మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

మెర్సిడెస్ బెంజ్ తమ ఐకానికి బ్రాండ్ జి-వ్యాగన్‌ మోడల్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త మెర్సిడెస్ బెంజ్ G 350d ధర రూ. 1.5 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా నిర్ణయించారు.

మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే పర్ఫామెన్స్ వెర్షన్ మెర్సిడెస్ ఏఎమ్‌జి జి-63 మోడల్‌ను రూ. 2.19 కోట్ల ధరతో విక్రయిస్తోంది. అయితే ఏఎమ్‌జి వెర్షన్ తొలగించి, జి-క్లాస్ సిరీస్‌లోకి కొత్త పర్ఫామెన్స్ లగ్జరీ ఎస్‌యూవీని 1.5 కోట్ల ధరల శ్రేణిలో తీసుకొచ్చింది.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ (G 350d)లో సాంకేతికంగా 3.0-లీటర్ కెపాసిటీ గల ఆరు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 282బిహెచ్‍పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యుస్ చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్‌ ఎస-క్లాస్ సిరీస్‌లో ఉన్న 350డి మోడల్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంది.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్‌కు 9G-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. ఇంజన్ పవర్ ఉత్పత్తి చేసే పవర్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది. మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ కేవలం 7.4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం 199కిమీలుగా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

మెర్సిడెస్ జి-వ్యాగన్ ఎస్‌యూవీలోని ఫ్రంట్ మరియు రియర్ యాక్సిల్‌లు డిఫరెన్షియల్ లాక్స్ మరియు సెంట్రల్ డిఫరెన్షియల్ ఉన్నాయి. గేర్‌బాక్స్ ఇంజన్ పవర్‌ను పర్మినెంట్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌కు సరఫరా చేస్తుంది. ఆఫ్-రోడింగ్‌లో అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

మెర్సిడెస్ బెంజ్ G 350d గ్రౌండ్ క్లియరెన్స్ 241ఎమ్ఎమ్ మరియు 700ఎమ్ఎమ్ లోతు వరకు నీటిలో వెళ్లగలదు. ఏటా వాలు పల్లపు మరియు మెట్ట మార్గాలను అత్యంత సులభంగా చేధిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

మెర్సిడెస్ జి-వ్యాగన్ ఓవరాల్ డిజైన్ విషయానికి వస్తే, చూడటానికి బాక్స్ ఆకారంలో ఉంటుంది. ఎత్తైన రూపం, విశాలమైన అమెరికన్ ఫ్రంట్ గ్రిల్, గుండ్రటి ఆకారంలో ఉన్న స్టైలిష్ హెడ్ ల్యాంప్స్ మరియు 20-అంగుళాల అళ్లాయ్ వీల్స్ ఎస్‌యూవీకి ఒక ధృడమైన మరియు ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకొచ్చాయి.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

మెర్సిడెస్ జి-వ్యాగన ఇంటీరియర్ ఎన్నో అత్యాధునిక లగ్జరీ ఫీచర్లు స్వాగతం పలుకుతాయి. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 12.3-ఇంచుల భారీ స్క్రీన్, లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే, ఫ్రంట్ పవర్ సీట్లు, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియంట్ లైటింగ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి సంభందించి ఎన్నో ఫీచర్లు వచ్చాయి.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

సేఫ్టీ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ (G 350d)లో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ నుండి కొత్త కారు.. జస్ట్ కోటిన్నర మాత్రమే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెర్సిడెస్ బెంజ్ G 350d మోడల్‌ను ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకొని ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది విపణిలో ఉన్న రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి200 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Mercedes-Benz G 350d Launched In India: Priced At Rs 1.5 Crore. Read in Telugu.
Story first published: Thursday, October 17, 2019, 17:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X