ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

ఎంజీ మోటార్ ఇండియా "ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ"ని ఇటీవల దేశీయ విపణిలోకి ఆవిష్కరించింది. ఎంజీ మోటార్ ఇప్పుడు తమ రెండవ మోడల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ మరియు ముంబాయ్ నగరాల్లో మాత్రమే బుకింగ్స్ ప్రారంభించినట్లు ఎంజీ మోటార్ పేర్కొంది.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా లేదా పైన పేర్కొన్న నగరాల్లోని ఏదైనా ఎంజీ మోటార్ డీలర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ధర రూ. 50,000 చెల్లించి ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

సరికొత్త ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీ హెక్టర్ తర్వాత ఇండియన్ మార్కెట్లో కంపెనీ యొక్క రెండవ మోడల్. ఈ కొత్త మోడల్ జనవరి 2020 నుండి అమ్మకాల్లోకి రానుంది. ఒక్కసారి విడుదలైతే దీని ధర సుమారుగా రూ. 23 లక్షల వరకు ఉండొచ్చు, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి గట్టి పోటీనిస్తుంది.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 44.5kWh లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్ ఉంది, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సింగల్ ఛార్జింగ్‌తో సుమారు 340కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫాస్ట్ ఛార్జర్ మరియు స్టాండర్డ్ (సాధారణ) రెండు రకాల ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 60 నిమిషాల్లోనే బ్యాటరీ 80శాతం ఛార్జ్ అవుతుంది, సాధారణ ఛార్జర్‌తో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌కు సుమారుగా 6 నుండి 8 గంటల సమయం పడుతుంది.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

ఎంజీ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఇచ్చిన ఛార్జింగ్ కేబుల్ ద్వారా 15ఆంపియర్స్ సాకెట్ ఉపయోగించి ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు. AC ఫాస్ట్-ఛార్జర్‌ను కస్టమర్ ఇంట్లో లేదా ఆఫీసులో ఏర్పాటు చేసుకోవచ్చు.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

ఎంజీ మోటార్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని షోరూముల్లో సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు కస్టమర్లకు 24x7 గంటలు అందుబాటులో ఉంటాయి. ఫోర్టం కంపెనీ భాగస్వామ్యంతో ఎంజీ మోటార్ ఇటీవల తమ తొలి 50kW సామర్థ్యం గల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను గురుగ్రామ్‌లో ఏర్పాటు చేసింది.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ కార్లే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, కార్ల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. దిగ్గజ సంస్థలైన టాటా మోటార్స్, ఎంజీ మోటార్ మరియు హ్యుందాయ్ కంపెనీలు ఇప్పటికే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి. మొదట్లో ధర కాస్త ఎక్కువే అనిపించినప్పటికీ పెట్రోల్ మరియు డీజల్ కార్ల తరహాలో ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. దీనికి తోడు కంపెనీలు కూడా 8 ఏళ్ల పాటు వారంటీ మరియు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. 20 నుండి 25 లక్షల మధ్య కారు కొనాలని చూస్తుంటే ఇలాంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఎంచుకోవడం ఎంతో మంచిది.

Most Read Articles

English summary
MG ZS Electric SUV Booking Open For Rs 50,000: Available In Five Cities Across India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X