మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

మారుతి సుజుకి వారి కొత్త ప్రీమియమ్ సిక్స్ సీటర్ ఎంపివి అయిన ఎక్స్ఎల్6 ను ఆగస్టు 21 న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ని స్టాండర్డ్ ఎర్టిగ ఎంపివి నమూనాపై ఆధారపడి ఉంటుంది. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6, ఎర్టిగా ప్లాట్ ఫాం మీద ఆధారపడి ఉంటుంది మరియు ఇందులో అదే ఇంజన్ స్పెక్స్ ను కలిగి ఉంటుంది. ఇది 1.5-లీటర్ బిఎస్-6 ప్రామాణిక పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

ఈ ఇంజన్ 104 బిహెచ్పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇందులో ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది. అయితే మరి మారుతి ఎక్స్ఎల్6 మరియు ఎర్టిగా ఎమ్ పివి మధ్య ఉన్న ప్రధానమైన తేడాలు ఇవిగో.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

ఎక్స్ టీరియర్ డిజైన్

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా అనేక ఎక్స్టీరియర్ అప్డేట్స్ తో వస్తుంది. అయితే చాలా అప్డేట్స్ ఈ ఎంపివి ముందు భాగంలో చేసారు. కొత్త ఎక్స్ఎల్6 లో ఒక మందపాటి క్రోమ్ స్ట్రిప్ నడుస్తున్న కొత్తగా రూపొందించిన బ్లాక్ గ్రిల్ ఫీచర్ ఉంటుంది. కొత్త గ్రిల్లో ఇరువైపులా అప్డేట్ చేయబడ్డ హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఉంటుంది.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఇప్పుడు ప్రొజెక్టర్ ల్యాంప్ లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డ్రిల్స్ తో లభ్యం అవుతోంది. రన్నింగ్ లైట్లు ఫ్రంట్ గ్రిల్ యొక్క వెడల్పుకు అడ్డంగా క్రోమ్ స్ట్రిప్ యొక్క పొడిగింపు అయ్యే విధంగా స్టైల్ గా చేయబడ్డాయి. ప్రొజెక్టర్ ల్యాంప్స్ అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్ తో ఇంటిగ్రేటెడ్ క్రోమ్ స్ట్రిప్ గ్రిల్ నుండి వస్తాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

సైడ్ ప్రొఫైల్ ఒకే విధంగా ఉంటుంది, అయితే మారుతి ఎక్స్ఎల్6 కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ ను స్పోర్ట్ రూపంలో ఉంటాయి, అయితే రూఫ్ రెయిల్స్ ఈ కొత్త ఎంపివి యొక్క ప్రీమియం లుక్ ను జోడిస్తాయి. రేర్ ప్రొఫైల్ లో కూడా తక్కువ మార్పులతో వస్తుంది. ఇందులో అప్డేట్ చేసిన ఎల్ఈడి టెయిల్ లైట్స్, వీటితోపాటు కొద్దిగా అప్డేట్ చేసిన బంపర్ కూడా ఉన్నాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

ఇంటీరియర్స్ మరియు ఫీచర్లు

ఇంటీరియర్స్ పరంగా మారుతి ఎక్స్ఎల్6, ఎర్టిగా ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 పూర్తిగా బ్లాక్ అవుట్ క్యాబిన్ తో వస్తుంది. ఇందులో డ్యాష్ బోర్డ్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ మరియు బ్లాక్ లెథెట్ సీట్లు వంటి బ్లాక్ మెటీరియల్స్ ఉంటాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

అయితే, చుట్టూ కొన్ని సిల్వర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఇంటీరియర్స్ కు కాస్త వ్యత్యాసాన్ని జోడిస్తున్నాయి. ఈ ఎక్స్ఎల్6 మారుతి సుజుకి లేటెస్ట్ స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంది, ఇది ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఇతర ఫంక్షనాలటి లను అందిస్తుంది.

Most Read: నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

ఆడియో సిస్టమ్ మరియు కాల్స్ లను కంట్రోల్ చేయడానికి వీటిని స్టీరింగ్ కు అమర్చబడ్డాయి. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో ఊహించని ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి అవి క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఈబిడి, ఇంజన్ ఇంప్రెసెసర్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ డ్ చైల్డ్ సీట్ మౌంట్ లు మరియు మరెన్నో అలాగే ఉన్నాయి.

Most Read: హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

అయితే, రెండు ఎంపివిల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటంటే, రెండో వరస సీట్లు. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 రెండో వరుసలో ఇండివిడ్యువల్ సీట్లు వస్తాయి. ఈ సీట్లు ప్రామాణిక సీట్లు కంటే ఎక్కువ సౌకర్యం అందిస్తున్నాయి.

Most Read: రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

కొలతలు

కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎర్టిగా అదే ప్లాట్ ఫాం మీద ఆధారపడి ఉంది. ఇది స్విఫ్ట్, డిజైర్, ఇగ్నేస్ మరియు బాలెనో వంటి ఇతర మోడళ్లపై కూడా అందుబాటులో ఉంది. అయితే, మారుతి సుజుకి ఇంకా ఎక్స్ఎల్6 స్వల్పంగా దీని కొలతలు పెంచడం జరిగింది, అయినప్పటికీ వీల్ బేస్ మరియు టర్నింగ్ రేడియస్ అలానే ఉన్నాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో 4,445 మి.మీ పొడవు, 1,775 మి.మీ వెడల్పు మరియు 1,700 మి.మీ ఎత్తులో ఉంటుంది. ఇది ఎర్టిగ ఎంపివి కంటే 50 మి.మీ పొడవు, 40మి.మీ వెడల్పు మరియు 10మి.మీ ఎత్తు ఉంటుంది. వీల్ బేస్ మరియు టర్నింగ్ రేడియస్ వరసగా 2,740మి.మీ మరియు 5.2-మీటర్లు వద్ద ఉంటాయి.

మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?

ధర

మారుతి సుజుకి ఎర్టిగా రూ 7.54 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ మొత్తం 11.20 లక్షలకు పైగా ఉంది. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఈ ప్రీమియం ఎక్స్ఎల్6 కాస్త ఎక్కువగానే ధర పలుకుతుందని, స్టాండర్డ్ ఎర్టిగా ఎంపివి కంటే కనీసం సుమారు రూ.1 లక్ష ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Maruti Suzuki XL6 Vs Maruti Suzuki Ertiga: What Are The Differences? - Read in Telugu.
Story first published: Friday, August 9, 2019, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X