Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- News
జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన ఎంజీ మోటార్: మైలేజ్, ఫీచర్లు & ధరలు
ఎంజీ మోటార్ ఇండియా విపణిలోకి సరికొత్త జడ్ఎస్ ఇవి (MG ZS EV) ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. సరికొత్త జడ్ఎస్ ఇవి కారు ఎంజీ మోటార్ కంపెనీ ఎంజీ హెక్టార్ తర్వాత ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన రెండవ మోడల్.

ఎంజీ మోటార్ ఆవిష్కరించిన జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2020లో పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నారు, వీటి ధరలు కూడా అప్పుడే వెల్లడించనున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంజీ తమ జడ్ఎస్ ఇవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పూర్తి వివరాలతో సహా రివీల్ చేశారు.

ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం రూపొందించిన ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 44.5kWh సామర్థ్యం గల బ్యాటరీ సిస్టమ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనిని ఇజడ్ఎస్ (eZS) అనే పేరుతో విక్రయిస్తున్నారు.

ఎంజీ జడ్ఎస్ ఒక కంప్లీట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఫ్రంట్ వీల్స్‌కు పవర్ అందుతుంది. ఎంజీ జడ్ఎస్ ఇవి (MG ZS EV) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 340కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా గంటలోపే 0-80 శాతం ఛార్జ్ అవుతుంది. సాధారణ ఛార్జర్ ద్వారా కూడా ఛార్జింగ్ చేయొచ్చు.

డిజైన్ విషయానికి వస్తే, ఎంజీ జడ్ఎస్ ఇవి ఒక ఎస్‌యూవీ, బాడీ మొత్తాన్ని ధృడంగా నిర్మించారు. ఫ్రంట్ డిజైన్‌లో ఎంజీ సిగ్నేచర్ గ్రిల్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ కోసం గ్రిల్ మధ్యలో ఉన్న చిన్న భాగాన్ని అందించారు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సాధారణ పెట్రోల్ మరియు డీజల్ ఎస్‌యూవీలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంటీరియర్‌లో ఖరీదైన ప్రీమియం ఫీల్ కల్పించే ఫీచర్లు మరియు మెటీరియల్స్ ఉన్నాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఇంటీరియర్‌లో 8.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది ఎంజీ కంపెనీకి చెందిన ఐ-స్మార్ట్ 2.0 కనెక్టెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, న్యావిగేషన్, రివర్స్/పార్కింగ్ కెమెరా ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి.

ఎంజీ జడ్ఎస్ ఇవిలోని ఇతర కీలకమైన ఫీచర్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీట్ ఇంకా ఎన్నో ఉన్నాయి. లగ్జరీ కార్ల తరహాలో దీని ఇంటీరియర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఎంజీ మోటార్ ఇండియా ఫోర్టమ్ కంపెనీ భాగస్వామ్యంలో ఈ ఏడాది నవంబరులో భారతదేశపు తొలి 50Kw సామర్థ్యం ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. తొలి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను గురుగ్రామ్‌లో ఏర్పాటు చేశారు, దక్షిణ మరియు పశ్చిమ ఢిల్లీతో పాటు నోయిడాలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

బెంగళూరు, హైదరాబాద్ మరియు ముంబాయ్‌తో పాటు మొత్తం ఆరు నగరాల్లోని ఎంజీ మోటార్ షోరూముల వద్ద ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో అన్ని రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఎంజీ మోటార్ ఈ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జనవరి 2020లో పూర్తి స్థాయిలో మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యింది. తొలి నెలలోనే 3,000 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎంజీ మోటార్ ఇండియన్ మార్కెట్ మీద భారీ అంచనాలు పెట్టుకుంది. ఆటోమొబైల్ మార్కెట్ నెమ్మదిస్తున్న తరణంలో ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. దీని ధర సుమారుగా రూ. 22 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు. హ్యుందాయ్ విడుదల చేసిన కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఇది గట్టి పోటీనిస్తుంది.