Just In
- 10 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 13 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 16 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల
రెండవ తరం రేంజ్ రోవర్ ఎవోక్ 2018 నవంబర్ లో ప్రపంచ విపణిలో రంగప్రవేశం చేసింది. భారతదేశంలో 2020 ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు డీలర్ వర్గాలు ఐఎబి కి తెలియజేశాయి.
రేంజ్ రోవర్ ఎవోక్ మొదటి మోడల్ యొక్క పూర్తి మార్పు రేంజ్ రోవర్ వెలార్-ప్రేరేపణ వల్ల జరిగింది. ఇందులోని స్లిమ్మర్ మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ లు వాడకంతో పాటు మెయిన్ ఫ్రంట్ గ్రిల్ అత్యంత అధునాతన రూపానికి దోహదం చేస్తుంది. కాపర్-రంగు వివరాలతో కూడిన ఫ్రంట్ బంపర్ బ్లేడ్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లిమ్మర్ రియర్ కాంబినేషన్ లాంప్స్ దాని ప్రీమియం ఉనికిని మరింత గా మెరుగు పరుస్తాయి.
లోపలి భాగం మరియు క్యాబిన్‌కు గల మార్పులు మరింత ప్రముఖంగా ఉండటం ఇందులో మీరు గమనించవచ్చు. ఇది దాని ప్రీమియం కజిన్ అడుగుజాడలను అనుసరిస్తూ ఇంటీరియర్ స్టైలింగ్ ని కూడా ప్రతిబింబిస్తుంది.
ఇది స్పష్టమైన మినిమలిస్ట్ మరియు డిజిటల్ క్యాబిన్లను కలిగిఉంటుంది. ఇందులో స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ మరియు ఫ్లోర్ కన్సోల్ వంటి అన్ని భాగాలు కనిపిస్తాయి.
రేంజ్ రోవర్ ఎవోక్ యొక్క ఆఫ్-రోడ్ సామర్థ్యాలు కూడా బాగ మెరుగుపరచబడ్డాయి. దీని వాటర్ వాడింగ్ డెప్త్ 100 మిమీ నుండి 600 మిమీ వరకు పెరిగింది. ఇవేకాకుండా టెర్రైన్ రెస్పాన్స్ 2 మరియు క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూనుకలిగి ఉండటం అనేది డ్రైవర్లకు ఒక వరంగా చెప్పవచ్చు. క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ ఫంక్షన్ ఫ్రంట్ బంపర్ యొక్క దిగువ భాగంలో 180-డిగ్రీల కెమెరా ఉంటుంది. అందువల్ల కఠినమైన భూభాగంలో ట్రిక్కీ సమయాల్లో ఖచ్చితమైన స్టీరింగ్ ఇన్పుట్ల కోసం దీనిని ఉపయోగించవచ్చు.
ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ - ఇంజిన్ వేరియంట్స్:
D150 MT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (150 PS / 380 Nm), 6-స్పీడ్ MT, FWD
D150 AT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (150 PS / 380 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ AT, AWD
D180 AT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (180 PS / 430 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ AT, AWD
D240 AT - 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (240 PS / 500 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ, 9-స్పీడ్ AT, AWD
P200 AT - 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (200 PS / 320 Nm), 48Vమైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ, 9-స్పీడ్ AT, AWD
P250 AT - 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (249 PS / 365 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ AT, AWD
P300 AT - 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (300 PS / 400 Nm), 48V మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ, 9-స్పీడ్ AT, AWD
Read More:టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!
భారతదేశంలో D180 మరియు P250 ఇంజిన్ వేరియంట్లు లాంచ్ సమయంలో అందించబడతాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్ట్రైన్ అభివృద్ధిలో ఉంది, కానీ దీనిని మా మార్కెట్లో అందించే అవకాశం లేదు.