కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్ కోసం ఐదు కొత్త కార్లను ఖరారు చేసింది. మొత్తం కార్లలో టెల్లురైడ్, మరియు సోరెంటో కార్లతో పాటు సోల్ మరియు నిరో అనే రెండు ఎలక్ట్రిక్ కార్లు మరియు కియా ఫ్లాగ్‌షిప్ సెడాన్ స్టింగర్ కార్లు ఉన్నాయి.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

తాజాగా అందిన సమాచారం మేరకు, కార్ల విడి భాగాలను దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్ చేసి ఇండియన్ మార్కెట్లో విక్రయించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఈ ఐదు మోడళ్లను విడి భాగాల రూపంలో దిగుమతి చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కియా అనంతపురం ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబులే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

భారత ప్రభుత్వం దిగుమతులకు సంభందించిన నియమాలలో పలు మార్పులు చేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన దిగుమతి నియమాల మేరకు, దేశీయంగా వాహన పరిశ్రమకు ఊతమిచ్చేందుకు పూర్తిగా తయారైన కార్లు మరియు కార్ల విడి భాగాల దిగుమతి ట్యాక్స్‌ చాలా వరకు తగ్గించారు.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

నూతన దిగుమతి నియమాల మేరకు కార్ల తయారీ సంస్థ ప్రతి ఏడాది సుమారుగా 2,500 వాహనాల వరకు పూర్తిగా తయారైన కార్ల రూపంలో లేదా విడి భాగాల రూపంలో దిగుమతి చేసుకునే కార్లు అంతర్జాతీయ వాహన ప్రమాణాలు పాటించినట్లయితే భారత ప్రభుత్వ అనుమతి లేకుండానే నేరుగా విక్రయించుకోవచ్చు.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

విడి భాగాల రూపంలో దిగుమతి చేసుకున్న కార్లను అసెంబుల్ చేసేందుకు కియా ప్రొడక్షన్ ప్లాంటులో కియా సెల్టోస్ ప్రొడక్షన్ లైన్‌కు పక్కనే అసెంబుల్ లైన్ కూడా ఏర్పాటు చేసుకుంది. విదేశాల్లో పూర్తిగా తయారైన కార్ల మీద ఉన్న దిగుమతి సుంకంతో పోల్చితే విడి భాగాల రూపంలో దిగుమతి చేసేకునే మోడళ్ల మీద ట్యాక్స్ దాదాపు సగం వరకు తక్కువగానే ఉంది. దాంతో కియా మోటార్స్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించాలని భావిస్తున్నారు.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

ఇండియన్ మార్కెట్లో ప్రీమియం మరియు అత్యంత నమ్మదగిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఎదిగేందుకు కియా మోటార్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లతో పాటు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కూడా తీసుకురావాలనే భావిస్తున్నారు. 10 లక్షల నుండి 50 లక్షల ధరల శ్రేణిలో తమ కొత్త కార్లను రిలీజ్ చేయనున్నారు.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేయాలని భావిస్తోంది, సోల్ లేదా నిరో ఎలక్ట్రిక్ కారును తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు కంపెనీ యొక్క మోస్ట్ పాపులర్ సెడాన్ మోడల్, స్టింగర్ కారును కూడా తీసుకురావాలని భావిస్తోంది. కియా స్టింగర్ సెడాన్ కారును 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆవిష్కరించింది.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

కియా తీసుకురాలనుకుంటున్న మరో మోడల్ కియా సోరెంటో, ఇది కంపెనీ యొక్క మిడ్-సైడ్ ఎస్‌యూవీ. వచ్చే ఏడాది ప్రారంభంలో కియా సోరెంటో ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదలను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లో కియా సోరెంటో ఎస్‌యూవీ లాంచ్ మరింత అలస్యమైయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కియా ఇండియన్ మార్కెట్లో తమ రెండవ కారుగా కార్నివాల్ ఎంపీవీ విడుదలను ఖరారు చేసింది. వచ్చే ఏడాది జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కియా కార్నివాల్ 7-సీటర్ ఎంపీవీ విడుదల కానుంది.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

కియా మోటార్స్ సెల్టోస్ విడుదలతో భారీ ప్రకటన చేసింది. కియా సెల్టోస్ విడుదలైనప్పటి నుండి ఇప్పటికే 6,000లకుపైగా కియా కార్లు అమ్ముడయ్యాయి. అనతి కాలంలోనే భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా నిలిచింది. కియా సెల్టోస్‌కు తోబుట్టువుగా చెప్పుకునే హ్యుందాయ్ క్రెటా కారును సేల్స్ పరంగా దాటేసింది. అంతే కాకుండా "వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్" 2019 అవార్డుకు నామినేట్ అయ్యింది.

కియా నుండి దూసుకొస్తున్న ఐదు కొత్త కార్లు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీ విడుదలతో దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టించింది. దేశీయంగా తమ లైనప్‌లో లభించే కార్ల సంఖ్యను ఐదుకు పెంచుకోవాలని భావిస్తోంది. ఇండియన్ మార్కెట్లోని మోస్ట్ పాపులర్ సెగ్మెంట్లలో కియా తమ కొత్త కార్లను విడుదల చేయనుంది. ఏకకాలంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అత్యంత పోటీతత్వంతో కూడిన ధరలను నిర్ణయించేందుకు కార్ల విడి భాగాలను దిగుమతి చేసుకుని, దేశీయంగా అసెంబుల్ చేసి విక్రయించనుంది. ఏదేమైనప్పటికీ కొరియన్ కంపెనీ కియా దేశీయ దిగ్గజాలైన మారుతి, టాటా మరియు మహీంద్రా సంస్థలకు గట్టి పోటీనివ్వబోతోంది.

Most Read Articles

English summary
Kia Motors Considering Five New Cars For The Indian Market: Including Two Electric Vehicles. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X