ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల

రెండవ తరం రేంజ్ రోవర్ ఎవోక్ 2018 నవంబర్ లో ప్రపంచ విపణిలో రంగప్రవేశం చేసింది. భారతదేశంలో 2020 ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు డీలర్ వర్గాలు ఐఎబి కి తెలియజేశాయి.

ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల

రేంజ్ రోవర్ ఎవోక్ మొదటి మోడల్ యొక్క పూర్తి మార్పు రేంజ్ రోవర్ వెలార్-ప్రేరేపణ వల్ల జరిగింది. ఇందులోని స్లిమ్మర్ మ్యాట్రిక్స్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌ లు వాడకంతో పాటు మెయిన్ ఫ్రంట్ గ్రిల్ అత్యంత అధునాతన రూపానికి దోహదం చేస్తుంది. కాపర్-రంగు వివరాలతో కూడిన ఫ్రంట్ బంపర్ బ్లేడ్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లిమ్మర్ రియర్ కాంబినేషన్ లాంప్స్ దాని ప్రీమియం ఉనికిని మరింత గా మెరుగు పరుస్తాయి.

ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల

లోపలి భాగం మరియు క్యాబిన్‌కు గల మార్పులు మరింత ప్రముఖంగా ఉండటం ఇందులో మీరు గమనించవచ్చు. ఇది దాని ప్రీమియం కజిన్ అడుగుజాడలను అనుసరిస్తూ ఇంటీరియర్ స్టైలింగ్‌ ని కూడా ప్రతిబింబిస్తుంది.

ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల

ఇది స్పష్టమైన మినిమలిస్ట్ మరియు డిజిటల్ క్యాబిన్‌లను కలిగిఉంటుంది. ఇందులో స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ మరియు ఫ్లోర్ కన్సోల్ వంటి అన్ని భాగాలు కనిపిస్తాయి.

ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల

రేంజ్ రోవర్ ఎవోక్ యొక్క ఆఫ్-రోడ్ సామర్థ్యాలు కూడా బాగ మెరుగుపరచబడ్డాయి. దీని వాటర్ వాడింగ్ డెప్త్ 100 మిమీ నుండి 600 మిమీ వరకు పెరిగింది. ఇవేకాకుండా టెర్రైన్ రెస్పాన్స్ 2 మరియు క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూనుకలిగి ఉండటం అనేది డ్రైవర్లకు ఒక వరంగా చెప్పవచ్చు. క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ ఫంక్షన్ ఫ్రంట్ బంపర్ యొక్క దిగువ భాగంలో 180-డిగ్రీల కెమెరా ఉంటుంది. అందువల్ల కఠినమైన భూభాగంలో ట్రిక్కీ సమయాల్లో ఖచ్చితమైన స్టీరింగ్ ఇన్‌పుట్‌ల కోసం దీనిని ఉపయోగించవచ్చు.

ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల

ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ - ఇంజిన్ వేరియంట్స్:

D150 MT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (150 PS / 380 Nm), 6-స్పీడ్ MT, FWD

D150 AT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (150 PS / 380 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ AT, AWD

D180 AT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (180 PS / 430 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ AT, AWD

D240 AT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (240 PS / 500 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ, 9-స్పీడ్ AT, AWD

P200 AT - 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (200 PS / 320 Nm), 48Vమైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ, 9-స్పీడ్ AT, AWD

P250 AT - 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (249 PS / 365 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ AT, AWD

P300 AT - 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (300 PS / 400 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ, 9-స్పీడ్ AT, AWD

Read More:టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల

భారతదేశంలో D180 మరియు P250 ఇంజిన్ వేరియంట్లు లాంచ్ సమయంలో అందించబడతాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ అభివృద్ధిలో ఉంది, కానీ దీనిని మా మార్కెట్లో అందించే అవకాశం లేదు.

Most Read Articles

English summary
Exclusive: All-new Range Rover Evoque to be launched in India in February 2020- Read in Telugu
Story first published: Saturday, December 14, 2019, 13:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X