తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

ఎంజీ మోటార్స్ తమ తొలి కారు ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీని జూన్ 27న ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. హెక్టార్ ఎస్‌యూనీని రూ. 12.18 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసిన బ్రిటీష్ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ మోటార్స్ ఈ నెల ప్రారంభంలో హెక్టార్ మీద బుకింగ్స్ ప్రారంభించింది.

తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

జూన్ మొదటి వారంలో బుకింగ్స్ ప్రారంభించగా కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా 10,000 పైగా బుకింగ్స్ నమోదైనట్లు ఎంజీ మోటార్స్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఇటీవల పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దంగా విడుదలైన ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీని జూలై మొదటి వారంలో బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్. ప్రతి వేరియంట్లో కూడా పలు రకాల ఫీచర్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు అందివ్వడం జరిగింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఎన్నో వచ్చాయి. వీటిలో 10.4-అంగుళాల నిలువుటాకారంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది ప్రత్యేకించి ఎంజీ సంస్థ యొక్క కృత్రిమ మేధ కలిగిన 'ఐ-స్మార్ట్' టెక్నాలజీ కలదు, ఈ టెక్నాలజీ 100 రకాల వాయిస్ కమాండ్స్ కలిగి ఉంది.

తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

ఎంజీ హెక్టార్ చూడటానికి లావుగా, ఎత్తైన పరిమాణంలో ఓ పెద్ద ఎస్‌యూవీ తరహాలో రోడ్డు మీద చక్కగా కనబడుతుంది. కండలు తిరిగిన బాడీ, స్పోర్టివ్ అండ్ స్టైలిష్ లుక్‌నిచ్చే పదునైన క్రీస్ లైన్స్ మరియు షోల్డర్ లైన్స్ సైడ్ డిజైన్‌లో చూడవచ్చు. పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్స్ మరియు డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ వచ్చాయి. ఈ సెగ్మెంట్లో ఓ ప్రీమియమ్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా నిలిచింది.

తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

సైడ్ డిజైన్‌లో 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ హైలెట్‌గా నిలిచాయి. రియర్ డిజైన్‌లో ఎల్ఈడీ టెయిల్ లైట్స్ మరియు డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఎర్రటి ఎలిమెంట్లతో కూడా ప్రత్యేక డిజైన్‌లో టెయిల్ లైట్ సిస్టమ్ చూడవచ్చు. ఫ్రంట్ డిజైన్ తరహాలో రియర్ డిజైన్‌కు కూడా పెద్దపీఠ వేసి లగ్జరీ కార్ ఫీలింగ్ కల్పిచింది ఎంజీ మోటార్స్.

తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి 143బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 1.5-లీటర్ టుర్బో-పెట్రోల్ ఇంజన్ కలదు, అత్యుత్తమ మైలేజ్ ఇచ్చేందుకు అదనంగా 48వోల్ట్ హైబ్రిడ్ మోటార్ సిస్టమ్ ఇంజన్‌కు జోడించారు.

తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

అంతే కాకుండా ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీని డీజల్ వెర్షన్‌లో కోరుకునే వారికోసం ఫియట్ క్రిస్లర్ ఆటోమోటివ్స్ నుండి సేకరిస్తున్న 2.0-లీటర్ డీజల్ ఇంజన్ అందివ్వడం జరిగింది. ఇది 173బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు, అయితే పెట్రోల్ మోడల్ అదనంగా 7-స్పీడ్ డీసీటీ ట్రాన్సిమిషన్‌తో లభిస్తోంది.

తొలి నెలలోనే 10 వేల బుకింగ్స్ సాధించిన ఎంజీ హెక్టార్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంజీ మోటార్స్ చైనా సంస్థ సొంతం చేసుకున్న బ్రిటన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ. ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ తొలి ఉత్పత్తిగా ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది. టాటా హ్యారీయర్‌తో పోల్చుకుంటే అత్యంత పోటీతత్వంగా ధరలను నిర్ణయించింది. హ్యారీయర్ ఎస్‌యూవీతో పాటు, జీప్ కంపాస్ మరియు అతి త్వరలో విడుదల కానున్న కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
MG Hector Bookings Cross 10,000 Units In The First Month — Deliveries To Begin From July. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X