5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

మిత్సుబిషి మోటార్స్ 2018 జూన్ నెలలో సరికొత్త ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది కాలం పాటు ఔట్‌ల్యాండర్ సేల్స్ నిరాశపరచడంతో ఈ మోడల్ మీద కంపెనీ ఏకంగా రూ. 5 లక్షల రూపాయల ధర తగ్గించింది. 32 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైన మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ఇప్పుడు రూ. 27 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీని కంప్లిట్లీ బిల్ట్ యూనిట్ (CBU) పద్దతి ద్వారా ఇండియన్ మార్కెట్లోకి దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. మరియు మిత్సుబిషి కేవలం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. కంపెనీ ప్రకటించిన రూ. 5 లక్షల ధర తగ్గింపు మినహాయిస్తే డీలర్ ఎలాంటి డిస్కౌంట్లు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందివ్వలేదు.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లేటెస్ట్ జనరేషన్ మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ప్రీమియం డిజైన్ శైలిలో వచ్చింది. 2013లో వచ్చిన పాత ఔట్‌ల్యాండర్‌తో పోల్చుకుంటే ఇందులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి మరియు 7-మంది వరకు ప్రయాణించే సీటింగ్ సామర్థ్యం గల ఫుల్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది - బ్లాక్ పర్ల్, కాస్మిక్ బ్లూ, ఓరియంట్ రెడ్, వైట్ సాలిడ్, వైట్ పర్ల్ మరియు టైటానియం గ్రే. ఎక్ట్సీరియర్‌ డిజైన్‌లో విశాలమైన క్రోమ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు మరియు 16-ఇంచుల మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ఇంటీరియర్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. 7-సీటింగ్ సామర్థ్యం గల క్యాబిన్‌లోపల బ్లాక్ మరియు బీజి కలర్ స్కీమ్ గల లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు సన్‌రూఫ్ ఉన్నాయి.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ఇంటీరియర్‌లో 7-ఇంచుల అత్యాధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 710వాట్ సామర్థ్యం గల రాక్‌ఫోర్డ్ ఫాస్గేట్ కంపెనీకి చెందిన 4-స్పీకర్ ఆడియో సిస్టమ్. ఇతర ఫీచర్లయిన కీ లెస్ ఎంట్రీ, ఆటో హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి. ఏడు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఇబిడి మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

సాంకేతికంగా మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ప్రీమియం ఫుల్ సైజ్ ఎస్‌యూవీలో 2.4-లీటర్ కెపాసిటీ గల MIVEC పెట్రోల్ ఇంజన్ 165బిహెచ్‌పి పవర్ మరియు 222ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ కాంస్టెంట్ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ మరియు మల్టీ సెలెక్ట్ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 250 నుండి 300 యూనిట్ల ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీలను విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విపణిలో ఉన్న స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు హోండా సీఆర్-వి మోడళ్లతో పోటీ పడుతోంది.

5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఒకప్పుడు ఇండియన్ రోడ్ల మీద తిరిగే కార్లలో మిత్సుబిషి కార్ల హవా బాగా నడిచింది. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో మళ్లీ పుంజుకోవాలని మిత్సుబిషి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఖరీదైన ఎస్‌యూవీలు మాత్రమే మార్కెట్లో ఉండటంతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. కంపెనీ తమ ఔట్‌ల్యాండర్ మీద ఏకంగా రూ. 5 లక్షలు ధర తగ్గించడంతో కస్టమర్లు ఖచ్చితంగా మళ్లీ మిత్సుబిషి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mitsubishi Offers Rs 5 Lakh Price Cut On Current-Generation Outlander SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X