కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

రెనాల్ట్ ఇండియా కొన్ని సంవత్సరాల క్రితం డస్టర్ ఎస్‌యూవీ ను భారత్ లో లాంచ్ చేసింది. అప్పటి నుండి, ఈ ఎస్‌యూవీ భారతదేశం లో ఒక ఫ్రెంచ్ బ్రాండ్ గా అత్యంత ఆదరణ పొందింది, అయితే తరువాత వచ్చిన కొత్త మోడల్ల వలన దీని అమ్మకాలు పడిపోయే. అయితే దీనిని మార్కెట్లో తిరిగి అమ్మకాలను నెలకొల్పడానికి రెనాల్ట్ ఇప్పటి మార్కెట్కు అనుగుణంగా ఈ ఎస్‌యూవీ కి తేలికపాటి నవీకరణలతో ఇటీవల విడుదల చేసింది. అయితే పాత డస్టర్ మరియు కొత్త డస్టర్ ల మధ్య ఎటువంటి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం రండి..

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

గత ఏడాది కాలంగా డస్టర్ ఎస్‌యూవీ యొక్క అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో. రెనాల్ట్ డస్టర్ దాని రూపకల్పన, ఫీచర్లు మరియు ఇంటీరియర్స్ పరంగా కొత్త అప్ డేట్ లను చేసింది. ఇప్పుడు కొత్త 2019 డస్టర్ మోడల్ ను లాంచ్ చేయడంతో రెనాల్ట్ కొంత నష్టాన్ని తీర్చుకోనుంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

కొత్త రెనాల్ట్ డస్టర్ పేస్లిఫ్ట్ కొత్త అప్డేట్లతో వచ్చింది, అందువలన ఇది ఎస్‌యూవీ సెగ్మెంట్ లో ఆకర్షణీయమైనదిగా నిలిచింది. ఇక్కడ కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత నమూనా రూపకల్పన మధ్య ఒక క్లుప్తమైన తేడాను తెలిపాము చూడండి.

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

డిజైన్

కొత్త రెనాల్ట్ డస్టర్ కొంత మార్పులు మరియు సవరించిన రూపకల్పన అంశాలతో వస్తుంది, ఇది మరింత ప్రీమియం లుక్ తో వచ్చింది. కొత్త డస్టర్ యొక్క ముందు ఒక సవరించిన గ్రిల్ వస్తుంది, క్రోమ్ చొప్పనలు మరియు చుట్టూ అలుముకుంది. హెడ్ ల్యాంప్స్ ఇప్పుడు ప్రొజెక్టర్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడి డ్రిల్స్ తో వస్తుంది, మోడ్రన్ లుక్ కోసం మొత్తం క్లస్టర్ అప్ డేట్ చేయబడింది.

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

రెనాల్ట్ కూడా బానెట్ పై ఉన్న బుల్లింగ్స్ మరియు క్రీజులను సవరించింది, మరింత బల్క్ ఇంకా స్పోర్టివ్ లుక్ ను అందిస్తుంది. ఇది ఇప్పటికీ 16-అంగుళాల చక్రాలను కలిగి ఉంది, అయినప్పటికీ అల్లాయ్ వీల్ డిజైన్ సవరించబడింది.

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ముందు కంటే మరింత స్టైలిష్ గా మరియు ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. వెనుక ప్రొఫైల్ కూడా తక్కువ మార్పులను కలిగి ఉంది, కేవలం నవీకరించబడిన టెయిల్ లైట్లు మరియు ఒక నలుపు క్లాడింగ్ మాత్రమే అదనపు రూపకల్పన కలిగి ఉన్నాయి.

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

ఇంటీరియర్స్

కొత్త రెనాల్ట్ డస్టర్ పేస్లిఫ్ట్ లో కొత్త డ్యాష్ బోర్డ్, మరింత ప్రీమియం లేఅవుట్ ఉంటాయి. కొత్తగా డిజైన్ చేయబడ్డ దీర్ఘచతురస్రాకార ఎసి వెంట్ ల చుట్టూ సెంటర్ కన్సోల్ జివోల్ బ్లాక్ ఫినిష్ ని అందుకుంటుంది. పెద్ద 7.0 అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్ లో కూడా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్లప్లే, నావిగేషన్ వంటి ఇన్ బిల్ట్ ఫీచర్లతో వస్తుంది. డస్టర్ యొక్క స్టీరింగ్ వీల్ ను కూడా రెనాల్ట్ అప్ డేట్ చేసింది.

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

ఇంజన్

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ లు కలవు. పెట్రోల్ ఇంజన్ 106 బిహెచ్ పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును, డీజల్ మోటార్ 85 బిహెచ్ పి మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను విడుదల చేయును. పెట్రోల్ ఇంజన్ ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి గేర్ బాక్స్ లో ఒకదానిని కలిగి వస్తుంది. మరోవైపు డీజల్ ఇంజన్, ఆప్షనల్ ఏఎంటి ట్రాన్స్ మిషన్ తో పాటు సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ను కూడా ఆఫర్ చేస్తోంది

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

ఫీచర్లు

కొత్త రెనాల్ట్ డస్టర్ కొత్త మరియు అదనపు పరికరాల తో పాటు మునుపటి మోడల్ లో లభ్యమయ్యే అన్ని ఫీచర్లతో వస్తుంది. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో కూడిన డస్టర్ ని రెనాల్ట్ అప్డేట్ చేసింది. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో ఈబిడి, ఫ్రంట్ సీట్-బెల్ట్ రిమైండర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ డ్ చైల్డ్ సీట్ మౌంట్ లు మరియు హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. అంతే కాకుండా ఎస్సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్) మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ సిస్టం ప్రామాణికంగానే వస్తాయి.

కొత్త రెనాల్ట్ డస్టర్ మరియు పాత రెనాల్ట్ డస్టర్ మధ్య తేడా తెలుసా

కొత్త రెనాల్ట్ డస్టర్ పేస్లిఫ్ట్ ఇప్పుడు నాలుగు వేరియెంట్లలో లభిస్తుంది- ఆర్ఎక్స్ఇ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్ మరియు ఆర్ఎక్స్ఎస్(ఓ). వీటి ధరలు బేస్ వేరియంట్ రూ. 7.99 లక్షల వద్ద ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 12.50 లక్షలకు పైగా వెళుతుంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉన్నాయి.

Most Read Articles

English summary
New Renault Duster Facelift Vs Old Duster, Here Are All The Differences. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X