సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్

సుజుకి మోటార్ ఇండియా తమ డి-మ్యాక్స్ వి-క్రాస్ 2020 వెర్షన్ పికప్-ట్రక్కును వచ్చే ఏడాది ఢిల్లీ వేదికగా జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో అధికారికంగా ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చితే 2020 మోడల్ చాలా కొత్తగా ఉంది, ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క దేశంలో దశలవారీగా ప్రవేశపెడుతూ వస్తోంది.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

ఇసుజు 2020 వెర్షన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఎస్‌యూవీని నవంబరులో జరిగిన 2019 థాయ్‌ మోటార్ ఎక్స్‌పోలో అధికారికంగా తొలిసారి ఆవిష్కరించింది. ఇప్పుడు తాజాగా థాయ్‌లాండ్ ప్రజా సందర్శన కోసం పలు షోరూముల్లో ప్రదర్శిస్తోంది.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

ఇసుజు 2020 డి-మ్యాక్స్ ఎస్‌యూవీని "ఇన్ఫినిట్ పొటెన్షియల్" థీమ్‌లో ప్రవేశపెట్టింది. ఈ థీమ్ లేటెస్ట్ వెర్షన్ డి-మ్యాక్స్ వి-క్రాస్ ఎస్‌యూవీకి కండలు తిరిగిన ధృడమైన రూపాన్నిచ్చింది. చూడటానికి అగ్రెసివ్‌గా మరియు ఖరీదైన ఎస్‌యూవీ అనే ఫీల్‌నిస్తుంది.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు మరియు ప్రొజెక్టర్ ల్యాంప్స్ జోడింపుతో అత్యాధునిక ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ వచ్చింది. ఫాగ్ ల్యాంప్స్ మరియు స్కిడ్ ప్లేట్లతో సరికొత్త ఫ్రంట్ బంపర్ అందించారు. ఎస్‌యూవీ రూపాన్ని పూర్తిగా మార్చేశారు.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

ఇసుజు వి-క్రాస్ టాప్ ఎండ్ వేరియంట్లో విశాలమైన ఫెండర్స్, డోర్ హ్యాండిల్స్, బయటివైపున్న మిర్రర్లు మరియు రూఫ్ రెయిల్స్‌ను గ్రే కలర్‌ ఫినిషింగ్‌లో అందించారు. టెయిల్ ల్యాంప్ సెక్షన్‌లో చతురస్రాకారంలో ఉన్న ఎల్ఈడీ లైట్ ఎలిమెంట్లు, రీడిజైన్ చేసిన టెయిల్‌గేట్, 18-అంగుళాల భారీ, ధృడమైన అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సపోర్ట్ చేసే 9-ఇంచులు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్రయాంగిల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అందనంగా 4.2-ఇంచుల డిజిటల్ డిస్ల్పే వచ్చింది. ఇంటీరియర్ లోపలి అప్‌హోల్‌స్ట్రే మొత్తాన్ని బ్రౌన్ కలర్‌లో ఫినిషింగ్ చేశారు.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

సేఫ్టీ పరంగా 2020 ఇసుజు వి-క్రాస్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, స్టెబిలిటీ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, వాక్-అవే ఆటోమేటిక్ లాకింగ్, వెల్‌కం మరియు ఫాలో-మి-హోమ్ లైటింగ్ మరియు వాయిస్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

సాంకేతికంగా 2020 డి-మ్యాక్స్ ఎస్‌యూవీ సరికొత్త 3.0-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు, ఇది 188బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చిన్న ఇంజన్ కోరుకునే వారి కోసం 1.9-లీటర్ డీజల్ వేరియంట్ కూడా ఉంది, ఇది 148బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త థీమ్‌లో 2020 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఆఫ్-రోడర్!

ఇసుజు మోటార్ ఇండియా, ఈ 2020 డి-మ్యాక్స్ విక్రాస్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది తొలి సగంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇసుజు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ఈ పికప్ ట్రక్ బిఎస్-4 ప్రొడక్షన్ 2019 చివరికల్లా ఆపేస్తున్నారు, ఆ తర్వాత బిఎస్-6 ప్రారంభమవుతుని తెలిపారు.

Source: IndianAutosBlog

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
new gen isuzu d max v cross pick p truck unveild in 2019 thai motor expo-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X