Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??
మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్య నివారణలో భాగంగా, దేశ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలం వరకు మహారాష్ట్రలోని ఆరు జిల్లాలలో డీజిల్ నిలిపివేయనున్నట్టు శుక్రవారం తెలియచేసారు.

"నేను ఆరు జిల్లాలు-నాగపూర్, భండారా, గోండియా, చంద్రాపూర్, గడ్చిరోలి మరియు వార్ధా లో డీజిల్ లేని ప్రాంతాలుగా చేయాలనే ఒక కార్యక్రమం చేపట్టాను. ఐదేళ్లపాటు ఈ జిల్లాల్లో ఒక చుక్క డీజిల్ కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నాను.

ఇది కష్టమైన పని, కానీ ట్రక్కులు, బస్సుల కోసం బయో సీఎన్జీ తయారు చేసే ఆరు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం 50 బస్సులు సీఎన్జీ ఆదారంగా నడుస్తున్నాయి.

సేంద్రియ వ్యవసాయంతోనే భవిషత్ ఉంటుంది" అని సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో గడ్కారీ అన్నారు.

మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ తో పాటు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలు గడ్కారీ పరిధిలో ఉన్నాయి, కావున ప్రత్యామ్నాయ నిధులు సద్వినియోగం చేసుకోవాలని అయన అన్నారు.

బ్యాంకులను దాటి ఫైనాన్సింగ్ కోసం ప్రత్యామ్నాయ వనరుల కోసం మేము ఎదురు చూడాలి" గడ్కారీ చెప్పారు. గత ఐదేళ్లలో రవాణా రంగంలో సుమారు రూ .17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు.

నాగపూర్, భండారా, గోండియా, చంద్రాపూర్, గడ్చిరోలి, వార్ధా జిల్లాలను డీజిల్ రహిత ప్రాంతాలుగా చేస్తారు అని, ఎమ్ఎస్ఎమ్ఇ సెక్టార్ దేశం పురోగతి కొరకు గొప్ప సామర్ధ్యం కలిగి ఉంది.
Most Read: ట్యూబ్‌లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !

ఈ దిశలో ప్రైవేటు రంగానికి మద్దతు కోరింది, పరిశ్రమ యొక్క సూచనల ప్రకారంగా మేం కొన్ని మెరుగుదలలు తీసుకొస్తున్నాం మరియు మరిన్ని సిఫారసులు చేయాలని కోరుతున్నాం

వీటిపై కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని, పరిశ్రమపై విశ్వాసం, నమ్మకం ఉందన్నారు.
Most Read: జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!

ప్రభుత్వం పెట్టుబడిదారులు కూడా స్నేహపూర్వకంగా ఉంది మరియు ఉపాధి, వృద్ధి, మరియు ఎగుమతులకు పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది "అని అయన అన్నారు.

దీని గురించి గడ్కారీ మీడియాతో మాట్లాడుతూ ఏ పరిశ్రమను మూసేయాలో కేంద్రం యోచిస్తోందని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మార్పులు తప్పనిసరిగా చేయాలన్నారు.
Most Read: సాహో లో ప్రభాస్ సవారీ చేసిన బైక్ ఏదో తెలుసా....!

ఎలక్ట్రిక్ మొబిలిటీ విషయం గురించి అడిగినప్పుడు, "మేము ఏ పరిశ్రమను నిషేధించాలని అనుకోవడం లేదు, కాకాపోతే వారు సహాయం చేయాలని కోరుతున్నాం.

మేము మా అన్ని పధకాలలో ప్రైవేట్ రంగాన్ని చేర్చాలని కోరుకుంటున్నాము తద్వారా అభివృద్ధి రేటు మరియు ఆ అభివృద్ధిలో ఉపాధి సామర్ధ్యం పెరుగుతుంది అని చెప్పారు.
Source: Auto.ndtv