ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

By N Kumar

ఇండియన్ మార్కెట్లో 6 లక్షల ఆటోమేటిక్ కార్లను విక్రయించి మారుతి సుజుకి మరో అరుదైన మైలురాయిని చేధించింది. వీటిలో 5 లక్షల కార్లలో ఇండియన్ మార్కెట్లోకి తొలిసారిగా పరిచయమైన మారుతి ఏజీఎస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ప్యాసింజర్ కార్ల మార్కెట్లలో ఇండియా ఒకటి, ఎన్నో కార్ల కంపెనీలు రకరకాల మోడళ్లను విక్రయించేవి, అయితే అన్నింటిలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండి. అయితే భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సరిగ్గా 2014లో తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారులో ఏజీఎస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించింది.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

దేశీయంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన మొట్టమొదటి కారు మారుతి సెలెరియో, ఇందులో "ఆటో గేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్" అనే గేర్‌బాక్స్ అందివ్వడం జరిగింది. అప్పటి నుండి మారుతి సెలెరియో ఆటోమేటిక్ వేరియంట్ల సేల్స్ నెమ్మదిగా పుంజుకున్నాయి. ఒక్క 2018-19 మధ్య కాలంలోనే ఏజీఎస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉన్న 2 లక్షల కార్లు అమ్ముడయ్యాయి.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

మారుతి సుజుకి ప్రస్తుతం 12 మోడళ్లను విక్రయిస్తోంది. వీటన్నింటిలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆప్షనల్ పరిచయం చేసింది. ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, డిజైర్ మరియు బ్రిజా మోడళ్లలో మారుతి ప్రత్యేకంగా అభివృద్ది చేసిన ఆటోమేటిక్ గేర్‌షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ (AGS) అందిస్తోంది.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

మారుతి సుజుకి సియాజ్, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 కార్లలో సాధారణ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండగా. మారుతి విక్రయించే కార్లలో బాలెనో మోడల్ మాత్రమే కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

మారుతి సుజుకి కస్టమర్లకు అత్యుత్తమ ఆటోమోటివ్ టెక్నాలజీని అందివ్వడే తమ లక్ష్యమని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అధిపతి కెనిచి అయుకవా పేర్కొన్నాడు. మారుతి సాధించిన ఈ కొత్త మైలురాయిలో మేము ప్రవేశపెట్టే నూతన టెక్నాలజీ పట్ల కస్టమర్ల విశ్వాసం మరియు వారి అంగీకారాన్ని సూచిస్తోందని తెలిపారు.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

అత్యంత కఠినమైన సిటీ ట్రాఫిక్ మరియు స్టాప్-అండ్-గో రోడ్ల మీద కార్లను సులభంగా నడిపేందుకు మారుతి సుజుకి ఆటోమేటిక్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. హైవేలో కూడా అత్యంత అనువైన డ్రైవింగ్ సౌకర్యాన్ని కలిగిస్తుంది. మారుతి ఆటోమేటిక్ కార్లకు పూనే, బెంగళూరు, ముంబాయ్, హైదరాబాద్, చెన్నై మరియు ఢిల్లీ నగరాల్లో డిమాండ్ అధికంగా ఉంది.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

మారుతి సుజుకి విక్రయిస్తున్న కార్లలోకెల్లా అత్యంత సరసమైన ధరలో లభించే ఆటోమేటిక్ మోడల్ మారుతి ఆల్టో కె10, దీని ప్రారంభ ధర రూ. 4.38 లక్షలు. మరియు మారుతి లైనప్‌లో అత్యంత ఖరీదైన ఆటోమేటిక్ మోడల్ మారుతి ఎక్స్ఎల్6 ఆల్ఫా ఆటోమేటిక్ వేరియంట్, దీని ధర రూ. 11.46 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోకి ఈ ఘనత మారుతి సుజుకి సంస్థకు డ్రైవ్‌‌స్పార్క్ తరపు నుండి శుభాకాంక్షలు. అత్యంత సరసమైన కార్లలో అందరికీ అందుబాటులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తీసుకొచ్చి మారుతి మంచి సక్సెస్ సాధించింది. మారుతి భవిష్యత్తులో పరిచయం చేసే అన్ని మోడళ్లలో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తప్పనిసరిగా పరిచయం చేస్తుంది. ఫ్యూచర్‌లో మారుతి మరిన్ని మైలురాళ్లను చేరుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Most Read Articles

English summary
Maruti Suzuki Sells Over 6 Lakh Automatic Cars: Reaches New Milestone. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X