ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి మోటార్ ఇండియా నుండి ఇప్పటికే ఒక మోడల్ విడుదలైంది. ఇప్పుడు ఎంజి తన రెండవ ఉత్పత్తి అయిన జెడ్ఎస్ ఇవి - ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. కొత్త ఎంజి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్ 2020 జనవరిలో భారత మార్కెట్లో అమ్మకానికి రావడానికి సంసిద్ధంగా ఉంది. భారతదేశంలో ప్రారంభించిన ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి ఎక్సైట్ మరియు రెండు ఎక్స్‌క్లూజివ్. జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ యొక్క రెండు వేరియంట్లు అనేక లక్షణాలతో రాబోతున్నాయని భావిస్తున్నారు.

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి మోటార్స్ రెండు వేరియంట్లలో లభించినప్పటికీ రెండింటిలోనూ 44.5 కిలోవాట్ల లిథియం ఆయన బ్యాటరీనే కలిగి ఉంటుంది. ఇది మూడు దశల శాశ్వత ఎలక్ట్రిక్ మోటరుతో జతచేయబడి ఉంటుంది. బ్యాటరీతో ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 141 బిహెచ్‌పి మరియు 353 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆటోమేటివ్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి మోటార్ వాహనాలలో ఉన్న బ్యాటరీలు వినియోగదారుడికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఒకసారి ఛార్జింగ్ వేసి దాదాపుగా 340 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇప్పుడు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అనుసరిస్తున్నాయి.

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి జెడ్ఎస్ వాహనాలు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అనుసరిస్తూ వేగంగా ఛార్జ్ చేసుకుంటాయి. కేవలం 60 నిముషాల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ చేసుకుంటాయి. ఇంత తక్కువ టైములో ఎక్కువ ఛార్జింగ్ వేసుకునే సదుపాయం వల్ల వినియోగదారునికి సులభంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ ని టెస్ట్ డ్రైవ్ చేసారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం అల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో అందరిని ఆకట్టుకుంది అని తెలియజేసారు.

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

భారతీయ మార్కెట్ కోసం ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ ఎస్‌యూవీలో అందించే వేరియంట్ల వారీగా ఉన్న లక్షణాల జాబితా ఇక్కడ గమనించాలి.

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి జెడ్ఎస్ ఇవి ఎక్సైట్:

1) 17-అంగుళాల అల్లాయ్

2) ఎల్ఇడి డిఆర్ఎల్ లతో ఆటోమాటిక్ హెడ్ లాంప్స్

3) బ్రీతబుల్ గ్లో లోగో

4) ఎలెక్ట్రికల్లీ అడ్జస్ట్బుల్ & ఫోల్డబుల్ ఓఆర్విఎమ్

5) ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో ఓఆర్విఎమ్

6) తోలుతో చుట్టబడిన స్టీరింగ్ వీల్

7) స్టార్ట్ / స్టాప్ పుష్-బటన్

8) అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో 3.5 అంగుళాల ఎమ్ఐడి

9) 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు

10) కెఇఆర్ఎస్(కైనెటిక్ ఎనర్జీ రికవరీ సిస్టమ్)

11) 6 ఎయిర్‌బ్యాగులు

12) హిల్-స్టార్ట్ అసిస్ట్

13) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్

14) ISOFIX చైల్డ్ సీట్ మౌంట్

15) ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి జెడ్ఎస్ ఇవి ఎక్స్‌క్లూజివ్:

ఎక్సైట్‌లోని లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను ఎక్స్‌క్లూజివ్ కలిగి ఉంది. అవి ఏమిటంటే

1) 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

2) పనోరమిక్ సన్‌రూఫ్

3) 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్

4) ఐ-స్మార్ట్ 2.0 కనెక్ట్ టెక్నాలజీ

5) హీటెడ్ ఓఆర్విఎమ్

6) పిఎమ్ 2.5 ఫిల్టర్‌తో ఎయిర్ ప్యూరిఫైయర్

పైన తెలిపిన లక్షణాలు ఎక్సైట్ లో కంటే అదనంగా ఉంటాయి.

Read More:2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి జెడ్‌ఎస్ ఇవి ధరలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఎంజి బ్రాండ్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ల కోసం బుక్ చేసుకునే వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ బుకింగ్ ధర 50,000 రూపాయలతో స్వీకరించడం ప్రారంభించింది.

Read More:ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

ఎంజి మోటార్స్ భారతదేశంలో ఒకసారి లాంచ్ అయిన తర్వాత ఐదు నగరాల్లో మాత్రమే లభిస్తాయి. ఆ నగరాలు హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ మరియు ముంబై మాత్రమే. ఎంజి ఎలక్ట్రిక్ వాహనాలు ఒకసారి మార్కెట్లో విడుదలైనతర్వాత హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్ కి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

Most Read Articles

English summary
MG ZS EV Variants In Detail: Which Is The Best Model To Buy- Read in Telugu
Story first published: Friday, December 27, 2019, 11:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X