మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి అతి త్వరలో మరో కొత్త కారును పరిచయం చేయనుంది. ఆగష్టు 21వ తేదీన విపణిలోకి సరికొత్త 6-సీటర్ ఖరీదైన ఎంపీవీ కారును లాంచ్ చేయనుంది. ఇది మారుతి ఇండియా లైనప్‌లోనే అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలవనుంది.

అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మారుతి ఖరీదైన కారుగా చెప్పుకునే ఎక్స్ఎల్6 మోడల్ గురించి పలు కీలక విషయాలు రహస్యంగా లీక్ అయ్యాయి. ఇవాళ్టి స్టోరీలు అవేంటో చూద్దాం రండి...

మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

సేల్స్ పెంచుకునేందుకు మార్కెట్లో నూతన ఒరవడికి తెరదించుతున్న మారుతి సుజుకి ఇప్పటికే మార్కెట్లో లభించే మారుతి ఎర్టిగా ఎంపీవీ మోడల్ ఆధారంగా ఈ ఖరీదైన కారును రూపొందిస్తోంది. చాలా మందికి తెలియని ఈ నిజాన్ని మారుతి అత్యంత గోప్యంగా ఉంచుతూ కొత్త గాలిని పరిచయం చేస్తున్నట్లు ప్రయత్నిస్తోంది.

మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

మారుతి తమ ఎక్స్ఎల్6 మోడల్ ఎంపీవీ కారును ఇండియన్ రోడ్ల మీద ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది. తాజాగా నిర్వహించిన టెస్టింగ్‌లో ఈ సరికొత్త మారుతి ఎక్స్ఎల్6 మోడల్ మారుతి ఎర్టిగా కంటే పరిమాణంలో పెద్దదని తేలింది. పొడవు మరియు ఎత్తు రెండింటి పరంగా ఎక్స్ఎల్6 ఎర్టిగా కంటే పెద్దదిగా ఉంటుంది.

మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

మారుతి ఎక్స్ఎల్6 ప్రీమియం ఎంపీవీ కొలతలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి...

  • పొడవు: 4,445ఎమ్ఎమ్
  • వెడల్పు 1,775ఎమ్ఎమ్
  • ఎత్తు 1,700ఎమ్ఎమ్
  • వీల్ బేస్ 2,740ఎమ్ఎమ్
  • టర్నింగ్ రేడియస్ 5.2 మీటర్లు
  • మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

    సాధారణ మారుతి ఎర్టిగా ఎంపీవీతో పోల్చుకుంటే మారుతి సుజుకి ఎక్స్ఎల్ 50ఎమ్ఎమ్ అధిక పొడవు, 40ఎమ్ఎమ్ ఎక్కువ వెడల్పుతో, 10ఎమ్ఎమ్ వరకు ఎక్కువ ఎత్తైనది. కానీ వీల్ బేస్ మరియు టర్నింగ్ రేడియస్ ఒకేలా ఉన్నాయి.

    మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

    సరికొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ప్రీమియం ఎంపీవీలో సాంకేతికంగా 1.5-లీటర్ కెపాసిటీ గల కె15బి సిరీస్ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇటీవల విడుదలైన కొత్త తరం ఎర్టిగా ఎంపీవీలో కూడా ఇదే ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

    డిజైన్, ఫీచర్లు మరియు సేఫ్టీ పరంగా ఎక్స్ఎల్6 ఎంపీవీలో మారుతి సుజుకి ఎన్నో రకాల నూతన అప్‌డేట్స్ తీసుకొచ్చింది. పలు కొత్త అంశాల జోడింపును వివరిస్తూ మారుతి సుజుకి ఇటీవల ఎక్స్ఎల్6 కారుకు సంభందించిన టీజర్ రిలీజ్ చేసింది.

    Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

    నూతన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎన్నో రకాల ఇంటీరియర్ మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి, రెండవ వరుసలో వేర్వేరు సీట్లు (కెప్టెన్ సీట్లు), బ్లాక్ ఫినిషింగ్ గల క్యాబిన్, పలు సిల్వర్ సొబగులు ఎంపీవీకి ఇంటీరియర్‌లో ప్రీమియం ఫీల్ కల్పించాయి.

    Most Read:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో భారీ ఫైన్ కట్టాల్సిందే...ఇవే కొత్త రూల్స్

    మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

    మారుతి సుజుకి తమ ఎక్స్ఎల్6 ప్రీమియం ఎంపీవీ కారును తమ ప్రీమియం షోరూమ్‌ నెక్సా విక్రయ కేంద్రం ద్వారానే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం నెక్సా విక్రయ కేంద్రాల్లో లభించే బాలెనో, ఇగ్నిస్ మరియు ఎస్-క్రాస్ మోడళ్ల సరసన ఎక్స్ఎల్6 లభించనుంది. విడుదలైన వెంటనే డెలివరీలు ప్రారంభించనున్నారు.

    Most Read:వాహనదారులను నిలిపి మరీ రివార్డులను ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు ఎందుకో తెలుసా

    మారుతి కొత్త కారు ఎక్స్ఎల్6 ఇదే.. నమ్మశక్యంగాని షాకింగ్ నిజాలు లీక్

    మారుతి సుజుకి ఎర్టిగా విడుదల చేసి భారతీయులకు ఎంపీవీ సెగ్మెంట్‌ను పరిచయం చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే మారుతున్న వినియోగదారుల అవసరాలు మరియు పోటీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎర్టిగా ఎంపీవీ ఆధారంగా కాస్త విలాసవంతమైన మోడల్ అందించాలనే ప్రయత్నం చేస్తోంది మారుతి. ఈ నిర్ణయంతో మారుతి తీసుకురానున్న ఎక్స్ఎల్6 ప్రీమియం ఎంపీవీ విపణిలో ఉన్న మహీంద్రా మరాజో మరియు టయోటా ఇన్నో క్రిస్టా ఎంపీవీలకు పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki XL6 Dimensions Leaked — Launch Scheduled For 21st Of August. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X