ చేయడం ద్వారా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌ను సృష్టించాం. ఈసెగ్మెంట్ రోజురోజుకీ పెరుగుతోంది. మారుతి సుజుకి డిజైర్ కొన్నేళ్లుగా కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. మొత్తం అమ్మకాల్లో మూడవ జనరేషన్ డిజైర్ కారు వాటా 20% ఉందని చెప్పుకొచ్చారు".

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

మార్పులు-చేర్పులు

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారును 2017 మే నెలలో భారీ మార్పులు చేర్పులతో నూతన డిజైన్ అంశాలతో మూడవ (థర్డ్) జనరేషన్ డిజైర్ కారును లాంచ్ చేసింది. అప్పటి నుండి డిజైర్ కారు సేల్స్ విపరీతంగా పెరిగాయి. హార్టెక్ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడం కూడా థర్డ్ జనరేషన్ డిజైర్‌ సక్సెస్‌కు బాగా కలిసొచ్చిన అంశం. థర్డ్ జనరేషన్ డిజైర్ మరియు స్విఫ్ట్ డిజైన్ పరంగా చూడటానికి అచ్చం ఒకేలా ఉంటాయి.

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

ఇంజన్ - గేర్‌బాక్స్

డిజైన్ మరియు ఫీచర్ల పరంగా సరికొత్త డిజైర్‌లో ఎన్నో మార్పులు జరిగినా డిజైర్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన మునుపటి ఇంజన్‌లను యథావిధిగా అదందించారు. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-డీజల్ ఇంజన్‌లను ఇందులో కొనసాగింపుగా తీసుకొచ్చారు. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

పవర్-మైలేజ్

సరికొత్త డిజైర్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్‌కు 22 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు. అదే విధంగా నూతన డిజైర్‌లోని 1.3-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 73బిహెచ్‌పి పవర్ మరియు 189ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు, మరియు లీటర్‌కు 28.40 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. దేశీయంగా అత్యధిక మైలేజ్ ఇవ్వగల ఏకైక డీజల్ కారు డిజైర్.

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

ఇంటీరియర్

డిజైన్ పరంగానే కాకుండా ఇంటీరియర్‌ స్పేస్‌ను మరింత పెంచడానికి మారుతి ప్రయత్నించింది.పాత డిజైర్‌తో పోల్చుకుంటే ఫ్రంట్ క్యాబిన్, రియర్ క్యాబిన్ మరియు లెగ్ రూమ్ మరింత స్పేసియష్‌గా మారింది. నూతన మోడల్‌లో లైట్ క్రీమ్ కలర్ లైటింగ్ షేడ్, డిజైర్‌లోని టాప్ ఎండ్ వేరియంట్‌లో డ్యాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్ మరియు డోర్లకు లోపలివైపున ఫాక్స్ బర్ల్ అనే కలప సొబగులు అందించి ప్రీమియమ్ ఫీల్ కల్పించారు.

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

ఫీచర్లు

ఆపిల్ కార్ ప్లే మరియు అండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. మరియు వెనుక వరుసలో కూర్చునే ప్యాసింజర్ల కోసం ప్రత్యేక ఏసీ వెంట్స్ అందివ్వడం జరిగింది.

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

సేఫ్టీ ఫీచర్లు

భద్రత పరంగా మారుతి సుజుకి సరికొత్త డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు, చైల్డ్ సీట్ ఫిక్స్ కోసం ఐఎస్ఒఫిక్స్ యాంకర్స్ అదే విధంగా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌లను స్టాండర్డ్‌గా అందించారు.

ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

సరికొత్త డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును ఆరు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి,

  • ఆక్స్‌ఫర్డ్ బ్లూ
  • షెర్వూడ్ బ్రౌన్
  • గల్లంట్ రెడ్
  • మ్యాగ్మా గ్రే
  • సిల్కీ సిల్వర్
  • పర్ల్ ఆర్కిటిక్ వైట్.
  • ప్రతి రెండు నిమిషాలకో కారు సేల్స్.. ఆ ఒక్క మోడల్‌కు ఎందుకంత క్రేజ్?

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    మారుతి సుజుకి ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌ను మిడ్-క్లాస్ ఫ్యామిలీకి చేరువ చేయడంలో ఎంతగానో శ్రమించింది. ధరలను దృష్టిలో ఉంచుకుని డిజైన్, ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్, దానికి తగ్గట్లుగా పవర్, బడ్జెట్ ఫ్యామిలీ కోసం బెస్ట్ మైలేజ్, విభిన్న కస్టమర్ల కోసం పలురకాల కలర్ ఆప్షన్స్ మరియు ప్రయాణికుల భద్రత దృష్ట్యా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను అందించి మారుతి డిజైర్ కారును ఈ సెగ్మెంట్‌కే రాజును చేసింది. ఇది నిన్నమొన్న వచ్చిన కీర్తి కాదు.. గత పదేళ్ల కానుండి ఈ స్థానంలో మారుతి డిజైర్‌దే సింహభాగం.

    ఇదే కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్, ఫోర్డ్ ఆస్పైర్, టయోటా ఎటియోస్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో మోడళ్లు మారుతి డిజైర్ నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki Dzire is sold in India every two minutes. A bestseller for a decade. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X