భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఇంటర్నెట్ కారు మార్కెట్‌లోకి వచ్చేసింది. ఎంజి మోటార్ ఇండియా తాజాగా తన తొలి కారు ఎంజి హెక్టార్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీనిని అద్భుతమైన కొత్త ఫీచర్స్ తో తయారు చేసారు, అందువలన ఇది భారత మార్కెట్లో మంచి ప్రాముఖ్యతను సంపాదించింది. మరి దీని గురించి మరింత తెలుసుకొందామా..

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

ఎంజి హెక్టర్ దేశంలో చైనీస్-యేతర బ్రిటిష్ బ్రాండ్ నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి మరియు ఇది రూ.12.18 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో అందించబడుతుంది. ఎంజి హెక్టర్ నాలుగు వేరియెంట్ ల శ్రేణిలో లభ్యం అవుతాయి అవి స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్. ఎంజి హెక్టర్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ రూ. 16.88 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఇండియా) ధర వస్తుంది.

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

ఎంజి హెక్టర్ కొరకు బుకింగ్ లు ఇప్పటికే రూ. 50,000 ధరతో ప్రారంభం అయ్యాయి. ఈ కారు ఇప్పటికే షోరూమ్ లకు చేరుకుంది, డెలివరీల కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. భారతీయ మార్కెట్ లో అత్యంత పోటీ మధ్య ఎస్యువి సెగ్మెంట్ లో ఎంజి హెక్టర్ స్థానం కలిగి ఉంది. దీని యొక్క ధరలను ఈ క్రింది పత్రికలో తెలుసుకోండి.

ఎంజి హెక్టర్ ధర

వేరియంట్ స్టైల్ సూపర్ స్మార్ట్ షార్ప్
పెట్రోల్ ఎంటి రూ. 12,18,000

రూ. 12,98,000

-

-

పెట్రోల్ హైబ్రిడ్ ఎంటి -

రూ. 13,58,000

రూ. 14,68,000

రూ. 15,88,000

పెట్రోల్ డిసిటి -

-

రూ. 15,28,000

రూ. 16,78,000

డీజిల్ ఎంటి రూ. 13,18,000

రూ. 14,18,000

రూ. 15,48,000

రూ. 16,88,000

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

డిజైన్ పరంగా కారులో సరండరింగ్ క్రోమ్ యాసెంట్స్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి డీఆర్ఎల్స్‌తో కూడిన స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి.

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

స్టైలిష్ 17-అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, రియర్ ప్రొఫైల్ ఎస్యువి యొక్క మొత్తం స్పోర్టీ థీమ్ ను కలిగి ఉంటుంది, ఇది సెంటర్ వద్ద అనుసంధానమైన పెద్ద ర్యాప్-చుట్టూ ఎల్ఇడి టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. హెక్టర్ ఎస్‌యూవీ ప్రధానంగా పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

పెట్రోల్ వేరియంట్‌లో 1.5 లీటర్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మ్యానువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఇక డీజిల్ వేరియంట్‌లో 2.0 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇక హైబ్రిడ్ ఆప్షన్‌లో 48వీ ఇంజిన్ ఉంటుంది.

Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

ఇందులోని పెట్రోల్ ఇంజన్ 143బిహెచ్పి మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును మరియు డీజల్ 173బిహెచ్పి మరియు 350ఎన్ఎమ్ టార్క్ ను విడుదల చేయును. పెట్రోల్ ఇంజన్ 48వి హైబ్రిడ్ వేరియంట్ తో అందుబాటులో ఉంటుంది, ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇందులో కేవలం మ్యానువల్ గేర్ బాక్స్ మాత్రమే ఉంటుంది.

Most Read: ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

ఇందులో ఉన్న ఇతర ఫీచర్లు హెక్టార్‌లో చెప్పుకోదగ్గ ప్రధాన ఫీచర్ ఐస్మార్ట్ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ. కనెక్టివిటీ సేవలు, మ్యాప్స్, నావిగేషన్ సర్వీసెస్, వాయిస్ అసిస్టెంట్, ప్రిలోడెడ్ ఇన్ఫోటైన్‌మెంటట్ కంటెంట్, ఎమర్జెన్సీ సర్వీస్, బిల్ట్ ఇన్ యాప్స్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.

Most Read: కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

ఎం2ఎం సిమ్ కార్డు ఉంటుంది. దీంతో పై సేవలన్నీ పొందొచ్చు. కంపెనీ అలాగే ఇందులో 10.4 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ కూడా అమర్చింది. హెక్టర్ ఐదు కలర్ శ్రేణిలో లభ్యం అవుతోంది అవి క్యాండీ వైట్, స్టార్రి బ్లాక్, అరోరా సిల్వర్, బర్ఫీ రెడ్ మరియు గ్లేజ్ రెడ్.

భారతదేశంలో లాంచ్ అయిన ఎంజి హెక్టర్... ధర, వివరాలను తెలుసుకోండి!

ఎంజి హెక్టర్ లాంచ్ పై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

ఎంజి హెక్టర్ దేశంలో ప్రారంభించిన తొలి ' ఇంటర్నెట్ కార్ ' అని చెప్పవచ్చు. అత్యంత పోటీని కలిగిన ఎస్యువి సెగ్మెంట్ లో ఇది తన స్థానం పొందింది. జీప్ కంపాస్, టాటా హార్రియర్, మహీంద్రా ఎక్స్యూవి 500 మరియు రాబోయే కియా సెల్టోస్లతో ఎంజి హెక్టర్ పోటీ పడుతోంది.

Most Read Articles

English summary
MG Motor has launched the Hector in the Indian market...Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X