విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

టాటాకు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ఇండియా సరికొత్త ఎక్స్ఇ ఫేస్‌లిఫ్ట్ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. జాగ్వార్ ఎక్స్ఇ ఫేస్‌లిఫ్ట్ లగ్జరీ సెడాన్ కారు ప్రారంభ ధర రూ. 44.98 లక్షలు, ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

జాగ్వార్ ఎక్స్ఇ ఫేస్‌లిఫ్ట్ కారు రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఎస్ (S) మరియు ఎస్ఇ (SE). వీటిని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.

వేరియంట్లు పెట్రోల్ డీజల్
Jaguar XE S Rs 44.98 Lakhs Rs 44.98 Lakhs
Jaguar XE SE Rs 46.32 Lakhs Rs 46.32 Lakhs
విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

జాగ్వార్ ఎక్స్ఇ ఇది వరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే, పలు రకాల అప్‌డేట్స్ నిర్వహించి 2020 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా మళ్లీ తీసుకొచ్చారు. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఎన్నో రకాల మార్పులతో పాటు మరెన్నో నూతన ఫీచర్లను అందివ్వడం జరిగింది.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

డిజైన్‌తో మొదలుపెడితే, సరికొత్త జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే వెడల్పు కాస్త పెరిగింది మరియు ఎత్తు తగ్గింది. ప్రత్యేకించి ఫ్రంట్ డిజైన్‌లో విశాలమైన ఫ్రంట్ గ్రిల్, J-ఆకారంలో ఉన్నటువంటి డే టైమ్ రన్నింగ్ లైట్ల జోడింపుతో కూడిన సన్నటి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి, బంపర్‌లో కూడా ఇంజన్‌కు వీలైనంత ఎక్కువ గాలిని అందించేందుకు పెద్ద ఎయిర్ ఇంటేకర్ కలదు.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ సైడ్ మరియు రియర్ డిజైన్ విషయానికి వస్తే రీ-డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ మరియు పదునైన డిజైన్‌లో వచ్చిన ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చిన మార్పులు చేర్పులు జాగ్వార్ ఎస్ఇ కారుకు స్పోర్టివ్ మరియు అగ్రెసివ్ లుక్ తీసుకొచ్చాయి.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

జాగ్వార్ ఎక్స్ఇ ఇంటీరియర్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సెంటర్ కన్సోల్ మీద డ్యూయల్-టచ్‌స్క్రీన్ డిస్ల్పే సిస్టమ్ ఉంది, ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం కాగా మరొకటి క్లైమేట్ కంట్రోల్ కోసం. 10.2-అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లతో న్యావిగేషన్ ఇంకా ఎన్నో కనెక్టెడ్ ఫీచర్లను కలిగి ఉంది.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

జాగ్వార్ ఫే-పేస్ మరియు ఇ-పేస్ ఎస్‌యూవీలలో ఉన్నటువంటి పిస్టర్-గ్రిప్ గేర్-షిఫ్టర్‌ను ఎక్స్ఇ సెడాన్‌లో కూడా అందించారు. లెథర్ అప్‌హోల్‌స్ట్రే, వైర్-లెస్ ఛార్జింగ్, స్టీరింగ్-ఆధారిత సాఫ్ట్-టచ్ కంట్రోల్స్ వంటి ఎన్నో అదనపు ఫీచర్లు రెండు వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

సరికొత్త 2020 జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. అవే మునుపటి ఇంజన్‌ మరియు ట్రాన్స్‌మిషన్‌లు యధావిధిగా వచ్చాయి. ఇందులోని 2.0-లీటర్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ 246బిహెచ్‌పి పవర్ మరియు 365ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

జాగ్వార్ ఎక్స్ఇ డీజల్ వెర్షన్‌లో 2.0-లీటర్ ఇంజీనియం డీజల్ ఇంజన్ 178బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యవుతున్నాయి. 2020 ఏప్రిల్ నుండి అమల్లోకి రానున్న బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వీటిని అప్‌గ్రేడ్ చేశారు.

విపణిలోకి జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్.. ధర రూ. 44.98 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జాగ్వార్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన మొట్టమొదటి బిఎస్-6 మోడల్ జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్. సరికొత్త 2020 జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ కారు విపణిలో ఉన్న మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ మరియు ఆడి ఏ4 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
New (2020) Jaguar XE Facelift Launched In India: Prices Start At Rs 44.98 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X