మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

అత్యంత విలాసవంతమైన లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కార్ల తయారీ కంపెనీ మినీ (Mini) సరికొత్త కంట్రీమ్యాన్ బ్లాక్ ఎడిషన్ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. మినీ కంట్రీమ్యాన్ బ్లాక్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 42.40 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. కూపర్ ఎస్ జెసీడబ్ల్యూ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్ కంట్రీమ్యాన్ కారును తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా కేవలం 24 బ్లాక్ ఎడిషన్ కంట్రీమ్యాన్ కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

సాధారణ వెర్షన్ మినీ కంట్రీమ్యాన్ కారుతో పోల్చుకుంటే లిమిటెడ్ బ్లాక్ ఎడిషన్ కంట్రీమ్యాన్ ధర 1 లక్ష రూపాయల వరకు ఎక్కువగా ఉంది. బ్లాక్ ఫినిషింగ్ గల ఫ్రంట్ గ్రిల్, కార్బన్ ఫైబర్ ఎక్ట్సీరిర్ సైడ్ మిర్రర్ క్యాప్స్, పియానో బ్లాక్ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ ట్రిమ్స్ అదే విధంగా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

కంట్రీమ్యాన్ బ్లాక్ ఎడిషన్ ఎక్ట్సీరియర్‌లో జరిగిన మార్పులు విషయానికి వస్తే, పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న "కంట్రీమ్యాన్" పేరు, బ్లాక్ ఫినిషింగ్ గల రూఫ్ రెయిల్స్, బ్లాక్ కలర్ బానెట్ స్ట్రిప్స్, ఫ్లాట్ టైర్లు ఉన్న 18-అంగుళాల జెసీడబ్ల్యూ అల్లాయ్ వీల్స్ వచ్చాయి, మరియు జెసీడబ్ల్యూ ఏరోడైనమిక్ ప్యాకేజీ ఇందులో అదనం.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

లిమిటెడ్ ఎడిషన్ కంట్రీమ్యాన్ బ్లాక్ కార్ ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్యానరమిక్ గ్లాస్ రూఫ్, జెసీడబ్ల్యూ స్పోర్ట్ స్టీరింగ్ వీల్, జెసీడబ్ల్యూ డోర్ ఎంట్రీ స్ట్రిప్స్, స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్ కవర్లు, మినీ హెడ్-అప్ డిస్ల్పే, కాంతిని వెదజల్లే పియానో బ్లాక్ పట్టీలు, కార్బన్ బ్లాక్ ఫినిషింగ్ గల డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ స్పోర్ట్ సీట్లు, మరియు హార్మన్ కార్డన్ కంపెనీకి చెందిన ఆడియో సిస్టమ్ వచ్చాయి.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

మినీ కంట్రీమ్యాన్ లిమిటెడ్ ఎడిషన్ కాకుండా.. స్టాండర్డ్ వెర్షన్‌లో తప్పనిసరిగా వచ్చే ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, న్యావిగేషన్ సపోర్ట్ గల 8.8-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెమొరీ ఫంక్షన్ గల ఫ్రంట్ ఎలక్ట్రిక్ పవర్ సీట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్ ఇంకా ఎన్నో ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ కాస్మొటిక్ మార్పులు మరియు పలు అదనపు ఫీచర్లను మినహాయిస్తే సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మినీ కంట్రీమ్యాన్‌లో ఉన్న 2.0-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 189బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ స్పోర్ట్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వచ్చింది. కేవలం 7.5-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిమీల వేగాన్ని అందుకుంటుంది.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

సేఫ్టీ విషయానికి వస్తే, లిమిటెడ్ ఎడిషన్ కంట్రీమ్యాన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, పార్కింగ్ సెన్సార్లు గల రియర్ కెమెరా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

జాన్ కూపర్ వర్క్స్ (JCW) గురించి...

జాన్ కూపర్ వర్క్స్ (JCW) ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ రేసింగ్ కార్ల తయారీ మరియు ఇంజన్ ట్యూనింగ్ సంస్థ. దీనిని 2002లో మైఖేల్ కూపర్ మరియు ఆయన కుమారుడు జాన్ కూపర్ స్థాపించారు. జాన్ కూపర్ రూపొందించిన రియర్ ఇంజన్ ఛాసిస్ డిజైన్ ఫార్ములా వన్ మరియు ఇండియన్‌పోలిస్ 500 తో పాటు వివిధ రకాల మోటార్ స్పోర్ట్స్ దశను మార్చేసింది. జాన్ కూపర్ వర్క్స్ కంపెనీని ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ సొంతమైంది. మినీ కంపెనీ ఉత్పత్తి చేసే కార్ల కోసం ట్యూనింగ్ పార్ట్స్ మరియు పలు రకాల యాక్ససరీలను ప్రత్యేకంగా తయారు చేస్తోంది.

మినీ కంట్రీమ్యాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 42.40 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆల్-బ్లాక్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌తో వచ్చిన సరికొత్త మినీ కంట్రీమ్యాన్ బ్లాక్ ఎడిషన్ కారును పరిమిత సంఖ్యలో లభ్యమవుతోంది. పండుగ సీజన్లో సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ కారును ప్రవేశపెట్టింది. అరుదైన కార్లను సేకరించే కస్టమర్లకు ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. జాన్ కూపర్ వర్క్స్ తీసుకొచ్చిన బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీ రెగ్యులర్ వెర్షన్ కంటే మరింత ఆకర్షణీయంగా ఉంది.

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
MINI Countryman Black Edition Launched In India: Prices Start At Rs 42.40 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X